ఘోర ప్రమాదం
పార్వతీపురం టౌన్: భార్య కళ్లేదుటే ఘోరం జరిగిపోయింది. ఊహించని విధంగా మృత్యువు లారీ రూపంలో వచ్చి భర్తను కానరాని లోకాలకు తీసుకుపోవడంతో ఆ భార్యను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అంతవరకు తనతోనే ఉన్న భర్త రెప్పపాటు వ్యవధిలోనే అందనంత ఎత్తుకు వెళ్లిపోతాడని ఊహించని ఆ మహిళ పడుతున్న వేదన వర్ణణాతీతం. వివరాల్లోకి వెళ్తే..పార్వతీపురం పట్టణం 12వ వార్డు పరిధిలోని ఇందిరా కాలనీకి చెందిన కోలా కల్యాణ్ (36) అనే ఆటోడ్రైవర్ ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందారు.
కల్యాణ్ ఆయన భార్య ఉదయం 4 గంటల సమయంలో రోడ్డుపైకి వచ్చి టీ తాగారు. తర్వాత కల్యాణ్ ఆటోను రోడ్డు పక్క నిల్చోబెట్టి తడుస్తున్నారు. ఆ సయమంలో రాయఘడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ ఒకటి ప్రమాదవశాత్తూ కల్యాణ్‌పైకి దూసుకెళ్లి రోడ్డుపై చాలా దూరం ఈడ్చుకుపోయింది. అంతకుముందే లారీ బోరింగ్‌ను, అక్కడే ఉన్న బట్టలకొట్టు గోడను ఢీకొట్టింది. అనంతరం కల్యాణ్ ఢీ కొని ఈడ్చుకుపోయింది.
దాన్ని గమనించిన స్థానికులు ఆయన భార్య రజినీకి విషయం చెప్పిడంతో వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో విగతజీవుడై కనిపించాడు. దాంతో రజినీని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. ప్రమాదంలో లారీకి ఉన్న 16 చక్రాల్లో రెండు చక్రాలు ఊడిపోయాయి. కానీ డ్రైవర్ 14 చక్రాలతోనే లారీని తీసుకెళ్లడం గమనార్హం.
పోలీసులు కేసు నమోదు..
జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పట్టుకునేందుకు అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. అయితే లారీ డ్రైవర్ సీతానగరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పట్టణ ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పత్రికి తరలించి పోస్టు మర్టం నిర్వహించారు.లారీ డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు.అయితే లారీ డ్రైవర్ పార్వతీపురం నుంచి విశాఖపట్నం వైపు వెల్లి సీతానగరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.దీనినిపై పట్టణ ఎస్‌ఐ రాజేస్ కేసునమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.