యశ్వంతాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో చైన్ స్నాచింగ్
Published Fri, Jul 29 2016 12:00 AM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM
ఇదే రైలులో మరో హాండ్‌బ్యాగ్ అపహరణ
రైల్వేగేట్ : రైలులో దొంగలు హల్‌చల్ చేసి బంగారు గొలుసు, హాండ్‌బ్యాగ్ దోచుకెళ్లిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వరంగల్ జీఆర్‌పీ ఎస్సై ఎస్. శ్రీనివాస్ కథనం ప్రకారం.. బెంగళూర్‌కు చెందిన దివ్యమిశ్రా తన భర్తతో కలిసి యశ్వంతాపూర్ నుంచి లక్నో వెళ్లే యశ్వంతాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎస్–7 కోచ్‌లో ప్రయాణిస్తోంది. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఇంటికన్నె–నెక్కొండ స్టేషన్‌ల మధ్య దొంగలు చైన్‌లాగి రైలు ఆపారు. కోచ్‌లో ఉన్న దివ్యమిశ్రా మెడలోని రెండు తులాల బంగారు గొలుసు అపహరించారు.
అదే బోగిలోని జబల్‌పూర్‌కు చెందిన రాజు సింగ్ అనే ప్రయాణికుడి భార్య హ్యాండ్‌బ్యాగు కూడా అపహరించారు. ఈ బ్యాగులో నోకియా సెల్, రూ.4000 నగదు, ఆధార్, పాన్ కార్డుతో పాటు ఏటీఎం కార్డు ఉన్నట్లు ఎస్సై తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement