Gadapagadapaku Ysrcp
-
వంచనకు మారుపేరు చంద్రబాబు
– గడపగడపకూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి – డోన్ పట్టణంలోని 6వ వార్డులో విçస్తృత ప్రచారం డోన్ టౌన్ : అధికారం చేపట్టేందుకు అమలుచేయలేని హామీలతో టీడీపీ ప్రజలను మభ్యపెట్టి, వంచించిందని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శనివారం డోన్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో జరిగిన గడపగడపకూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో బుగ్గన పాల్గొన్నారు. ఈసందర్భంగా స్థానిక నాయకులు హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు బుగ్గనకు ఘనస్వాగతం పలికారు. వంచన చంద్రబాబు నైజం... ప్రజలను వంచించిడంలో చంద్రబాబు దిట్ట, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని బుగ్గన అన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలæమాఫీ, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, పలుకులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో కలుపుతామన్న హామీలు, కాపులను బీసీల్లో చేరుస్తామన్న వాగ్ధానాలతో అధికారం చేపట్టీన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఉపాధి ఉత్తుత్తి మాటే... ఇంటికో ఉద్యోగం, యువతకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ భతి అంటూ ఆశచూపి, ఎన్నికల్లో గెలిచిన తరువాత వారి ఆశలు అడియాశలు చేశారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వైఖరి ఏరు దాటేంతవరకు ఓడ మల్లన్న ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న అనే చందంగా ఉందన్నారు. చంద్రబాబు అసలు నైజాన్ని ప్రజలకు వివరించేందుకే వైఎస్ఆర్సీపీ గడపగడపకు వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేస్తోందని అన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డోన్ జెడ్పీటీసీ శ్రీరాములు, వైఎస్ఆర్సీపీ నాయకులు రామకష్ణారెడ్డి, మల్లెంపల్లె రామచంద్రుడు,సుబ్బరాయుడు, శివయ్య, హనుమంతరెడ్డి, ఆర్ఈ రాజవర్దన్, దినేశ్‌గౌడ్, గజేంద్ర, రాజశేఖర్‌రెడ్డి, ఎర్రమల, పాలుట్ల రఘురాం, వెంకటేశ్వరరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నేరుడుచెర్ల చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పీడనపై పాశుపతాస్త్రం ‘గడపగడపకూ వైఎస్సార్సీపీ’
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి పార్టీ అధి నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. పార్టీ కార్య క్రమాలను ప్రజలకు వివరించడం, రాష్ట్ర సీఎం చంద్రబాబు వైఫల్యాలు, అవినీతిని ప్రజలలో ఎండ గట్టడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎన్నికలలో చేసిన వాగ్దానాల అమలులో టీడీపీ ఘోర వైఫల్యం చెందింది. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ ఆశ్రీతపక్షపాతం చోటు చేసుకుం టోంది. గడిచిన రెండేళ్లలో టీడీపీ చేసిన వాగ్దా నాలు.. రైతుల రుణాల రద్దు, డ్వాక్రా రుణాల రద్దు, చేనేత కార్మికుల రుణాల రద్దు, ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతిలాంటివి అమలు పరచడంలో చిత్త శుద్ధి కొరవడింది. రైతుల ఆత్మహత్యలు, వలసల్ని అరికట్టడంలో బాబు వైఫల్యాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మరోవైపు వెఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రెండేళ్లలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఏ సంఘటన జరిగినా ప్రజల చెంతకు వెళ్లి వారికి అండదండగా తానున్నా ననే భరోసా కల్పించడంలో సఫలీ కృతులయ్యారు. ప్రభుత్వ కపట రాజకీయాలను ప్రజల్లో ఎండ గట్టారు. దీంతో అభద్రతా భావా నికి గురైన బాబు అవినీతి సొమ్ముతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను, శ్రేణులను కొనుగోలు చేసి ఫిరాయింపులను ప్రోత్సహించారు. గత రెండేళ్లుగా పార్టీని ముందుకు తీసుకుపోవ డంలో తీవ్రంగా శ్రమించిన జగన్మోహన్రెడ్డి.. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు మొత్తంగా పార్టీ అంతా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తిం చారు. పార్టీ ఒక వ్యవస్థగా ప్రజల చెంతకు ఎంత చేరువైందో తెలుసుకోవడానికి, ఒక రకంగా ప్రజ లకు నాయకులను మధ్య తెరలూ, దాపరికం లేని సంబంధాలు ఏర్పర్చుకోవడానికి ఈ కార్యక్రమం ఓ చక్కటి అవకాశం. ప్రభుత్వ వైఫల్యాల ఆధా రంగా వైఎస్ఆర్సీపీ ప్రజలకు దగ్గర కావడానికి, ప్రజలు పార్టీ నుంచి ఏమి ఆశిస్తున్నారు అనే అంశాన్ని పార్టీ శ్రేణులు ప్రజల నుంచి తెలుసుకోవడానికి ఈ కార్య క్రమం దోహదం చేస్తుంది. రాజకీయ నాయకులు బాధ్యత మరిస్తే వారిని ప్రజలు ప్రశ్నించాల్సిందిగా, నిలదీయాల్సిందిగా చెప్పులు, పొరకలు చూపించాల్సిందిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించిన సందర్భంలో వారి ఆవేదన, ఆక్రం దన గమనించిన తరువాత ఆయన ఆ విధంగా స్పందించారు. ఈ ప్రకటన రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చలేవనెత్తింది. విజయవాడలో వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయాల్లో బాధ్యత మరచిన నాయకుల పట్ల ఇలాగే ప్రజలు స్పందించాలని, ఒకవేళ తాను ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచకపోతే తనను కూడా ప్రజలు ఇలాగే నిలదీయవచ్చని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘గడప గడపకూ వైఎస్సార్సీపీ’ కార్యక్రమం సహజంగా టీడీపీ వర్గాలలో కలవరం సృష్టిస్తోంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా చేపట్టిన గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని ఎంతో బాధ్యతతో పార్టీ శ్రేణులు అందుకోవాలి. వైఎస్సార్సీపీలోని ద్వితీయశ్రేణి నాయకులు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు అందించే నిజ మైన నివాళి ఏదంటే గడగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే. (జూలై 8న గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమ ప్రారంభం) వ్యాసకర్త కదలిక సంపాదకులు 9989904389 - ఇమామ్ -
'యువ నాయకత్వానికే వైఎస్ జగన్ ప్రాధ్యానత'
న్యూజెర్సీ: వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ విభాగం శుక్రవారం న్యూజెర్సీలోని ఎడిసిన్ నగరంలో మీట్ అండ్ గ్రీట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు 'గడపగడపకూ వైఎస్ఆర్సీపీ' కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెప్పారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అవినీతిపాలన, రెండేళ్ల పాలనలో టీడీపీ వైఫల్యాలను ఆయన వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందడుగు వేయాలంటూ యువతకు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐ కమిటీ కోర్ టీమ్ మెంబర్ పాల త్రివిక్రమ్ భానోజిరెడ్డి మాట్లాడుతూ.. యువ నాయకత్వానికే వైఎస్ జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, యువనాయకత్వం వల్లే పార్టీ పునాదికి బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో విశాఖ రైల్వే జోన్, ఏపీకి ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్షపై ఆయన ప్రశంసించారు. అమెరికాలో వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ విభాగం సేవలను త్రివిక్రమ్ భానోజిరెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ స్టూడెంట్ విభాగ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను మరిచి అవినీతిపై చూపించిన శ్రద్ధ ప్రజలకు మేలు చేయడంలో చూపించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వందకుపైగా పాల్గొన్న వైఎస్ఆర్ అభిమానులకు అందరికీ ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ కమిటీ కోర్ టీమ్ మెంబర్ త్రివిక్రమ్ భానోజిరెడ్డి పాలా, వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ స్టూడెంట్ విభాగ అధ్యక్షుడు సాత్విక్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, నుతక్కి నాని తదితరులు పాల్గొన్నారు.