Published
Mon, Dec 26 2016 2:06 AM
| Last Updated on Mon, Sep 4 2017 11:35 PM
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్
-వేడుకగా బాల ఏసు నగరోత్సవం
నెల్లూరు(బృందావనం): జిల్లాలోని క్రైస్తవులు ఆదివారం క్రిస్మస్ పండగను భక్తిశ్రద్ధలతో చేసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రైస్తవులతో బాలఏసు నగరోత్సవం నెల్లూరులో రాత్రి కనులపండువగా జరిగింది. తొలుత బాల ఏసును స్మరిస్తూ క్రైస్తవులు క్యాండిల్స్ వెలిగించి, ప్రార్థనలు చేశారు. ఆర్సీఎం బిషప్ డాక్టర్ ఎం.డి.ప్రకాశం నగరోత్సవాన్ని ప్రారంభించారు. బాల ఏసు కొలువైన శకటాన్ని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, మేయర్ అబ్దుల్‌అజీజ్, టీడీపీ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఫాదర్ జోసఫ్ తదితరులు లాగారు.. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ లోకరక్షకుడు ప్రజలందరికీ సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలిగించాలన్నారు. అలాగే జగన్‌మోహన్‌రెడ్డికి శుభాలు కలగాలని కాంక్షించారు. నగరోత్సవం స్థానిక సుబేదారుపేటలోని ఆర్సీఎం చర్చి ప్రాంగణం నుంచి బయలుదేరి సంతపేట, కపాడిపాలెం, రైల్వేఫీడర్స్‌రోడ్డు, రైల్వేరోడ్డు, ఆత్మకూరు బస్టాండ్‌సెంటర్, బోసుబొమ్మ, సుబేదారుపేట మీదుగా ఆర్సీఎం చర్చి ప్రాంగణం చేరింది.