వైఎస్‌ఆర్ సీపీలోకి టీడీపీ నాయకులు
సోంపల్లికి చెందిన 15 కుటుంబాలు
ములకలచెరువు: మండలానికి చెందిన టీడీపీ నాయకులు ఆదివారం వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. మండలంలోని సోంపల్లికి చెందిన సుమారు 15 కుటుంబాలు తంబళ్లపల్లె నియోజకవర్గం వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ద్వారకనాథ్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో తమకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు.
పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని వాపోయారు. వైఎస్‌ఆర్ సీపీ, పెద్దిరెడ్డి కుటుంబంపై ఉన్న నమ్మకంతో పార్టీలో చేరుతున్నామని తెలిపారు. వీరిలో ఖాసిమ్‌సాబ్, సిరాజ్, కరీముల్లా, మున్వర్, రఫీ, మహబూబ్‌బాషా, ఫిరోజ్, బషీర్, రసూల్, బావాజాన్, సాజన్, కాలేషా, ఫకృద్ధీన్. నౌషాద్, బాదుల్లా, సయ్యద్ బాదుల్లా తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన సదాశివ, శ్రీనివాసులు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.