మజ్జి గణేష్
సాక్షి, విజయనగరం : మరణాంతరం ఆ యువకుడు అందరిలో సజీవంగా నిలిచాడు. ఆ యువకుడి తల్లిదండ్రులు వైద్యుల కోరిక మేరకు తమ బిడ్డ నేత్రాలను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం పట్టణంలో విటి అగ్రహారంలో నివాసముంటున్న మజ్జి గణేష్ (22) డిగ్రీ పూర్తి చేసి, స్థానిక జెరాక్స్ షాపులో పని చేస్తున్నాడు. ప్రతీ రోజూ జిమ్‌కు వెళ్లడం అలవాటుగా ఉన్న గణేష్ రోజూలాగే శుక్రవారం ఇంటి నుంచి జిమ్‌కు బయలుదేరాడు. స్థానిక ప్రదీప్‌నగర్ జంక్షన్ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ బైక్‌పై వెళ్తున్న గణేష్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో గణేష్ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. గణేష్ తండ్రి శ్రీనివా సరావు జ్యూట్ మి ల్లులో కార్మికునిగా పని చేసి మిల్లు మూసేయడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దల కోరిక మేరకు గణేష్ నేత్రాలను దానం చేశారని ట్రాఫిక్ ఎస్‌ఐ రామకృష్ణ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment