parvatipuram
-
పార్వతీపురంలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో తో కలిసి మన్యం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. తాజాగా పార్వతీపురంలో నాట్స్, గ్లో సంస్థలు సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఇందులో ముఖ్యంగా విద్యార్ధుల ఆరోగ్యంపై దృష్టి సారించాయి. గిరిజన విద్యార్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందించాయి. గిరిజనుల సంక్షేమానికి తన వంతు చేయూత అందించేందుకు నాట్స్ ముందు ఉంటుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. గ్లో సంస్థ సహకారంతో గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.(చదవండి: చికాగోలో నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్) -
నరకాలుగా నగరాలు..
ఢిల్లీ నడిబొడ్డున పేరొందిన ఒక కోచింగ్ సెంటర్లో వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. సివిల్ సర్వీసు పరీక్షలకు మంచి కోచింగ్ సెంటర్‌గా ఆ సంస్థకు దశాబ్దాల చరిత్ర ఉంది. రాజధాని నగరంలో ఉన్న ఆ సెంటరు నిబంధనలకు వ్యతిరేకంగా భవనం బేస్మెంట్లో లైబ్రరీ నిర్వహిస్తోంది. విద్యార్థులు ముగ్గురూ అందులో చిక్కుకుని మరణించిన వారే. ఎన్నో ఆశలతో, ఎంతో ధనం ఫీజుల రూపంలో వెచ్చించి ఆ సంస్థలో చేరిన విద్యార్థులు, సంస్థ నిర్వాహకుల అత్యాశ, అధికారుల అలసత్వం, అవినీతి, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జీవితాల్ని కోల్పోయారు.బేస్‌మెంట్‌ని పార్కింగు కోసం, లేదా స్టోర్ రూమ్‌గా మాత్రమే వినియోగించాలని ఒక నిబంధన. దాన్ని లైబ్రరీగా మార్చి సొమ్ము చేసుకోవడం ఆ సంస్థ కక్కుర్తి. అలా ప్రాణాపాయం కలిగే అవకాశం ఉన్నా, నిబంధనల్ని అతిక్రమించినా పట్టనట్టు వ్యవహరించడం, లేదా లంచాలు తిని ఉపేక్షించడం నగర పాలక సంస్థ నిర్వాకం. ఆ సెంటరులోకి వరద నీరు ఒక్క ఉదుటున చేరడానికి కారణం యథేచ్చగా అక్రమ కట్టడాల్ని అనుమతించడం. డ్రయిన్ వ్యవస్థ పూడుకున్నంత వరకూ వదిలేయడం. అయితే ఈ సమస్య ఆ ఒక్క కోచింగ్ సెంటర్‌కో, ఆ ప్రాంతానికో పరిమితం కాదు.పుట్టగొడుగుల్లా నగరమంతా వ్యాపించిన కోచింగ్ సెంటర్లు, వాణిజ్య సముదాయాలు, అక్రమ కట్టడాలు... ఇలా పట్టణ ప్రణాళికల్ని తుంగలో తొక్కేవి కోకొల్లలు. అలాగే ఢిల్లీ ఒక్కటే ఇలా దయనీయంగా లేదు. దేశంలో ప్రతీ పట్టణమూ ఇలా అఘోరిస్తున్నవే. రాష్ట్రాలకు పెరుగుతున్న ఒత్తిడి మేరకు కేంద్రం నిధులు, మార్గదర్శకాలు ఇవ్వాలి. పట్టణాల అభి వృద్ధిని రాష్ట్రాలు దగ్గరగా పర్యవేక్షించాలి. నగర పాలక సంస్థలు సమర్థంగా వ్యవహరించాలి. దురదృష్టవశాత్తూ అలాంటి రోజులు దగ్గరలో కనబడడం లేదు. – డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం మాజీ ఎంపీ, విజయనగరం -
టీడీపీలో తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి, పార్వతిపురం మన్యం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా సాలూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటకు దిగారు. ఫ్లెక్సీలు చించుకోవటంతో టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సాలూరు టౌన్లో సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం ఇందుకు వేదికైంది. స్థానిక శంబర జాతరకు సందర్భంగా టీడీపీ నేత తేజోవతి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని తెలుగుదేశంలోని కొందరు నేతలు చించేయడంతోపాటు మరోనేత సంధ్యారాణి ఫ్లెక్సీలు అతికించారు. దీంతో మామిడిపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రజలు ఆ ఫ్లెక్సీలను చూసి టీడీపీ రోజురోజుకు దిగజారిపోయిందని అనుకుంటున్నారు. టీడీపీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఫోటోలను ఒకరి వర్గం ఒకరు చించుకున్నారు. వాటి స్థానంలో తమ నాయకురాలు ఫొటో పెట్టిన నేపథ్యంలో టీడీపీలో వర్గ విభేదాలపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. దీనిపై స్థానికంగా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. చదవండి: AP: ESMSపై కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం -
పార్వతిపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
-
పార్వతీపురం, పెదకూరపాడు, తంబళ్లపల్లె నియోజకవర్గాలలో బస్సుయాత్ర
-
‘ప్రజలకు నేరుగా సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వం మాది’
పార్వతీపురం మన్యం జిల్లా: దళారి, మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం తమదని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో సామాజిక సాధికార సన్నాహ సమీక్ష సభలో బొత్స మాట్లాడుతూ.. ‘నాలుగున్నర ఎనిమిది నెలల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నెరవేర్చారు. జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు మరింత వివరంగా చెప్పాల్సిన బాధ్యత నాయకులపై ఉంది. ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో దళారి, మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పనులు చేసేవి. ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లను తెచ్చిన చంద్రబాబు బయటకు ఎందుకు రావడం లేదు. చంద్రబాబు అనే వ్యక్తి అధికారం దుర్వినియోగం చేశారు. అధికారులను వాడుకుని అవినీతి చేసినట్లు రుజువు అయింది కాబట్టి ఆయన బయటకు రావడం లేదు. నేటికి కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు కాలం గడిపారు. చంద్రబాబు హయాంలో చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం అయినా ఉందా?, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ నాయకత్వంలో అన్ని పదవుల్లో బలహీన వర్గాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు’ అని తెలిపారు. -
ఎమ్మెల్యే కళావతికి మరోసారి అస్వస్థత..
సాక్షి, పాలకొండ: ప్రజా సేవకై అలుపెరగకుండా, రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో పాల్గొంటూ పాలకొండ నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లో నిర్విరామంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే విశ్వానరాయి కళావతి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 21న దోనుబాయిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె అస్వస్థత గురయ్యారు. కాగా, గత నాలుగు రోజులుగా స్వగ్రామం వండవలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే కళావతి బుధవారం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే ఆమెను పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్సలు అందించారు. సామాన్య ప్రజలలాగే ఆమె ఏరియా ఆసుపత్రిలో చేరారు. దీంతో సూపరింటెండెంట్ జి. నాగభూషణరావు, ఆర్.ఎం జె.రవీంద్రకుమార్.. ఎమ్మెల్యే కళావతికి వైద్య చికిత్సలు అందజేసారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండి వైద్య చికిత్సలు పొందిన ఎమ్మెల్యే కళావతి సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం, నెల రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. కాగా, ఏరియా ఆసుపత్రిలోని వైద్య సేవలపై ఎమ్మెల్యే కళావతి సంతృప్తి వ్యక్తం చేశారు. అలుపెరగని ప్రజాసేవ.. పాలకొండ ఎమ్మెల్యే విశ్వానరాయి కళావతి 2014 నుండి 2019 వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజల పట్ల ఆమెకున్న దీక్షా దక్షతను చూసి 2019లో మరో మారు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా అఖండ విజయం కట్టబెట్టారు. ప్రతి పక్షం నుండి అధికార పక్షంలో అడుగుపెట్టిన కళావతికి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే పనిగా మారింది. దీంతో 2019లో అధికారం వచ్చిన తర్వాత నుండి ప్రజా సేవలోనే మమేకమవుతూ వస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయో లేదా తెలుసుకునేందుకు ముందుకు సాగారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జనవరి 21వ తేదీ వరకు నియోజకవర్గంలో 32 పంచాయతీల్లో 82 రోజుల పాటు అవిశ్రాంతంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇలా ప్రజల సుఖాలు తెలుసుకుంటూ వారికి బాసటగా నిలిచారు. అలాగే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ఈనెల 21న దోనుబాయిలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో, తమ అభిమాన ఎమ్మెల్యే కళావతి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. -
పార్వతీపురం: బలిజిపేట మండలం అజ్జాడలో అగ్నిప్రమాదం
-
జనసేన కాదు.. టీడీపీకి తందానా
వీరఘట్టం: ఉచిత హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన టీడీపీ నేత చంద్రబాబునాయుడుతో పవన్ కళ్యాణ్ జతకట్టడంతో జనసేన పార్టీ.. కాస్త టీడీపీ తందానసేనగా మారిపోయిందని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఎద్దేవా చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం వండవ గ్రామంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవకాశంగా ఉన్న విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు కాకుండా అడ్డుకుంటే మరో సింహగర్జన తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు పెద్ద దొంగ అంటూ 2018లో పవన్‌కళ్యాణ్ అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో లక్ష ఎకరాలు దోచుకున్నది చంద్రబాబేనని, విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలని, అమరావతిలో రాజధాని దండగ అంటూ ఆ నాడు పేర్కొన్న పవన్‌కళ్యాణ్.. ఇప్పుడు మాట మార్చి దొంగనాయకుడితో చేతులు కలపడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబునాయుడు కాళ్ల దగ్గర కూర్చునేవాడిని నాయకుడిగా ఎలా భావిస్తారని, జనసేన కార్యకర్తలు, నాయకులు ఓసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని, దానిని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని కోరారు. ప్యాకేజీ స్టార్‌ను, చంద్రబాబునాయుడుని రాష్ట్రం నుంచి ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. పాలకొండ, పార్వతీపురం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
సిరులు కురిపిస్తున్న సీతాఫలం.. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండు తింటే..
సాక్షి, పార్వతీపురం జిల్లా: సీతాఫలాల సాగుకు పార్వతీపురం మన్యం జిల్లా పెట్టిందిపేరు. ఇక్కడి కొండ ప్రాంతాల్లో వంద శాతం సేంద్రియ పద్ధతిలోనే గిరిజనులు సీతాఫలాల తోటలను సాగుచేస్తున్నారు. వీటి నుంచి వచ్చే దిగుబడులు నాణ్యమైనవి కావడం, రుచిగా ఉండడంతో కొనుగోలుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. అందుకే మన్యం సీతాఫలాలకు మార్కెట్లో గిరాకీ ఉంది. ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు వచ్చి ఇక్కడి పంటను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్వతీపురంమన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీలో సీతాఫలం పంట సాగవుతోంది. ఏటా వర్షాకాలంలో ఆరంభమై శీతాకాలం ముగిసేవరకు సీతాఫలం సీజన్ కొనసాగుతుంది. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలోనే పంట చేతికి రావడంతో గిరిజనరైతులు సంబరపడుతున్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు. నాణ్యమైన దిగుబడులు... దశాబ్దాల కాలంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, సాలూరు, మక్కువ, జి.ఎల్.పురం, జియ్యమ్మవలస, కురుపాం, పాచిపెంటలోని కొండ ప్రాంతంలో సుమారు 5 వేల ఎకరాల్లో సీతాఫలం పంట సాగువుతోంది. శతశాతం సేంద్రియ పద్ధతిలోనే పంట సాగుచేస్తున్నారు. ఎటువంటి ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండానే వాతావరణ ప్రభావంతో పంట పక్వానికి వస్తుంది. అందుకే రుచిగా ఉంటాయి. ఏటా వంద కోట్ల వ్యాపారం... మన్యంలో ఏటా వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 8 టన్నుల దిగుబడి వస్తుందన్నది గిరిజన రైతుల లెక్క. కిలో రూ.15 నుంచి రూ.25లకు గిరిజనుల వద్ద వ్యాపారాలు కొనుగోలు చేసి గ్రేడ్లుగా విభజిస్తారు. తర్వాత సాధారణ రకాన్ని మార్కెట్లో రూ.40 నుంచి రూ.50కు, గ్రేడ్–1 రకం రూ.70 నుంచి రూ.80లకు అమ్ముతున్నారు. ఏటా సుమారు రూ.100 కోట్ల వరకు సీతాఫలం వ్యాపారం సాగుతున్నట్టు అంచనా. రైతుల కంటే వ్యాపారులకే అధిక ఆదాయం సమకూరుతోంది. చదవండి: Health: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో ఒక్కటే కాదు గుమ్మడి, గోధుమ గడ్డి.. సీతాఫలంతో ప్రయోజనాలెన్నో.. ►సీతాఫలాల్లో మానవ శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ ఏ,బి–6, సీ, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, ఐరన్లు ఉంటాయి. కండరాల వృద్ధికి దోహదపడతాయి. నరాల బలహీనతతో బాధపడే వారు ఈ పండ్లను తినడం మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ► సీతాఫలాన్ని, తేనెను తగినమోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన బరువు సొంతమవుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు శక్తిని ఇస్తుంది. ► బరువు తగ్గాలి అనుకునేవారికి సీతాఫలం చక్కని ఔషధం. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి, ఊబకాయం, అధిక బరువు సమస్యలకు చెక్ పెడుతుంది. కడుపులో ఉండే బిడ్డకు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. శిశువు మెదడు, నాడీ వ్యవస్థ మెరుగవుతుంది. తల్లిలో పాలవృద్ధికి దోహదపడుతుంది. ►మలబద్దకంతో బాధపడేవారు సీతాఫలాలు తినడం మంచిది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. సీతాఫలం జ్యూస్‌గా లేదా నేరుగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అల్సర్, గ్యాస్, ఎసిడిటీ వంటి ఉదర సమస్యలను నివారిస్తుంది. ఆరోగ్యానికి మంచిది సీతాఫలంలో విటమిన్–ఎ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల సహజంగా మీ చర్మం కాంతివంతమవుతుంది. విటమిన్–ఎ మీ దృష్టి లోపాలను కూడా సవరించి చురుకైన కంటిచూపును ఇస్తుంది. రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. రక్తశుద్ధికి తోడ్పడుతుంది. – డాక్టర్ జి.ప్రదీప్‌కుమార్, మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం మార్కెట్ సదుపాయం కల్పిస్తా.. మన్యం జిల్లాలో పండే సీతాఫలాలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. అయితే, గిరిజనులకు ఆ ధరలు దక్కడం లేదు. వ్యాపారులు చౌకగా పంటను కొనుగోలు చేసి మైదాన ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సీతాఫలాలకు జీసీసీ ద్వారా మార్కెట్ సదుపాయం కల్పించేందుకు కృషిచేస్తా. – విశ్వసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ ఎగుమతి చేసేందుకు చర్యలు మన్యం సీతాఫలాలు భలే రుచిగా ఉంటాయి. ఇటువంటి ఫలాలు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. మార్కెట్ సదుపాయం కోసం సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వంతో మాట్లాడి సీతాఫలంకు మార్కెట్ సదుపాం కల్పిస్తాం. – బి.నవ్య, సీతంపేట ఐటీడీఏ పీఓ -
సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి
విజయనగరం టౌన్: జీర్ణోద్ధరణకు గురైన ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్, కామన్ గ్రాంట్ ఫండ్) కింద జిల్లాకు రూ.20 కోట్లు కేటాయించింది. జిల్లాలోని 44 ఆలయాల అభివృద్ధి పనులను చేపట్టింది. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయాలు కొత్తశోభను సంతరించుకుంటుండడంతో భక్తులు సంతోషపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై అర్చకులు, ఆయా ఆలయాల అధికారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 461 ఆలయాలు ఉన్నాయి. ఇందులో రూ.25 లక్షలకు పైబడి వార్షిక ఆదాయం వస్తున్న 6 (ఎ) కేటగిరీకి చెందిన ఆలయాలు 6 వరకూ ఉన్నాయి. రూ.2లక్షలు పైబడి వార్షిక ఆదాయం వస్తున్న 6 (బి) కేటగిరీకి చెందిన ఆలయాలు 15 వరకూ ఉన్నాయి. వీటితో పాటు 6(సి) కేటగిరీలో రెండు లక్షల రూపాయలలోపు ఆదాయం ఉన్న ఆలయాలు 30 వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా ఆలయాలకు ఎటువంటి ఆదాయం లేదు. వీటిలో అధిక ఆలయాలు జీర్ణోద్ధరణకు గురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సర్వ శ్రేయోనిధి కింద రూ. 20 కోట్లు కేటాయించడంతో జిల్లాలో 44 ఆలయాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయి. ఇటీవల కాలంలో రామతీర్థం బోడికొండపైన నూతనంగా నిర్మాణమైన ఆలయమే దీనికి నిదర్శనం. దాంతో పాటు రామతీర్థం ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం విశేషం. విజయనగరం డివిజన్ పరిధిలో ఇప్పిలి వీధి శ్రీరామమందిరానికి రూ. 20 లక్షలు, నాగవంశపు వీధి రామమందిరానికి రూ.50 లక్షలు, మండపం వీధి సంపత్ వినాయకస్వామి ఆలయానికి రూ.75 లక్షలు, కొత్తపేట రామమందిరానికి రూ.50 లక్షలు, గాయత్రీనగర్ వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.40 లక్షలు, బోయవీధి రామమందిరానికి రూ.20 లక్షలు, పల్లివీధి కోదండరామాలయానికి రూ.40 లక్షలు, మండపం వీధి జగన్నాథస్వామి పురాణకాలక్షేప మండపానికి రూ. 80లక్షలను ప్రభుత్వం కేటాయించింది. వీటితో పాటు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి రూ.50 లక్షలు కేటాయింపులు జరిగాయి. చీపురుపల్లి డివిజన్ పరిధిలో నిమ్మలవలస గ్రామం శ్రీరామమందిరానికి రూ.30 లక్షలు, గరివిడి మండలం ఆర్తమూరు కోదండరామాలయానికి రూ.40 లక్షలు, మెరకముడిదాం పులిగుమ్మి రామాలయానికి రూ. 30 లక్షలు, చీపురుపల్లి కనకమహాలక్ష్మి ఆలయానికి రూ.15 లక్షలు, గరివిడి నీలాద్రిపురం రామాలయానికి రూ.25 లక్షలు, రామతీర్థం శ్రీరామస్వామి దేవస్థానానికి కోటి రూపాయలు, బోడికొండపై కోదండరామ ఆలయ నిర్మాణానికి రూ. 3 కోట్లు కేటాయించింది. పోలిపల్లి గ్రామం పైడితల్లి ఆలయానికి రూ. 50 లక్షలు, భోగాపురం మండలం నందిగాం రామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.50 లక్షలు, చీపురుపల్లి మండలం పత్తికాయలవలసలో ఉన్న శ్రీరామమందిరానికి రూ.16 లక్షలు, చీపురుపల్లి మండలం పర్లలో ఉన్న శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, మెంటాడలో ఉన్న సీతారామఆలయానికి రూ. 25లక్షలు మంజూరు చేసింది. ఎస్.కోట డివిజన్ పరిధిలో కొత్తవలస గులివిందాడ శ్రీరామలయానికి రూ.40 లక్షలు, ఎల్.కోట జమ్మాదేవిపేట రామాలయానికి రూ. 44 లక్షలు, గంట్యాడ పెదవేమలి శ్రీరామాలయానికి రూ.16 లక్షలు, వేపాడ రామయ్యపేట రాములవారు, బంగారమ్మ తల్లి ఆలయానికి రూ.20 లక్షలు, గంట్యాడ కొర్లాం శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, జామి శ్రీరామాలయానికి రూ.50 లక్షలు ఎల్.కోటకొత్తపాలం మల్లివీడు పంచాయతీ శ్రీరామాలయానికి రూ.30 లక్షలను కేటాయించింది. ఎల్.కోట రాగరాయిపురం భూలోకమాత ఆలయానికి రూ.30 లక్షలు, వేపాడ వల్లంపూడి సీతారామస్వామి ఆలయానికి రూ.50 లక్షలు, కొత్తవలస గనిశెట్టిపాలెం శ్రీరామాలయానికి రూ.19లక్షల 30వేలు, ఎస్.కోట గవరపాలెం శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, ఎస్.కోట పుణ్యగిరి ధారగంగమ్మ, శివాలయానికి రూ.30 లక్షలు కేటాయింపులు జరిపింది. బొబ్బిలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని గరుగుబిల్లి తోటపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.83 లక్షలు, సాలూరు వడ్డివీధి రామాలయానికి రూ. 13 లక్షలు, సీతానగరం కాసాపేట శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, సీతానగరం నిడగల్లు శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి రూ. 50 లక్షలు, కొమరాడ దేవునిగుంప సోమేశ్వరస్వామి ఆలయానికి రూ. 50 లక్షలు, బొబ్బిలి కారడ గ్రామంలో ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.40 లక్షలు, పార్వతీపురం పిట్టలవలస నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి రూ. 25 లక్షలు, మక్కువ డి.సిర్లం సంగమేశ్వరస్వామి ఆలయానికి రూ. 49 లక్షలు, గరివిడి నీలాద్రిపురం శ్రీరామాలయానికి రూ. 25 లక్షలు, బాడంగి మండలం ముగడలో ఉన్న శ్రీరామమందిరానికి రూ. 12 లక్షలు, రేజేరులోని శ్రీరామమందిరానికి రూ. 12 లక్షలు కేటాయించింది. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తికాగా, మరికొన్ని చోట్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాల పునర్నిర్మాణంతో ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. శరవేగంగా పునరుద్ధరణ పనులు ప్రభుత్వం సర్వశ్రేయోనిధి కింద మంజూరు చేసిన నిధులతో ఆలయాలు పునరుద్ధరణ పనులు చేపట్టాం. ప్రస్తుతం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రామతీర్థంలోని బోడికొండపై కోదండరామస్వామి ఆలయ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కొండకింద రామస్వామి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు దేవాలయాల పునరుద్ధరణ, కొత్తదేవాలయాల నిర్మాణ పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికోసం జిల్లా నుంచి 54 దరఖాస్తులు అందాయి. – జె.వినోద్‌కుమార్, దేవదాయశాఖ సహాయకమిషనర్, విజయనగరం (చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం) -
తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని కట్టేసి కొట్టారు!
కొమరాడ: అధిక వడ్డీలు ఇస్తానంటూ ఆశ చూపి గ్రామస్తుల నుంచి భారీగా అప్పులు చేసింది. ఆ సొమ్ముతో జల్సాలు చేసింది. చివరకు అప్పులు తీర్చలేనంటూ చేతులెత్తేయడంతో బాధితులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రచ్చబండ వద్ద తాడుతో కట్టేసి కొట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని సివిని గ్రామానికి చెందిన శోభ గత కొన్ని రోజులుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. అధికంగా వడ్డీలు ఇస్తానంటూ గ్రామస్తుల నుంచి సుమారుగా రూ.1.40 కోట్ల మేర అప్పుచేసింది. డబ్బు తిరిగివ్వాలంటూ వారంతా అడిగేసరికి చేతులెత్తేసింది. దీంతో ఏప్రిల్ 7న కొమరాడ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం కొంత మంది బాధిత మహిళలు, గ్రామస్తులు కలిసి ఆమెను రామమందిరం వద్ద ఉన్న రచ్చబండ స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఆమెను విడిపించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ ప్రయోగమూర్తి చెప్పారు. -
గిరిపుత్రుల్లో కొత్త ‘రాజ’సం
గిరిజనులకు తగిన గుర్తింపునిస్తూ పార్వతీ పురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసిన సీఎం జగన్మోహన్రెడ్డి వారికి మరో వరం అందించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, గిరిజనులకు తలలో నాలుకలా ఉన్న పీడిక రాజన్నదొరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఉపముఖ్యమంత్రిగా అత్యున్నత గౌరవం కల్పించారు. గౌరవం పొందిన రాజన్నదొర రాక కోసం పార్వతీపురం మన్యం ప్రజలు ఎదురుచూస్తున్నారు. గిరిజన కుటుంబం నుంచి వచ్చిన రాజన్నదొర పోస్టు గ్రాడ్యుయేషన్ చదివారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మేనేజరుగా కొన్నేళ్లు పనిచేశారు. ప్రజాసేవపై మక్కువతో ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేశారు. వరుసగా నాలుగు దఫాలు సాలూరు నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. గిరిజన బిడ్డగా, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయనపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయి. తమ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపిస్తారని ఆశిస్తున్నారు. గిరిజనులపై ప్రత్యేక మమకారం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో తమ ప్రాంతాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తారని విశ్వసిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన పార్వతీపురం మన్యం జిల్లాలో తొలి మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా రాజన్నదొర తనదైన ముద్ర వేసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న ముందు సవాళ్లు.... ∙గిరిశిఖర గ్రామాలకు రోడ్లు వేయడానికి అటవీశాఖ అనుమతులు రాక పనులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. వాటికి పరిష్కారం చూపా ల్సిన అవసరం ఉంది. ∙అభివృద్ధిగా దూరంగా ఉన్న గిరిశిఖర గ్రామాల్లో గిరిజనులకు విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందేలా చేయాలి. ∙గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు దళారుల బారిన పడకుండా జీసీసీ ద్వారా గిట్టుబాటు« దరకు కొనుగోలు జరిగేలా చూడాలి. ∙పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆధ్యాత్మిక, ఆçహ్లాదకర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. ∙వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేలాది మంది గిరిజనులకు పోడు (ఆర్వోఎఫ్ఆర్) పట్టాలు అందాయి. ఆ భూముల్లో చిరుధాన్యాలు, ఉద్యానవన పంటలు సాగు మరింత పెరిగేలా ప్రోత్సా హకాలు అందించాల్సి ఉంది. రాజన్నదొరకు శుభాకాంక్షలు... చీపురుపల్లి: డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీడిక రాజన్నదొరకు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం అమరావతిలో దుశ్శాలువతో సత్కరించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఉన్నారు. -
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
సాక్షి, విజయనగరం : ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరో ఎనిమిదిమంది తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జిల్లాలోని జియ్యమ్మ మండలం గవరమ్మపేట జంక్షన్ వద్ద జరిగింది. గుమ్మ లక్ష్మీపురం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు పార్వతీపురం నుంచి జియ్యమ్మవలస వైపు పదిమంది ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆటోలో చిక్కుకున్న వారిని రక్షించి క్షతగాత్రులను పార్వతీపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరడాని సత్యవతి అనే మహిళ మృతిచెందింది. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లాకు రేపు జగనన్న రాక
సాక్షిప్రతినిధి విజయనగరం: వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోసారి జిల్లాకు వస్తున్నారు. ఈ నెల 27న పార్వతీపురం పట్టణంలో రోడ్‌షో నిర్వహించి, ప్రచార సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 17న నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ సభ నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. మరోసారి బుధవారం ఉదయం 9.30 గంటలకు జగన్ పార్వతీపురం చేరుకుంటారని పార్టీ జిల్లా రాజకీ య వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీని వాసరావు తెలిపారు. తొలి పర్యటనకు ముం దే జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబి తాను జగన్ ప్రకటించారు. వారు ఇప్పుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెట్టించి న ఉత్సాహంతో అధినేత సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. -
మహాకూటమి కాదు.. పెద్ద దొంగల కూటమి
సాక్షి, విజయనగరం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతిపరులంతా కలసి మహాకూటమిని ఏర్పాటు చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మహాకూటమి కాదు అది పెద్ద దొంగల కూటమి అని అభివర్ణించారు. పార్వతీపురంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నరేంద్ర మోదీ పాలననే స్వాగతిస్తున్నారని చెప్పారు. నారా లోకేష్, చంద్రబాబుల అవినీతి బయట పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వారి అవినీతిని నిరూపించలేకపోతే జైలుకి వెళ్ళడానికి సిద్ధమని పేర్కొన్నారు. తండ్రీకొడుకులు అంత నీతిమంతులైతే రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వస్తే ఆయన స్వయంగా సీబీఐ దర్యాప్తుకు సిద్ధపడ్డారని గుర్తుచేశారు. లోకేశ్‌కు, చంద్రబాబుకు ధైర్యముంటే సీబీఐ దర్యాప్తు చేయించుకొని.. నిజాయతీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. 2014 ఎన్నికల్లో సోనియాగాంధీపై అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆమెతో చేతులు కలిపి.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. -
కొండెక్కని ట్రైకార్ రుణాలు..!
♦ 2016–17 సంవత్సరంలో రుణాల ఊసేలేదు ♦ 2015–16 లక్ష్యం నెరవేరలేదు ♦ 2014–15లో 1601 యూనిట్లకు ఇచ్చినవి 491 యూనిట్లే ♦ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న గిరిపుత్రులు ♦ రుణాల మంజూరుకు ఆసక్తి చూపని బ్యాంకర్లు ♦ రికవరీ చేయలేమంటూ మొండిచేయి చూపుతున్న వైనం ♦ పట్టించుకోని పాలకులు, అధికారులు ఆవేదనలో లబ్ధిదారులు విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు వారికి ఇప్పటికీ ఆమడ దూరమే. కనీసం రుణ మందితే స్వయం ఉపాధి పొందుదామని, ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుందామని ఆశించిన గిరిపుత్రులకు నిరాశే ఎదురవుతోంది. పాలకులు, అధికారుల కరుణలేకపోవడంతో దరఖాస్తు చేయడమే తప్ప చేతికి రుణం అందడం లేదు. వ్యయప్రయాసల కోర్చి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా మొండిచేయి చూపుతున్నారు. రుణాలు రికవరీ చేయలేమంటూ బ్యాంకర్లు ముఖం చాటేస్తున్నారు. ఫలితం.. రుణాలు కొండెక్కడం లేదు. గిరిజనుల బతుకులు మారడం లేదు. దీనికి నెరవేరని ట్రైకార్ రుణాల లక్ష్యం.. గ్రౌండింగ్ కాని యూనిట్లు.. అందని రాయితీలే నిలువెత్తు నిదర్శనం. పార్వతీపురం టౌన్: గిరిజనుల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ఏటా మంజూరు చేసే ట్రైకార్ రుణాలు గిరిజనుల చేతికి చేర డం లేదు. రుణాలు అందించడంలో అ ధికారులు, బ్యాంకర్ల అలక్ష్యం గిరిపుత్రులకు శాపంగా మారింది. రుణ లబ్ధి దారుల జాబితాను తయారు చేసినా రుణాల మంజూరు ‘ఎక్కడవేసిన గొంగ ళి అక్కడే’ అన్న చందంగా తయారైంది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఒక్క గిరిజనుడికీ రుణం అందలేదు. దరఖాస్తుదారులందరూ రుణాల కోసం ఎదురు చూస్తున్నా నిరాశే ఎదురవుతోంది. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపడంలేదు. ఇప్పటికీ యూసీ అప్లోడ్ చేయలేదు. ఏడాది కాలంగా రుణ అర్హత పొందిన లబ్ధిదారులు కలెక్టర్, ఐటీడీఏ పీవో కార్యాలయాల చుట్టూ తిరిగి గ్రీవెన్స్‌సెల్‌లో వినతులు సమర్పిస్తున్నా స్పందన లేకపోతోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన యూనిట్లు ఇంకా కొన్ని గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 2016–17 ఆర్థిక సంవత్సరానికి ట్రైకార్ రుణాలు 215 యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి ప్రభుత్తం రూ.2.72 కోట్లు రుణ లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ప్రభుత్వం తరఫున అందించాల్సిన రాయితీ రుణం రూ.1.60 కోట్లు కూడా రిలీజ్ చేసింది. బ్యాంకర్లు అందించాల్సిన రూ.1.11 కోట్లు రుణాన్ని మాత్రం రిలీజ్ చేయడంలో అలసత్వం వహిస్తున్నారు. దీంతో ఏడాది కాలంగా రుణాలు అందడంలేదు. టెంట్ హౌస్‌లు, గొర్రెలు, గేదెలు, ఆవులు, కిరాణా దుకాణాలు పెట్టుకుని ఆర్థికంగా ఎదుగుదామనుకున్న గిరిపుత్రుల ఆశలు నిర్జీవమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్టీ జాతాపు, కొండదొర, ఎరుకల వంటి కులాలవారికి 60 శాతం, పీటీజీ గ్రామాల పరిధిలోని సవర, గదబ కులాల ప్రజలకు 90 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. రికవరీయే సమస్య.. ట్రైకార్ రుణాల కింద లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్లు మందుకు రాకపోవడానికి రికవరీనే సమస్యగా చూపుతున్నారు. అప్పుగా ఇచ్చిన రుణాన్ని లబ్ధిదారుల నుంచి వసూలు చేయాలంటే బ్యాంకర్లకు చుక్కలు కనిపిస్తున్నాయని వాదిస్తున్నారు. దీనివల్లే ట్రైకార్ రుణ లక్ష్యాలు చేరుకోలేకపోతున్నామని చెబుతున్నారు. రుణాలు అందజేయడం లేదు.. ప్రభుత్వం ప్రస్తుతం ఏ రకమైన రుణాలు మంజూరు చేయడం లేదు. దరఖాస్తు చేసి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం, బ్యాంకర్ల నుంచి ఎలాంటి రుణ సమాచారం అందలేదు. నిరుద్యోగులకు ఆసరాగా ఉండాల్సిన ప్రభుత్వం రుణాలను మంజూరు చేయడంలో చిత్తశుద్ధి చూపించడం లేదు. రెండేళ్లుగా రణాలకోసం ఎదురు చూస్తున్నా ఇంతవరకు రుణం మంజూరు కాలేదు. – డప్పుకోట అశోక్, తులసివలస -
బడే దేవరకొండపై యంత్రాలు మాయం!
పార్వతీపురం టౌన్: మండలంలోని బడేదేవరకొండపై అక్రమంగా తవ్వకాలు చేపట్టిన కాంట్రాక్టర్ ఒక్కొక్కటిగా యంత్రాలను తరలించేస్తున్నారు. అయినా అటవీశాఖాధికారులు పట్టించుకోవడంలేదు. దీనిపై ఇప్పటికే న్యాయస్థానంవద్ద కేసు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు హైపవర్ కమిటీ వచ్చి సర్వే చేసి నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. దీనిపై తీర్పు వెలువడేంతవరకూ అక్కడ ఎలాంటి పనులు చేయకూడదనీ... ఇదివరకు అక్కడ ఉన్న వస్తువులను, యం త్రాలను తరలించకూడదనీ ఉత్తర్వులున్నాయి. కానీ యంత్రాలు తరలిపోతున్నా అటవీశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అసలేం జరిగిందంటే... మండలంలోని ములగపంచాయతీ పరిధి సర్వేనంబర్ 1లో తవ్వకాలకు ఎంఎస్ పళని గ్రానైట్స్ కంపెనీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సంస్థ ఆ ఉత్తర్వులను విస్మరించి కోరి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 1లో తవ్వకాలు ప్రారంభించింది. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. కానీ ఇచ్చిన అనుమతులు సక్రమమేనంటూ స్థానిక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, రెవె న్యూ, అటవీ, మైన్స్ శాఖాధికారులు నిర్థారించారు. అయి తే హైకోర్టు నియమించిన హైపవర్ కమిటీలోని అధికారులు పక్కాగా రిజర్వ్ ఫారెస్టు అని తేల్చి నివేదికను తయా రు చేసి హైకోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో హైకో ర్టు అక్కడ ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని, కొండపైవున్న యంత్రాలను తరలించకూడదని హైపవర్ కమిటీకి సూచించింది. అంతేగాకుండా సబ్‌కమిటీ రిపోర్టును కూడా సమర్పించాలని హైకోర్టు కోరింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం రెండు వారాల గడువు కావాలని కోరినట్లు సమాచారం. సబ్‌కమిటీ రిపోర్టు తయారు చేసే లోగా బడేదేవరకొండపై ఉన్న యంత్ర పరికరాలను తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా తరలిన యంత్రాలు కొండపై గ్రానైట్ కటింగ్ పనులు ప్రారంభించిన సమయంలో ఐదు యంత్రాలు ఉండేవి. వాటితోపాటు జనరేటర్, జేసీబీ వంటి యంత్రాలు ఉండేవి. కానీ ప్రస్తుతం అవేవీ అక్కడ కన్పించడం లేదు. కేవలం ఒక్క యంత్రం మాత్రమే ప్రస్తుతం ఉంది. సబ్ కమిటీ రిపోర్టు తయారు చేసే లోపు ఉన్న ఆ ఒక్క యంత్రాన్ని కూడా తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రిజర్వ్ ఫారెస్టులో తవ్వకాలు జరిపి, పచ్చని కొండలను విధ్వంసం చేసినందుకు ఎవరు బాధ్యులవుతారు. జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. మొదటినుంచీ ఇక్కడ జరుగుతున్న అకృత్యాలను, రిజర్వ్‌ఫారెస్టులో జరుగుతున్న తవ్వకాలను వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తూనే ఉంది. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్‌ను పోలీసులు అరెస్టుచేసి చిత్రహింసలకు గురిచేసిన సంగతీ తెలిసిందే. ఇతనితోపాటు మరో 40 మంది గిరిజనులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఇప్పుడు జరిగిన తప్పిదానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నదే ప్రశ్న. -
ఘోర ప్రమాదం
పార్వతీపురం టౌన్: భార్య కళ్లేదుటే ఘోరం జరిగిపోయింది. ఊహించని విధంగా మృత్యువు లారీ రూపంలో వచ్చి భర్తను కానరాని లోకాలకు తీసుకుపోవడంతో ఆ భార్యను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అంతవరకు తనతోనే ఉన్న భర్త రెప్పపాటు వ్యవధిలోనే అందనంత ఎత్తుకు వెళ్లిపోతాడని ఊహించని ఆ మహిళ పడుతున్న వేదన వర్ణణాతీతం. వివరాల్లోకి వెళ్తే..పార్వతీపురం పట్టణం 12వ వార్డు పరిధిలోని ఇందిరా కాలనీకి చెందిన కోలా కల్యాణ్ (36) అనే ఆటోడ్రైవర్ ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. కల్యాణ్ ఆయన భార్య ఉదయం 4 గంటల సమయంలో రోడ్డుపైకి వచ్చి టీ తాగారు. తర్వాత కల్యాణ్ ఆటోను రోడ్డు పక్క నిల్చోబెట్టి తడుస్తున్నారు. ఆ సయమంలో రాయఘడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ ఒకటి ప్రమాదవశాత్తూ కల్యాణ్‌పైకి దూసుకెళ్లి రోడ్డుపై చాలా దూరం ఈడ్చుకుపోయింది. అంతకుముందే లారీ బోరింగ్‌ను, అక్కడే ఉన్న బట్టలకొట్టు గోడను ఢీకొట్టింది. అనంతరం కల్యాణ్ ఢీ కొని ఈడ్చుకుపోయింది. దాన్ని గమనించిన స్థానికులు ఆయన భార్య రజినీకి విషయం చెప్పిడంతో వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో విగతజీవుడై కనిపించాడు. దాంతో రజినీని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. ప్రమాదంలో లారీకి ఉన్న 16 చక్రాల్లో రెండు చక్రాలు ఊడిపోయాయి. కానీ డ్రైవర్ 14 చక్రాలతోనే లారీని తీసుకెళ్లడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు.. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పట్టుకునేందుకు అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. అయితే లారీ డ్రైవర్ సీతానగరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పట్టణ ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పత్రికి తరలించి పోస్టు మర్టం నిర్వహించారు.లారీ డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు.అయితే లారీ డ్రైవర్ పార్వతీపురం నుంచి విశాఖపట్నం వైపు వెల్లి సీతానగరం పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు.దీనినిపై పట్టణ ఎస్ఐ రాజేస్ కేసునమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. -
డెంగీతో యువకుడి కన్నుమూత
జ్వరాలతో వణుకుతున్న జగన్నాథపురం కన్నెత్తి చూడని అధికారులు, పాలకులు పార్వతీపురం : పది రోజులుగా డెంగీతో బాధపడుతూ విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పట్టణంలోని జగన్నాథపురం ఒకటో వార్డు కష్ణా కాలనీకి చెందిన 19 ఏళ్ల చుక్క సాయి గురువారం కన్నుమూశాడు. జ్వరం రాగానే సాయిని కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు సాయిని విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అయితే కుటుంబ సభ్యులు విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే సాయి కోమాలోకి చేరుకోవడంతో తిరుమల ఆస్పత్రి వైద్యులు కూడా విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే.. జగన్నాథపురంలో పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో ఎక్కడబడితే అక్కడ చెత్తకుప్పలు, మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమలు విజంభిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం 1,29,30 వార్డుల్లోని ప్రతి వీధిలోనూ జ్వరపీడితులున్నారు. జ్వరాలతో ప్రాణాలు పోతున్నా మున్సిపల్ పాలకులు, అధికారులు, వైద్యసిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జగన్నాథపురంలో వైద్యశిబిరం నిర్వహించాలని కోరుతున్నారు. -
తోకలేని కోడి
పార్వతీపురం: స్థానిక ఐటీడీఏ కార్యాలయం వీధిలో సన్నిబాబు పెంచే కోళ్లలో ఒకటి తోకలేకుండా పుట్టి పెరుగుతోంది. దీన్ని అంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు. తోకలేకుండా కోళ్లు ఉండడం క్కడా చూడలేదని స్థానికులంటున్నారు. స్థానిక పశువైద్యశాల ఏడీ డాక్టర్ ఎం.జగన్నాథరావు వద్ద దీనిపై ప్రస్తావించగా జన్యులోపంతో అక్కడక్కడ వేలల్లో ఒక్కొక్కటి ఇలా తోకలేకుండా కన్పిస్తాయని తెలిపారు. -
వర్ష బీభత్సం
పార్వతీపురంలో కుంభవష్టి నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు పొంగి పొర్లిన పట్టణంలోని వరహాలగెడ్డ... రాజీవ్ గహకల్ప ఇళ్లల్లోకి నీరు . పుట్టూరు వద్ద మెయిన్ రోడ్డుపై ప్రవహిస్తున్న సాకిగెడ్డ 8 పంచాయతీలకు రాకపోకలు బంద్. పార్వతీపురం/పార్వతీపురం రూరల్: పార్వతీపురంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఇటు పట్టణం, అటు మండలంలోని గ్రామాలన్నీ అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పట్టణ నడిబొడ్డున ప్రవహిస్తున్న వరహాల గెడ్డ ఉధతితో నీరు రోడ్డుపైకి వచ్చి సమీప ప్రాంతాలను ముంచేసింది. చర్చివీధి చివర జనక్తి కాలనీ మెయిన్ రోడ్డులో మోకాళ్ల లోతు నీరు చేరింది. సమీపంలోని రాజీవ్ గహ కల్ప ఇళ్ల సముదాయం జలమయమైంది. రాత్రి నుంచి అక్కడి ప్రజలు కంటిమీద కునుకులేక రోడ్డుపైకి పిల్ల పాపలతో వచ్చి జాగారం చేస్తున్నారు. ఇళ్ల్లల్లో నీరు చేరడంతో వస్తువులన్నీ పాడయ్యాయని వాపోయారు. నీటిలో సామాన్లనీ తేలియాడుతున్నాయి. ఆ పక్కనే ఉన్న బీసీబాలికల వసతిగహం ప్రాంతంలోని నివాసాల్లోకీ నీరుచేరింది. ఈ సందర్భంగా అక్కడ ప్రజలు మాట్లాడుతూ కొన్నేళ్లుగా వరహాల గెడ్డకు ప్రహరీ నిర్మించాలని, మురుగు తొలగించి జంగిల్ క్లియరెన్స్ చేయించాలని, పాలకులను, అధికారులను మొత్తుకుంటున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ] జలదిగ్బంధంలో శతచర్ల కాలనీ గూడ్స్‌షెడ్ రోడ్డులో గర్భాను రాజు ఇంటి గోడ నేల కూలింది. స్థానిక సౌందర్య సినిమాథియేటర్ వెనుకనున్న శత్రుచర్ల కాలనీ జలదిగ్భంధంలో చిక్కుకుంది. అక్కడివారు బయటకు రాకపోకలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాయఘడ రోడ్డులోని సంతగెడ్డ పోటెత్తి నీరు రోడ్డుపైకి వచ్చింది. ఆ రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. 20వ వార్డు కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు రాజీవ్ గహకల్ప నిర్వాసితులు ఆహార పొట్లాలను అందజేశారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ సర్విశెట్టి శ్రీనివాసరావు గూడ్షెడ్లోని గోడకూలిపోయిన బాధితులను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉధతంగా ప్రవహిస్తున్న గెడ్డలు కుండపోత వర్షానికి మండలంలోని సాకిగెడ్డ, బడిదేవరగెడ్డ, వరహాలగెడ్డలు ఉధతంగా ప్రవహిస్తున్నాయి. పుట్టూరు వద్ద మెయిన్ రోడ్డుపై నుంచి సాకిగెడ్డ నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల మండలంలోని తాళ్లబురిడి, డోకిశీల, గోచెక్క, బుదురువాడ, బందలుప్పి, జమదాల, జమ్మిడివలస పంచాయతీ పరిధిలోగల గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బి.ములగ, తేలునాయుడు వలస మధ్యనున్న బీటీ రోడ్డు బడేదేవర గెడ్డ వరద తాకిడికి కోతకు గురవ్వడంతో ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. అంతేకాకుండా చెరువులన్నీ నిండి జలకళలాడాయి. బెలగాం శివారున ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అక్కడి రియల్ఎస్టేట్స్థలాలన్నీ చెరువులనుlతలపిస్తున్నాయి. కాగా కోతకు గురైన రోడ్డును ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సోమవారం పరిశీలించారు. త్వరగా మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. అన్నదాత హర్షం వరిపంట మంచి పరిపక్వానికి చేరుకున్న దశలో ఎండలు కాచి భూములు బీటలు వారే సమయంలో వరుస రెండురోజుల పాటు కురిసిన భారీ వర్షాలు రైతాంగానికి మేలు చేశాయి. చెరువులు పూర్తిగా నిండడంతో ఈ ఏడాది కొంతమేర వరిపంటకు నీటి కొరత తీరనుందని చెబుతున్నారు. -
పార్వతీపురంలో ఎక్సైజ్ దాడులు
పార్వతీపురం : పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ సీఐ ఎస్. విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆటోలో నాటు సారా తీసుకువస్తున్న అజ్జాడ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుంచి 80 లీటర్ల నాటుసారా, ఆటో, సారా తయారీ సామాన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒడిశా నుంచి ఆటోలో సారా తీసుకువస్తున్న సొండి వినోద్‌ను కూడా అరెస్ట్ చేశారు. -
వాసవీక్లబ్ పార్వతీపురం కొత్త కార్యవర్గం ఎన్నిక
పార్వతీపురం: వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ పార్వతీపురం కొత్త కార్యవర్గం ఎన్నిక శనివారం రాత్రి హోటల్ శ్రీకాంత్‌లో జరిగింది. క్లబ్ అధ్యక్షునిగా పెంటపాటి సాయికిరణ్, ఉపాధ్యక్షునిగా జల్దు వినయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా పేకేటి పుండరీకాక్ష, కోశాధికారిగా గంటా శైలజ , సంయుక్త కార్యదర్శిగా పీవీ సత్యానంద్, సంయుక్త కోశాధికారిగా మెంటా రవికుమార్‌లను ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా పీవీకే మణికుమార్, పసుమర్తి గోపాలరావు, బుడ్డేపు రామకష్ణ, కందుకూరి ప్రభాకరరావు, పసుమర్తి వెంకటప్రసాద్(బుజ్జి), చెక్కా సత్యనారాయణమూర్తి(చంటి), పసుమర్తి సుబ్బారావు, పూసర్ల సురేష్‌కుమార్, ముక్తా బాలాజీ, యిండుపూరు కష్ణమోహన్, వరదా రాజన్‌బాబులను ఎన్నుకున్నారు. వీరితో ముఖ్య అతిథి అడ్డగళ్ల శ్రీనివాసరావు, డిస్టిక్ట్ గవర్నర్ అడ్డగళ్ల సునీతాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, వైస్‌చైర్మన్ బెలగాం జయబాబు, ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు నారాయణ ముత్యాలు, డిప్యూటీ గవర్నర్ పేర్ల కామరాజు, జోనల్ చైర్పర్సన్ కొత్తా సన్యాసిరాజు, ప్రెసిడెంట్ డీవీవీఎస్ గుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ వాసవీ తల్లి దయతో ఉత్తమ సేవలందించేందుకు కషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పేద పిల్లలకు బట్టలు, పేదలకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ పెద్దలు బెలగాం రామశంకరరావు, డాక్టర్ వసంత్‌కుమార్, దొగ్గ మోహన్ పాల్గొన్నారు. -
వాసవీక్లబ్ పార్వతీపురం కొత్త కార్యవర్గం ఎన్నిక
పార్వతీపురం వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ పార్వతీపురం కొత్త కార్యవర్గం ఎన్నిక శనివారం రాత్రి హోటల్ శ్రీకాంత్‌లో జరిగింది. క్లబ్ అధ్యక్షునిగా పెంటపాటి సాయికిరణ్, ఉపాధ్యక్షునిగా జల్దు వినయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా పేకేటి పుండరీకాక్ష, కోశాధికారిగా గంటా శైలజ , సంయుక్త కార్యదర్శిగా పీవీ సత్యానంద్, సంయుక్త కోశాధికారిగా మెంటా రవికుమార్‌లను ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా పీవీకే మణికుమార్, పసుమర్తి గోపాలరావు, బుడ్డేపు రామకష్ణ, కందుకూరి ప్రభాకరరావు, పసుమర్తి వెంకటప్రసాద్(బుజ్జి), చెక్కా సత్యనారాయణమూర్తి(చంటి), పసుమర్తి సుబ్బారావు, పూసర్ల సురేష్‌కుమార్, ముక్తా బాలాజీ, యిండుపూరు కష్ణమోహన్, వరదా రాజన్‌బాబులను ఎన్నుకున్నారు. వీరితో ముఖ్య అతిథి అడ్డగళ్ల శ్రీనివాసరావు, డిస్టిక్ట్ గవర్నర్ అడ్డగళ్ల సునీతాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, వైస్‌చైర్మన్ బెలగాం జయబాబు, ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు నారాయణ ముత్యాలు, డిప్యూటీ గవర్నర్ పేర్ల కామరాజు, జోనల్ చైర్పర్సన్ కొత్తా సన్యాసిరాజు, ప్రెసిడెంట్ డీవీవీఎస్ గుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ వాసవీ తల్లి దయతో ఉత్తమ సేవలందించేందుకు కషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పేద పిల్లలకు బట్టలు, పేదలకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ పెద్దలు బెలగాం రామశంకరరావు, డాక్టర్ వసంత్‌కుమార్, దొగ్గ మోహన్ పాల్గొన్నారు. -
రైలు నుండి జారిపడి వ్యక్తి దుర్మరణం
పార్వతీపురం: రైలు నుండి జారిపచి గుర్తుతెలియని వ్యక్తి ఒకరు మతిచెందినట్లు విజయనగరం రైల్వే హెచ్‌సీ బి. గౌరునాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం మరిపి వలస వద్ద విశాఖనుంచి పార్వతీపురం వస్తున్న గుర్తుతెలియని రైలునుంచి దాదాపు 65ఏళ్ల వయసుగల వ్యక్తి జారిపడి మరణించినట్టు తెలిపారు. మతుడి శరీరంపై తెలుపు లాల్చీ, పంచె ఉన్నాయని తెలిపారు. సంబంధీకులు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. -
జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య
పార్వతీపురం : జీవితంపై విసుగుచెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి స్థానిక రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానిక రైల్వే పోలీసులు, మతుని కుటుంబ సభ్యులు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలం ఇప్పలవలస గ్రామానికి చెందిన గుత్తివిల్లి ఆశోక్(22) జులాయిగా తిరిగేవాడు. కొద్ది రోజులుగా రాయగడలో పనిచేస్తూ అప్పుడప్పుడూ ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి స్థానిక రైల్వేస్టేషన్లో గుళికలు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే రైల్వే పోలీసులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ అశోక్ సోమవారం మతి చెందాడు. మతుడికి తల్లి ప్రేమమ్మ, తండ్రి తిరుపతి ఉన్నారు. ఫొటోరైటప్:08పీపీఎం22ఎ,బి అశోక్ -
వారం రోజులుగా నిలిచిన నీటి సరఫరా
ధర పెంచిన మినరల్ వాటర్ ప్లాంట్లు పార్వతీపురం: వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటికి అల్లాడిపోతున్నారు. రైల్వే ఫ్లైఓవర్ వద్ద పైప్‌లైను మార్చే పనిలో భాగంగా ఒకరోజు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ప్రకటించిన మున్సిపాల్టీ, వారం రోజులైనా నీటి సరఫరాను పునరుద్ధరించలేదు. దీంతో క్యాన్లు, బిందెలు పట్టుకొని మినరల్, ఆర్వో ప్లాంట్లకు పరుగులు తీస్తున్నారు. ఇదే అవకాశంగా యజమానులు ధరలు పెంచి మామూలు నీటినే ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు పక్క గ్రామాలు, బోర్లున్న ఇళ్లకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. -
50 క్వింటాళ్ల నువ్వులు స్వాధీనం
పార్వతీపురం: శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం రాత్రి పార్వతీపురం పట్టణంలో దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక నవిరి కాలనీలో అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న తెల్ల ఈశ్వర్రావు అక్రమంగా నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల నువ్వుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్సై అప్పలనాయుడు మాట్లాడుతూ సమాచారం మేరకు దాడులునిర్వహించి, అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన నువ్వులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారి వెంట స్థానిక సీఎస్‌డీటీ ఆవాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానంతో ప్రాణాలు నిలిపిన విద్యార్థి
పార్వతీపురం: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు వాసవీ –గాయత్రి విద్యాసంస్థల విద్యార్థి రక్తం దానం చేసి ప్రాణాలు నిలబెట్టాడు. జియ్యమ్మవలస మండలం బట్లభద్ర గ్రామానికి చెందిన నక్క పార్వతమ్మ కడుపులో పెద్ద కణితి ఏర్పడటంతో అధిక రక్తస్రావమవుతోంది. దీంతో ఆమెకు వెంటనే రక్తం ఎక్కించి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆమె గ్రూపు రక్తం లేకపోవడంతో కుటుంబ సభ్యులు రోడ్డుౖపైకి వచ్చి కనిపించిన వారందరినీ అడిగారు. అటు వెళ్తున్న గాయత్రి కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ , కంప్యూటర్స్ విద్యార్థి గెంబలి చరణ్ తేజ రక్తాన్ని దానం చేశాడు. ఈ సందర్భంగా చర ణ్‌కు రోగి కుటుంబసభ్యులు కతజ్ఞతలు తెలిపారు. -
జ్వరంతో విద్యార్థిని కన్నుమూత
పార్వతీపురం : పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన వసంతాడ రేష్మి అలియాస్ తుషారి (10) జ్వరంతో బాధపడుతూ బుధవారం రాత్రి కన్నుమూసింది. దీనికి సంబంధించి స్థానికులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. వివేకానంద కాలనీకి చెందిన కార్పెంటర్ వసంతాడ శ్రీనివాసరావు, వరలక్ష్మిలకు ముగ్గురు ఆడపిల్లలు. రెండో పాప రేష్మి స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఉన్నట్టుండి బుధవారం ఉదయం తీవ్ర జ్వరం వచ్చింది. వెంటనే స్థానిక చిన్న పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా ఆయన పరీక్షించి విజయనగరంలోని ఆంధ్రా చిల్డ్రన్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు పాపను పరీక్షించి విశాఖకు తరలించమని సూచించారు. ఇంతలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. -
చచ్చిన గొర్రెల అమ్మకం
పార్వతీపురం: పట్టణంలోని వివిధ మాంసం దుకాణాల్లో చచ్చిన గొర్రెల మాంసాన్ని విక్రయిస్తున్నారు. పార్వతీపురం పరిసరాల ప్రాంతాల నుంచి గొర్రెల వ్యాపారులు రోగాలు, ప్రమాదాలు, క్రూరమృగాల బారిన పడి మరణించిన గొర్రెలను తెచ్చి విక్రయిస్తున్నారు. వాటిని స్థానిక వ్యాపారులు కొని విడిగా విక్రయిస్తున్నారు. మృతిచెందిన గొర్రెలను వ్యాపారులు కొనుగోలు చేసేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో సాక్షి చిత్రీకరించడంతో చల్లగా జారుకున్నారు. -
గన్నేరుకాయలు తిని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం : గన్నేరు కాయలు తిని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం స్థానిక రామాపురం కాలనీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బాధితుడు చప్పటి మహేష్ అందించిన వివరాలిలా ఉన్నాయి.కుటుంబ సభ్యులెవ్వరూ పట్టించుకోకపోవడం వల్ల మహేష్ మనస్థాపం చెంది గన్నేరు పిక్కలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇదిలా ఉంటే మహేష్ సైకిల్ షాపులో మెకానిక్‌గా పనిచేస్తూ సంపాదన అంతా తాగుడుకే ఖర్చు చేస్తున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
ఇదేం దెయ్యం గోల..!
పార్వతీపురం స్వీపర్ వీధిలో దెయ్యం వదంతులు తమను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ కుటుంబం పార్వతీపురం: ఇదేమి దెయ్యం గోలరా బాబూ అంటూ శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం పట్టణ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల పట్టణంలోని స్వీపర్ వీధికి చెందిన ఓ కుటుంబం తమను స్థానికులు దెయ్యం పేరుతో వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి వెంటనే స్పందించిన పట్టణ ఎస్ఐ బి.సురేంద్రనాయుడు స్వీపర్ వీధిలో సమావేశం నిర్వహించి అక్కడ ప్రజలను దెయ్యం...లేదంటూ వారిని చైతన్య పరిచేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ ప్రజలు దెయ్యం పెట్టే బాధలు మీకేం తెలుసంటూ ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాలిలావున్నాయి. ఒడిశాకు చెందిన ముగ్గురు పిల్లలు కలిగిన ఓ మహిళను కాలిన గాయాలతో పట్టణంలోని స్వీపర్ వీధికి ఓ కుటుంబం తీసుకొచ్చింది. గాయాల కారణంగా నెలరోజుల క్రితం ఆమె మృతిచెందింది. అయితే ఆమె చనిపోయాక కొందరు వీధివాసులపై పడి తమ పిల్లలను అప్పగించాలని రాత్రిపూట భయాందోళనకు గురిచేస్తోందని స్థానికుల్లో పుకారు వ్యాపించింది. దీంతో ఆ వీధివాసులు మహిళ మృతిచెందిన కుటుంబ సభ్యులకు దెయ్యం రాకుండా భూతవైద్యుడ్నితెచ్చి పలు కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా సూచించారు. అయితే తమ పిల్ల మంచిదని దెయ్యాలు.. భూతాలు ఉండవని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో తమను వేధిస్తున్నారనే ఆవేదనతో పట్టణ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ సురేంద్రనాయుడు స్వీపర్ వీధిలో దెయ్యం లేదంటూ ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. -
పార్వతీపురంలో కార్మికుల ఆందోళన
పార్వతీపురం: ప్రభుత్వం జారీ చేసిన జీవో 279 కి వ్యతిరేకంగా మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు శనివారం విజయనగరం జిల్లా పార్వతీపురం మునిసిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు ఉద్దేశించిన ఈ జీవోను రద్ధు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
పార్వతీపురంలో రైతు మహాధర్నా
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో సోమవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణా రంగారావు ఆధ్వర్యంలో రైతు మహాధర్నా జరిగింది. రైతులకు సంబంధించిన సమస్యలు పట్టించుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. -
ప్రభుత్వ ఉద్యోగాలు లేవు: ఎమ్మెల్యే బొబ్బిలి
బలిజపేట: విజయనగరం జిల్లా బలిజపేట మండలం పెద్దపెంకి గ్రామ ప్రజలు శుక్రవారం పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులను నిలదీశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను అడ్డగించి ‘బాబు వస్తే జాబు’ అన్నారు’ కానీ, జాబులే లేవేంటని అని ప్రశ్నించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, బ్యాంకు రుణాలు అన్నీ ఏకపక్షంగా ఇస్తున్నారని, అర్హులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఎమ్మెల్యే బదులిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని సూచించారు. -
కలుషిత నీటిపై టీడీపీ నేతల నిరసన
తాగునీటి కుళాయిల నుంచి కలుషిత నీరు రావడంపై స్థానిక టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలటీ పరిధిలోని కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ జయప్రకాష్, మరో 14 మంది టీడీపీ కౌన్సెలర్లతో కలసి నిరసన వ్యక్తంచేశారు. పార్వతీపురం మున్సిపల్ చైర్మన్‌కూడా టీడీపీకి చెందిన వారే. అయినప్పటికీ టీడీపీలోని మరో వర్గం నిరసన వ్యక్తం చేయడం విశేషం. -
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న వరహాలగడ్డను ఆక్రమించుకున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయడు, టీడీపీ నాయకుడు అయిన బొంగు జోగినాయుడుతోపాటు మర్రాపు నారాయణస్వామిలను అరెస్ట్ చేసినట్టు మంగళవారం సాయంత్రం ఎస్ఐ బి.అశోక్‌కుమార్ తెలిపారు. వరహాలగడ్డ ఆక్రమణలను 'సాక్షి' దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అధికారులు స్పందించినట్టే స్పందించి చర్యల విషయంలో వెనక్కి తగ్గడంతో... కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నిందితులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
విధులు బహిష్కరించిన హమాలీలు
పార్వతీపురం: విజయనగరం జిల్లాలో పౌరసరఫరాల శాఖ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలు విధులు బహిష్కరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం పౌర సరఫరాల శాఖ గోదాముల వద్ద ఆందోళనలకు దిగారు. పార్వతీపురంలో ఆందోళన చేస్తున్న హమాలీలు గోదాముల వద్ద మూడున్నర టన్నుల కాంటాలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీకి ప్రస్తుతమున్న రూ.12 నుంచి రూ.25కు పెంచాలని కోరారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఆగస్టు 3వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
తాగొద్దన్నందుకు తల్లిని చంపేశాడు
పార్వతీపురం (విజయనగరం) : కుమారుడు తాగి చెడిపోతుంటే.. తాగొద్దురా అని మందలించినందుకు తల్లిని అంతం చేశాడు ఓ తాగుబోతు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బైక్ మెకానిక్‌గా పనిచేసే ఓలేటి త్రినాథ్ శుక్రవారం బాగా మద్యం సేవించి ఇంటికి రావడంతో ఆ విషయమై తల్లి కృష్ణమ్మతో వాగ్వివాదం నడిచింది. మద్యం మత్తులో ఆవేశానికి లోనైన త్రినాథ్.. తాగొద్దంటావా అంటూ రాడ్ తీసుకుని తల్లి తలపై బలంగా కొట్టాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా... కృష్ణమ్మను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
విజయనగరంలో 'వైద్యం' బంద్
పార్వతీపురం: విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది శనివారం విధులను బహిష్కరించారు. కలెక్టర్ తీరుకు నిరసనగా వారు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇటీవల ఓ గర్భిణికి వైద్యం అందించడంలో అలసత్వం చూపారనే ఆరోపణలతో పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడ్ని జిల్లా కలెక్టర్ నాయక్ బదిలీ చేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ వైద్యులు, సిబ్బంది శనివారం నిరసనకు దిగారు. -
సమావేశాలప్పుడే ఎమ్మెల్యే గుర్తొస్తారా
విజయనగరం : విజయనగరం జిల్లా పార్వతీ పురంలో ఐటీడీఏ సమావేశం బుధవారం ఉదయం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అధికారపక్షాన్ని పలు సమస్యలపై నిలదీశారు. ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ సమావేశాలప్పుడు మాత్రమే ఎమ్మెల్యే గుర్తొస్తున్నారని అధికార పక్షాన్ని విమర్శించారు. పర్నీచర్ కొనుగోలు టెండర్ల విషయాన్ని సభ్యులకు ఎందుకు తెలపలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పి. శ్రీవాణి కూడా ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టారు. గిరిజన ప్రాంతాల్లో క్లస్టర్ స్కూల్ విధానంతో డ్రాప్‌అవుట్ శాతం పెరుగుతుందని ఆమె కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు తెలిపారు. రాష్ట్ర మంత్రి మృణాళిని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గిరిజన ప్రాంతాల్లో క్లస్టర్ స్కూల్ విధానాన్ని అమలు చేయకుండా చూడాలని సూచించారు. (పార్వతీపురం) -
'..ఉన్న ఉద్యోగాల్ని పీకేస్తున్నారు'
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం వెంకంపేటగోరీలు వద్ద స్థానిక రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు పంటల పంటల రుణమాఫీ చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలపై జగన్‌తో మహిళలు మాట్లాడారు. పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్ జగన్‌ను ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కలిశారు. ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాల్ని తీసివేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తమను ఎస్టీల్లో చేర్చాలంటూ జగన్ ను రజకులు కోరారు. -
‘ఎయిడెడ్’ విద్యార్థులపై వివక్ష?
పార్వతీపురం, న్యూస్‌లైన్: ఐటీడీఏ పరిధిలోని ఎయిడెడ్(ద్రవ్యసహాయక) పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఐటీడీఏ పరిధిలోని అన్ని పాఠశాలలు, వసతిగృహ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఎయిడెడ్ విద్యార్థులకు ఎందుకు పంపిణీ చేయడంలేదో అర్థం కావడంలేదు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తరగతి గదుల్లో యూనిఫాం వేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వమే ఐటీడీఏ పరిధిలోగల అన్ని పాఠశాలలకు యూనిఫాంలు సరఫరా చేసింది. ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రం సరఫరా చేయలేదు. ఐటీడీఏ పరిధిలోని గుమ్మలక్ష్మీ పురం మండలంలో 11, కురుపాం మండలంలో 10, కొమరాడ మండలంలో 3 ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్నవారంతా గిరిజన విద్యార్థులే. అయితే వీరికి మాత్రం యూనిఫాంలు పంపిణీ చేయకపోవడంతో..ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకోవడమే తమ పిల్లల నేరమా? అంటూ ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలైన ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నభోజన పథకం వంటివి ఈ పాఠశాలల్లో అమలవుతున్నాయి కానీ యూనిఫాం లను పంపిణీ చేయకపోవడానికి కారణమేమిటో పాఠశాలల యాజమాన్యాలకు అర్థం కావడం లేదు. ఈ విషయంపై పలు గిరిజన సంఘాలు స్థానిక శాసనసభ్యులకు, ఐటీడీఏ పీఓకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం కనిపించ లేదు. వందలాది మంది గిరిజన విద్యార్థులకు ఇలా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండబోమని పలు గిరిజన ఉపాధ్యాయసంఘాలు, గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి.