బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చాంద్‌బాషా
Published Fri, Sep 16 2016 11:41 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
– ప్రధాన కార్యదర్శిగా సి.వి. శ్రీనివాసులు విజయం
– ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
కర్నూలు(లీగల్): జిల్లా న్యాయవాద సంఘం అధ్యక్షుడిగా ఎస్.చాంద్‌బాషా, ప్రధాన కార్యదర్శిగా సి.వి.శ్రీనివాసులు(వాసు)లు గెలుపొందారు. నాలుగు పదవుల కోసం నిర్వహించిన పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. అధ్యక్ష స్థానం కోసం పోటీ చేసిన చాంద్‌బాషా తన ప్రత్యర్థి ఎం.సుబ్బయ్యపై 312 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ఉపాధ్యక్ష స్థానం కోసం పోటీ చేసిన ఎ.అనిల్‌కుమార్ తన ప్రత్యర్థి బి.దేవపాల్‌పై 351 ఓట్లతో, ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన జి.జయలక్ష్మిదేవిపై సి.వి.శ్రీనివాసులు 429 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మహిళా ప్రతినిధిగా బి.గీతామాధురి, సుమలత, వరలక్ష్మిలు పోటీ పడగా గీతామాధురి 238 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 777 మంది ఓటర్లుండగా ఎన్నికలో 684 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో న్యాయవాదులు తమ ఓటును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన చాంద్ బాషా, అనిల్‌కుమార్, సి.వి.శ్రీనివాసులు, ఏకగ్రీవంగా కార్యదర్శి పదవికి ఎన్నికైన కర్నాటి పుల్లారెడ్డి, కోశాధికారిగా ఎన్నికైన ఎం.ఏ. తిరుపతయ్య, గ్రంథాలయ కార్యదర్శి అబ్దుల్ కరీం, మహిళా ప్రతినిధి గీతామాధురిలకు ఎన్నికల అధికారి ఎన్.నారాయణరెడ్డి డిక్లరేషన్ ఫారాలను అందించి అభినందించారు. ఎన్నికల సహ అధికారులుగా ఎం. శ్రీనివాసరెడ్డి, ఎస్.మనోహర్, రాజ్‌మోహన్‌రెడ్డి, బి.లోకేశ్వర్‌రెడ్డిలు వ్యవహరించారు.
Advertisement
Advertisement