వంచనకు మారుపేరు చంద్రబాబు | chandrababu is cheater | Sakshi
Sakshi News home page

వంచనకు మారుపేరు చంద్రబాబు

Published Sun, Jul 24 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

వంచనకు మారుపేరు చంద్రబాబు

వంచనకు మారుపేరు చంద్రబాబు

– గడపగడపకూ వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 
– డోన్‌ పట్టణంలోని 6వ వార్డులో విçస్తృత ప్రచారం
 
డోన్‌ టౌన్‌ : అధికారం చేపట్టేందుకు అమలుచేయలేని హామీలతో టీడీపీ ప్రజలను మభ్యపెట్టి, వంచించిందని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శనివారం డోన్‌ మున్సిపల్‌ పరిధిలోని 6వ వార్డులో జరిగిన గడపగడపకూ వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమంలో బుగ్గన పాల్గొన్నారు. ఈసందర్భంగా స్థానిక నాయకులు హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు బుగ్గనకు ఘనస్వాగతం పలికారు.
వంచన చంద్రబాబు నైజం...
ప్రజలను వంచించిడంలో చంద్రబాబు దిట్ట, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని బుగ్గన అన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలæమాఫీ, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, పలుకులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో కలుపుతామన్న హామీలు, కాపులను బీసీల్లో చేరుస్తామన్న వాగ్ధానాలతో అధికారం చేపట్టీన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
ఉపాధి ఉత్తుత్తి మాటే...
ఇంటికో ఉద్యోగం, యువతకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ భతి అంటూ ఆశచూపి, ఎన్నికల్లో గెలిచిన తరువాత వారి ఆశలు అడియాశలు చేశారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వైఖరి ఏరు దాటేంతవరకు ఓడ మల్లన్న ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న అనే చందంగా ఉందన్నారు. చంద్రబాబు అసలు నైజాన్ని ప్రజలకు వివరించేందుకే వైఎస్‌ఆర్‌సీపీ గడపగడపకు వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేస్తోందని అన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డోన్‌ జెడ్పీటీసీ శ్రీరాములు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రామకష్ణారెడ్డి, మల్లెంపల్లె రామచంద్రుడు,సుబ్బరాయుడు, శివయ్య, హనుమంతరెడ్డి, ఆర్‌ఈ రాజవర్దన్, దినేశ్‌గౌడ్, గజేంద్ర, రాజశేఖర్‌రెడ్డి, ఎర్రమల, పాలుట్ల రఘురాం, వెంకటేశ్వరరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నేరుడుచెర్ల చంద్ర తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement