నీటిలో తేలిన సామాన్లు
వర్ష బీభత్సం
Published Mon, Sep 12 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
పార్వతీపురంలో కుంభవష్టి
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
పొంగి పొర్లిన పట్టణంలోని వరహాలగెడ్డ...
రాజీవ్ గహకల్ప ఇళ్లల్లోకి నీరు .
పుట్టూరు వద్ద మెయిన్ రోడ్డుపై ప్రవహిస్తున్న సాకిగెడ్డ
8 పంచాయతీలకు రాకపోకలు బంద్.
పార్వతీపురం/పార్వతీపురం రూరల్: పార్వతీపురంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఇటు పట్టణం, అటు మండలంలోని గ్రామాలన్నీ అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పట్టణ నడిబొడ్డున ప్రవహిస్తున్న వరహాల గెడ్డ ఉధతితో నీరు రోడ్డుపైకి వచ్చి సమీప ప్రాంతాలను ముంచేసింది. చర్చివీధి చివర జనక్తి కాలనీ మెయిన్ రోడ్డులో మోకాళ్ల లోతు నీరు చేరింది. సమీపంలోని రాజీవ్ గహ కల్ప ఇళ్ల సముదాయం జలమయమైంది. రాత్రి నుంచి అక్కడి ప్రజలు కంటిమీద కునుకులేక రోడ్డుపైకి పిల్ల పాపలతో వచ్చి జాగారం చేస్తున్నారు. ఇళ్ల్లల్లో నీరు చేరడంతో వస్తువులన్నీ పాడయ్యాయని వాపోయారు. నీటిలో సామాన్లనీ తేలియాడుతున్నాయి. ఆ పక్కనే ఉన్న బీసీబాలికల వసతిగహం ప్రాంతంలోని నివాసాల్లోకీ నీరుచేరింది. ఈ సందర్భంగా అక్కడ ప్రజలు మాట్లాడుతూ కొన్నేళ్లుగా వరహాల గెడ్డకు ప్రహరీ నిర్మించాలని, మురుగు తొలగించి జంగిల్ క్లియరెన్స్ చేయించాలని, పాలకులను, అధికారులను మొత్తుకుంటున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
]
జలదిగ్బంధంలో శతచర్ల కాలనీ
గూడ్స్‌షెడ్ రోడ్డులో గర్భాను రాజు ఇంటి గోడ నేల కూలింది. స్థానిక సౌందర్య సినిమాథియేటర్ వెనుకనున్న శత్రుచర్ల కాలనీ జలదిగ్భంధంలో చిక్కుకుంది. అక్కడివారు బయటకు రాకపోకలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాయఘడ రోడ్డులోని సంతగెడ్డ పోటెత్తి నీరు రోడ్డుపైకి వచ్చింది. ఆ రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. 20వ వార్డు కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు రాజీవ్ గహకల్ప నిర్వాసితులు ఆహార పొట్లాలను అందజేశారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ సర్విశెట్టి శ్రీనివాసరావు గూడ్‌షెడ్‌లోని గోడకూలిపోయిన బాధితులను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఉధతంగా ప్రవహిస్తున్న గెడ్డలు
కుండపోత వర్షానికి మండలంలోని సాకిగెడ్డ, బడిదేవరగెడ్డ, వరహాలగెడ్డలు ఉధతంగా ప్రవహిస్తున్నాయి. పుట్టూరు వద్ద మెయిన్ రోడ్డుపై నుంచి సాకిగెడ్డ నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల మండలంలోని తాళ్లబురిడి, డోకిశీల, గోచెక్క, బుదురువాడ, బందలుప్పి, జమదాల, జమ్మిడివలస పంచాయతీ పరిధిలోగల గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బి.ములగ, తేలునాయుడు వలస మధ్యనున్న బీటీ రోడ్డు బడేదేవర గెడ్డ వరద తాకిడికి కోతకు గురవ్వడంతో ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. అంతేకాకుండా చెరువులన్నీ నిండి జలకళలాడాయి. బెలగాం శివారున ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అక్కడి రియల్‌ఎస్టేట్‌స్థలాలన్నీ చెరువులనుlతలపిస్తున్నాయి. కాగా కోతకు గురైన రోడ్డును ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సోమవారం పరిశీలించారు. త్వరగా మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు.
అన్నదాత హర్షం
వరిపంట మంచి పరిపక్వానికి చేరుకున్న దశలో ఎండలు కాచి భూములు బీటలు వారే సమయంలో వరుస రెండురోజుల పాటు కురిసిన భారీ వర్షాలు రైతాంగానికి మేలు చేశాయి. చెరువులు పూర్తిగా నిండడంతో ఈ ఏడాది కొంతమేర వరిపంటకు నీటి కొరత తీరనుందని చెబుతున్నారు.
Advertisement
Advertisement