gold chain snatching
-
షిర్డీ రైలులో చైన్ లాగి బ్యాగులతో పరుగు.. అప్రమత్తమైన ప్రయాణికులు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ మీదుగా తిరుపతి నుంచి షిర్డీ వెళ్తున్న సాయినగర్ షిర్డీ రైలులో దొంగతనానికి పాల్పడిన తొమ్మిది మంది యువతులను ప్రయాణికులు పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. రైలు నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత నవీపేట్ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఉండటంతో అక్కడ అగిపోయింది. దీంతో మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యువతులు రైలులో ఎక్కారు. యువతులు ఎస్1 నుంచి ఎస్10 బోగీలలో అటుఇటూ తిరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. మొదట ఓ బోగీలో ప్రయాణికుడి బ్యాగ్ కనబడకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అప్రమత్తమైన ఆ కోచ్‌లోని మిగతా వారు తమ బ్యాగ్‌లను చెక్ చేసుకోగా మరో ఆరుగురికి చెందిన బ్యాగులు కూడా కనిపించలేదు. దీంతో బోగీలో కలకలం రేగింది. కొందరు ప్రయాణికులు బాసర వద్ద ట్రైన్ చైన్ లాగడంతో ఆగిపోయింది. ఈ క్రమంలో కొందరు యువతులు బ్యాగులతో పరుగెత్తడంతో ప్రయాణికులు పట్టుకున్నారు. బాసర పోలీసులకు సమాచారం అందించి, మొత్తం తొమ్మిది మందిని అప్పగించారు. ఆర్ఎస్ఎఫ్, బాసర పోలీసులు అక్కడి నుంచి యువతులను నిజామాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారిస్తున్న రైల్వే పోలీసులు రంగస్వామి అనే ప్రయాణికుడికి చెందిన బ్యాగ్‌తో పాటు ల్యాప్‌టాప్, కొంత నగ దు, ఓ మహిళ మెడలోని బంగారు చైన్ పోయినట్లు తెలిసింది. పావని, ధనుంజయ్, షేక్ నజీర్‌బాషా, లీలావతి, సుబ్బారాయుడు, శ్రీనివాస్ అనే ప్రయాణికుల బ్యాగ్‌లు పోయాయి. మూడు బ్యాగ్‌ల ను పోలీసులు రైల్వేపట్టాల పక్కన గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బ్యా గులను యువతులు బాత్రూంలలో పె ట్టినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకు న్న తొమ్మిది మందిని రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. యువతులు నాందేడ్‌లోని గురుద్వార్‌కు వెళ్లి అక్కడ నుంచి నిజామాబాద్ వచ్చినట్లు తెలిసింది. -
వైరల్ : బరితెగించారు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో చైన్‌స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను బెదిరించి బంగారు ఆభరణాలను అపహరిస్తున్నారు. ఢిల్లీలోని దయాల్‌పుర్ ప్రాంతంలో ఓ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు.. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ నుంచి బంగారు గొలుసును కాజేశారు. తన కొడుకుతో కలిసి రోడ్డుపై వెళ్తున్న ఆమెను బైక్ మీద వచ్చిన చైన్ స్నాచర్స్ ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కునే ప్రయత్నం చేశారు. మెడలో నుంచి గొలుసు రాకపోవడంతో బైక్ నుంచి కిందికి దిగి కత్తితో బెదిరించి లాక్కెళ్లారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఆ ఇద్దర్నీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు నగలను కూడా స్వాధీనం చేసుకున్నారు. #WATCH Two bike-borne men rob a woman at knifepoint in Delhi's Dayalpur (Source CCTV footage). Both the culprits were apprehended by the police and the robbed gold chain was recovered from their possession. (26/10/18) pic.twitter.com/4mr5VIdAAy — ANI (@ANI) November 3, 2018 -
యశ్వంతాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో చైన్ స్నాచింగ్
ఇదే రైలులో మరో హాండ్‌బ్యాగ్ అపహరణ రైల్వేగేట్ : రైలులో దొంగలు హల్చల్ చేసి బంగారు గొలుసు, హాండ్‌బ్యాగ్ దోచుకెళ్లిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వరంగల్ జీఆర్పీ ఎస్సై ఎస్. శ్రీనివాస్ కథనం ప్రకారం.. బెంగళూర్‌కు చెందిన దివ్యమిశ్రా తన భర్తతో కలిసి యశ్వంతాపూర్ నుంచి లక్నో వెళ్లే యశ్వంతాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎస్–7 కోచ్‌లో ప్రయాణిస్తోంది. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఇంటికన్నె–నెక్కొండ స్టేషన్ల మధ్య దొంగలు చైన్‌లాగి రైలు ఆపారు. కోచ్‌లో ఉన్న దివ్యమిశ్రా మెడలోని రెండు తులాల బంగారు గొలుసు అపహరించారు. అదే బోగిలోని జబల్పూర్కు చెందిన రాజు సింగ్ అనే ప్రయాణికుడి భార్య హ్యాండ్‌బ్యాగు కూడా అపహరించారు. ఈ బ్యాగులో నోకియా సెల్, రూ.4000 నగదు, ఆధార్, పాన్ కార్డుతో పాటు ఏటీఎం కార్డు ఉన్నట్లు ఎస్సై తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
మిస్టరీగానే ఆ స్నాచింగ్స్!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ముర్తుజా నేతృత్వం లోని గ్యాంగ్‌ను అక్కడి పోలీసులు పట్టుకున్నారు... సెప్టెంబర్ 27, 29 తేదీల్లో జంట కమిషనరేట్లలో జరిగిన వరుస స్నాచింగ్స్ వీరి పనేనని తేలింది... అయితే ఫిల్మ్‌నగర్ పరిధిలో చోటు చేసుకున్న రెండు వరుస స్నాచింగ్స్తో ఈ ముఠాకు సంబంధంలేదని వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనల్లో మాజీ మంత్రి బంధువు ఒకరు బాధితురాలు కావడంతో నగర పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ 29 ఉదయం ఎస్సార్‌నగర్, చిక్కడపల్లి, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, సనత్‌నగర్ ఠాణాలతో పాటు జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలోనూ స్నాచింగ్స్ జరిగాయి. భోపాల్ పోలీసు ల అదుపులో ఉన్న ముర్తుజా గ్యాంగ్‌ను నగర పోలీసు బృందం విచారించగా ఫిల్మ్‌నగర్‌లో మినహా మిగిలిన స్నాచింగ్స్ తామే చేశామని అంగీకరించారు. సాంకేతిక ఆధారాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అత్త సత్యవతి ఆ రోజు ఫిల్మ్‌నగర్‌లోని ఓ గుడిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చి కారు కోసం వేచి ఉండగా ఇద్దరు స్నాచర్లు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కుపోయారు. ఈ ఘటనలో కిందపడిన సత్యవతి గాయపడ్డారు. అదే దారిలో ముందుకు వెళ్లిన స్నాచర్లు ఫిల్మ్‌నగర్ బస్తీకి చెందిన మల్లీశ్వరి ఫిలింనగర్ రోడ్ నెం.1లోని బీఎన్ఆర్ బ్రిలియంట్ స్కూల్ వద్ద రోడ్డు దాటుతుండగా రెండు తులాల గొలుసు లాక్కెళ్లారు. కింద పడటంతో ఈమెకూ తీవ్ర గాయాలయ్యాయి. ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాలో హెల్మెట్, మాస్క్‌తో ఉన్న దుండగులు ఫొటోలు రికార్డయ్యాయి. వీటిని మీడియాకు విడుదల చేసిన పోలీసులు ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. ముర్తుజా గ్యాంగ్ అరెస్టుతో ఈ రెండు స్నాచింగ్స్ కూడా కొలిక్కి వచ్చినట్టే అని పోలీసులు తొలుత భావించారు. అయితే, విచారణలో తాము జూబ్లీహిల్స్‌లో స్నాచింగ్ చేయలేదని ముర్తుజా ముఠా చెప్పడంతో ఇప్పుడు అసలు దొంగల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. భోపాల్ పోలీసులకు చిక్కిన ముర్తుజా గ్యాంగ్ దేశ వ్యాప్తంగా 13 నగరాల్లో పంజా విసిరింది. వీరు ఎప్పుడు పోలీసులకు పట్టుబడినా... కొన్ని నెలల్లోనే జైలు నుంచి బయటకు వచ్చి అదే రాష్ట్రంలోని మరో ప్రాంతంలో పంజా విసురుతారు. ముర్తుజా నేతృత్వంలోని గ్యాంగ్‌ను గతేడాది జనవరి 8న తమిళనాడులోని కోయంబత్తూరు పోలీసులు పట్టుకున్నారు. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ముర్తుజా ఏడు నెల ల్లోనే ముఠాను మార్చి చెన్నైలో పంజా విసిరాడు. వీరు సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కు వచ్చినట్లే అప్పట్లో చెన్నై చేరుకున్నారు. భోపాల్ నుంచి కర్ణాటకలోని బీదర్‌కు వచ్చి, అక్కడ నుంచి రెండు బైకులతో సహా రైలులో చెన్నై వెళ్లి నేరా లు చేశారు. గతేడాది ఆగస్టు 9న చెన్నై పోలీసులకు చిక్కారు. అక్కడి జైలు నుంచి బయటకు వచ్చి బెంగళూరు, దావళగెరె, మైసూర్‌లతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, విశాఖపట్నం, విజ యవాల్లో తమ ‘పనితనం’ చూపించారు.