
సాక్షి, విజయనగరం : ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరో ఎనిమిదిమంది తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జిల్లాలోని జియ్యమ్మ మండలం గవరమ్మపేట జంక్షన్ వద్ద జరిగింది. గుమ్మ లక్ష్మీపురం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు పార్వతీపురం నుంచి జియ్యమ్మవలస వైపు పదిమంది ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆటోలో చిక్కుకున్న వారిని రక్షించి క్షతగాత్రులను పార్వతీపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరడాని సత్యవతి అనే మహిళ మృతిచెందింది. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment