మహబూబ్‌నగర్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు కరవు జిల్లాగా ఉండటం దారుణమని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, జూరాల, లోయర్ జూరాల ప్రాజెక్టులను చాడా వెంకటరెడ్డి తోపాటు సీపీఐ నేతల బృందం పరిశీలించింది.
అనంతరం కర్ణాటక డ్యాంను కూడా ఆ బృందం పరిశీలించారు. అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను ఆయన తప్పు బట్టారు. కరవుపై సమగ్ర నివేదికను కేంద్రానికి త్వరగా అందించాలని వారు రాష్ర్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే నీటి పంపకాల విషయంలో ప్రభుత్వం సరైన విధంగా వ్యవహరించడం లేదని చాడా ఆరోపించారు.