చీప్‌ట్రిక్స్‌ | cheap tricks | Sakshi
Sakshi News home page

చీప్‌ట్రిక్స్‌

Published Wed, Jul 20 2016 1:42 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

cheap tricks


సాక్షి ప్రతినిధి, కడప: కార్పొరేటర్లను మభ్యపెట్టి టీడీపీ కండువా కప్పించిన వైనం బహిర్గతమైంది. వాస్తవ పరిస్థితి తెలుసుకొని తీవ్ర ఆవేదనకు గురై, అకారణంగా అబాసుపాలు చేశారని పశ్చాత్తాపం తెరపైకి వచ్చింది. అదే విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలకు వివరించి, విచారం వ్యక్తం చేస్తుండగా టీడీపీ నేతలు కిడ్నాప్‌ డ్రామా అంశాన్ని రక్తికట్టించారు. వెరసి డీఎస్పీ చెంతకు వ్యవహారం చేరింది. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం 8 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి కడప చేరుకున్న కార్పొరేటర్లు వారి బంధువులు, హితులను చూడగానే వాస్తవంగా జరిగిన పరిస్థితులను వివరించసాగారు. ఈక్రమంలోనే 8వడివిజన్‌ కార్పొరేటర్‌ జమ్మిరెడ్డి తనకు అత్యంత సన్నిహితుడైనా వైఎస్సార్‌సీపీ నేత రాణాప్రతాప్‌కు వివరించారు. అదే విషయాన్ని మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషాలకు వివరిద్దామని ఇద్దరు వెళ్లారు. నేతలకు వాస్తవ పరిస్థితులు వివరించారు. బుధవారం మీడియా ఎదుట అదే విషయాన్ని వివరించాలని ఎమ్మెల్యే, మేయర్‌ సూచించినట్లు సమాచారం. ఆపై ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. సాయంత్రం చిన్నచౌక్‌ సీఐ రామకష్ణ స్వయంగా రాణాప్రతాప్‌కు ఫోన్‌ చేసి కార్పొరేటర్‌ జమ్మిరెడ్డిని కిడ్నాప్‌ చేశావంటా అంటూ వాకబు చేశారు. టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా తీసుకెళ్లి సీఎంతో కండువా కప్పించడమే కాకుండా, తిరిగి తాము కిడ్నాప్‌ చేశారంటారేమిటి? అని అదే విషయాన్ని జమ్మిరెడ్డికి వివరించారు. ఆమేరకు డీఎస్పీ అశోక్‌కుమార్‌ కార్యాలయానికి చేరుకొని కార్పొరేటర్‌ జమ్మిరెడ్డి వాస్తవ పరిస్థితిని వివరించారు.
అసలేం జరిగిందంటే..
జమ్మిరెడ్డి వద్దకు గ్రం«థాలయ సంస్థ మాజీ చైర్మన్‌ అందూరు రాంప్రసాద్‌రెడ్డి, ఆయన సోదరుడు కార్పొరేటర్‌ రాజగోపాల్‌రెడ్డి ఆదివారం వెళ్లారు. వైఎస్సార్‌సీపీ నేత రాణాప్రతాప్‌ చెప్పారు.. నిన్ను హైదరాబాద్‌కు తీసుకురమ్మన్నారు, పోదాం...రెడీ కావాలంటూ తెలిపారు. 7వడివిజన్‌ కార్పొరేటర్‌ చిన్నబాబును కూడా నేరుగా రాణా పిలుచుకువస్తున్నాడని చెప్పడంతో అందూరు సోదరుల మాట జమ్మిరెడ్డి నమ్మాడు. వారితో పాటు హైదరాబాద్‌కు వెళ్లాడు. ఉదయాన్నే రాణాప్రతాప్‌ ఎక్కడ ఉన్నారు, కనీసం ఒక్కసారైనా మాట్లాడించండి, రాణాతో మాట్లాడకుండా నేను పార్టీ మారేందుకు రాను అంటూ జమ్మిరెడ్డి తెగేసి చెప్పారు. ఈక్రమంలో జమ్మిరెడ్డి ఫోన్‌ సైతం లాక్కొని టీyీ పీ ఆఫీసు వద్దకే రాణా వస్తున్నాడు, అక్కడే మాట్లాడుదాం అంటూ బుకాయించారు. అనంతరం చంద్రబాబుతో టీడీపీ కండువా కప్పించారు. ఇలా చేశారేంటీ అంటూ జమ్మిరెడ్డి వాపోతే, ఏమి కాదులే మేం మాట్లాడుతాం, అంటూ వ్యవహారాన్ని దాటవేశారు. మంగళవారం కడప చేరుకున్న జమ్మిరెడ్డి వాస్తవాలను సన్నిహితులకు తెలిపారు. ఆమేరకు రాణా ప్రతాప్‌ను చూడగానే బోరున వీలపించారు. ‘నన్ను మోసం చేశారు...నీపేరు చెప్పి అక్కడి తీసుకెళ్లారని’ వాపోయారు. అదే విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలకు సైతం వివరించారు. ఇలాగే మరోఇద్దరు కార్పొరేటర్లను సైతం తరలించి టీడీపీ కండువా కప్పినట్లు సమాచారం.
కిడ్నాప్‌ డ్రామా తెరపైకి తెచ్చిన టీడీపీ
ఓ వైపు కార్పొరేటర్‌ జమ్మిరెడ్డి వ్యవహారం బహిర్గతం కావడంతో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా కిడ్నాప్‌ డ్రామా తెరపైకి తెచ్చింది. ఆమేరకే చిన్నచౌక్‌ సీఐ రామకష్ణ వైఎస్సార్‌సీపీ నేత రాణాకు ఫోన్‌చేసి జమ్మిరెడ్డిని ‘కిడ్నాప్‌ చేశావంటా, ఎక్కడున్నావ్‌ నీవు’ అంటూ గద్దింపు వ్యవహారం తెరపైకి వచ్చింది. దాంతో తేరుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు నేరుగా డీఎస్పీ ఆశోక్‌కుమార్‌ను కలిసి వాస్తవ పరిస్థితిని వివరించారు. రాంప్రసాద్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తనను మోసం చేశారని, నమ్మబలికి బలవంతంగా టీడీపీ కండువా కప్పించారని జమ్మిరెడ్డి తెలిపారు. చంద్రబాబు సమక్షంలో వారందరీ ముందర తాను ఏమి చేయలేకపోయానని, కడపకు వస్తానే తన వారందరితో ఏడ్చుకున్నానని తెలిపారు. ఆమేరకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగాఈ విషయమై చిన్నచౌక్‌ సీఐ రామకష్ణ వివరణ కోరగా జమ్మిరెడ్డి కిడ్నాప్‌ అయినట్లు ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు. జమ్మిరెడ్డి సంబం«ధికులు వచ్చి కిడ్నాప్‌ చేశారంటూ ఫిర్యాదు చేయడంతో రాణాప్రతాప్‌ అనే వ్యక్తికి ఫోన్‌ చేసినట్లు తెలిపారు. మొత్తం వ్యవహారంలో టీడీపీ డొల్లతనం బహిర్గతమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement