
విషజ్వరంతో బాలిక మృతి
హిందూపురం అర్బన్ : హిందూపురం సమీపంలోని నందమూరినగర్‌కు చెందిన చాందిని (18) గురువారం స్థానిక ఎస్‌బీఐ సర్కిల్ వద్ద ఉన్న శ్రీనివాస క్లినిక్‌లో చికిత్స పొందుతూ గురువారం మతి చెందింది. బాలిక మతికి ఆర్‌ఎంపీ డాక్టరే కారణమంటూ కుటుంబసభ్యులు క్లినిక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఇంటర్మీడియట్ చదువుతున్న చాందినికి తీవ్రమైన జ్వరం వచ్చింది. దీంతో తండ్రి నరసింహప్ప హిందూపురం పట్టణంలోని శ్రీనివాస క్లినిక్‌లో చికిత్స కోసం చేర్చారు. డాక్టర్ నరసింహారెడ్డి ప్రథమ చికిత్స చేసి వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తీవ్ర జ్వరంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తండ్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షలు చేసి బాలిక మతి చెందిందని చెప్పారు.
దీంతో తండ్రి కన్నీరు మున్నీరవుతూ తిరిగి శ్రీనివాస క్లినిక్ వద్దకే శవంతో వచ్చి ఆందోళన చేపట్టారు. బాధిత బంధువులు కూడా వచ్చి గుండెలు బాదుకుంటూ రోదనలు చేశారు. ఆర్‌ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యంతోనే చనిపోయిందని శాపనార్థాలు పెట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నాయకులు చేరుకుని బాధితుల పక్షాన నిలిచి డాక్టర్‌ను నిలదీశారు. వెంటనే వన్‌టౌన్ ఎస్‌ఐ వెంకటేష్, స్పెపల్ పార్టీ పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబసభ్యలకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. కాగా ఆస్పత్రికి చేరుకునే సమయానికే చాందినికీ తీవ్ర జరం ఉండేదని.. దాంతో ప్రభుత్వాస్పత్రికి సూచించామని డాక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. అయితే బాలిక మతి విషయమై బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.