విజిలెన్స్ అధికారినంటూ ఓ వ్యక్తి విశ్రాంత ఉద్యోగి నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని ఉడాయించిన ఘటనపై కేసు నమోదైంది.
తాడేపల్లిగూడెం రూరల్ : విజిలెన్స్ అధికారినంటూ ఓ వ్యక్తి విశ్రాంత ఉద్యోగి నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని ఉడాయించిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గణేష్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ ఎంఈవో దంగేటి సూర్యారావు ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి మోటారు బైక్‌పై బయలుదేరి తాలూకా ఆఫీస్ సెంటర్‌కు చేరుకున్నాడు. ఇంతలో అంబాసిడర్ కారులో ఒక వ్యక్తి దిగి తాను విజిలెన్స్ అధికారినని చెప్పి సూర్యారావును ఆపి బైక్ రికార్డులు చూపించమన్నాడు. తదుపరి అతని చేతికి ఉన్న రెండు బంగారు ఉంగరాలు, బ్రాస్‌లెట్, మెడలో ఉన్న చైను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. సూర్యారావు అరిచినా ఆగకుండా కారులో ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. దీంతో బాధితుడు సూర్యారావు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై ఐ.వీర్రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.