పీడనపై పాశుపతాస్త్రం ‘గడపగడపకూ వైఎస్సార్‌సీపీ’ | Gadapagadapa ku Ysrcp programme to ask on chandrababu naidu govt failures | Sakshi
Sakshi News home page

పీడనపై పాశుపతాస్త్రం ‘గడపగడపకూ వైఎస్సార్‌సీపీ’

Published Thu, Jul 7 2016 12:29 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

పీడనపై పాశుపతాస్త్రం ‘గడపగడపకూ వైఎస్సార్‌సీపీ’ - Sakshi

పీడనపై పాశుపతాస్త్రం ‘గడపగడపకూ వైఎస్సార్‌సీపీ’

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి పార్టీ అధి నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. పార్టీ  కార్య క్రమాలను ప్రజలకు వివరించడం, రాష్ట్ర సీఎం చంద్రబాబు వైఫల్యాలు, అవినీతిని ప్రజలలో ఎండ గట్టడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
 
 ఎన్నికలలో చేసిన వాగ్దానాల అమలులో టీడీపీ ఘోర వైఫల్యం చెందింది. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ ఆశ్రీతపక్షపాతం చోటు చేసుకుం టోంది. గడిచిన రెండేళ్లలో టీడీపీ చేసిన వాగ్దా నాలు.. రైతుల రుణాల రద్దు, డ్వాక్రా రుణాల రద్దు, చేనేత కార్మికుల రుణాల రద్దు, ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతిలాంటివి అమలు పరచడంలో చిత్త శుద్ధి కొరవడింది. రైతుల ఆత్మహత్యలు, వలసల్ని అరికట్టడంలో బాబు వైఫల్యాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
 
 మరోవైపు వెఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రెండేళ్లలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఏ సంఘటన జరిగినా ప్రజల చెంతకు వెళ్లి వారికి అండదండగా తానున్నా ననే భరోసా కల్పించడంలో సఫలీ కృతులయ్యారు. ప్రభుత్వ కపట రాజకీయాలను ప్రజల్లో ఎండ గట్టారు. దీంతో అభద్రతా భావా నికి గురైన బాబు అవినీతి సొమ్ముతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, శ్రేణులను కొనుగోలు చేసి ఫిరాయింపులను ప్రోత్సహించారు.
 
 గత రెండేళ్లుగా పార్టీని ముందుకు తీసుకుపోవ డంలో తీవ్రంగా శ్రమించిన జగన్‌మోహన్‌రెడ్డి..  పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు మొత్తంగా పార్టీ అంతా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తిం చారు. పార్టీ ఒక వ్యవస్థగా ప్రజల చెంతకు ఎంత చేరువైందో తెలుసుకోవడానికి, ఒక రకంగా ప్రజ లకు నాయకులను మధ్య తెరలూ, దాపరికం లేని  సంబంధాలు ఏర్పర్చుకోవడానికి ఈ కార్యక్రమం ఓ చక్కటి అవకాశం. ప్రభుత్వ వైఫల్యాల ఆధా రంగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రజలకు దగ్గర కావడానికి, ప్రజలు పార్టీ నుంచి ఏమి ఆశిస్తున్నారు అనే అంశాన్ని పార్టీ శ్రేణులు ప్రజల నుంచి తెలుసుకోవడానికి ఈ కార్య క్రమం దోహదం చేస్తుంది.
 
 రాజకీయ నాయకులు బాధ్యత మరిస్తే వారిని ప్రజలు ప్రశ్నించాల్సిందిగా, నిలదీయాల్సిందిగా చెప్పులు, పొరకలు చూపించాల్సిందిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో  చేపట్టిన  రైతు భరోసా యాత్రలో, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించిన సందర్భంలో వారి ఆవేదన, ఆక్రం దన గమనించిన తరువాత ఆయన ఆ విధంగా స్పందించారు. ఈ ప్రకటన రాష్ట్రంలో తీవ్రస్థాయిలో  చర్చలేవనెత్తింది. విజయవాడలో వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయాల్లో బాధ్యత మరచిన నాయకుల పట్ల ఇలాగే ప్రజలు స్పందించాలని, ఒకవేళ తాను ఇచ్చిన వాగ్దానాలను  అమలు పరచకపోతే తనను కూడా ప్రజలు ఇలాగే నిలదీయవచ్చని స్పష్టం చేశారు.
 
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘గడప గడపకూ వైఎస్సార్‌సీపీ’ కార్యక్రమం సహజంగా టీడీపీ వర్గాలలో కలవరం సృష్టిస్తోంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా చేపట్టిన గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని ఎంతో బాధ్యతతో పార్టీ శ్రేణులు అందుకోవాలి. వైఎస్సార్‌సీపీలోని ద్వితీయశ్రేణి నాయకులు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు అందించే నిజ మైన నివాళి ఏదంటే గడగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే.
  (జూలై 8న గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమ ప్రారంభం)
 వ్యాసకర్త కదలిక సంపాదకులు  9989904389
 - ఇమామ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement