
విజయనగరంలో 'వైద్యం' బంద్
పార్వతీపురం: విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది శనివారం విధులను బహిష్కరించారు. కలెక్టర్ తీరుకు నిరసనగా వారు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇటీవల ఓ గర్భిణికి వైద్యం అందించడంలో అలసత్వం చూపారనే ఆరోపణలతో పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడ్ని జిల్లా కలెక్టర్ నాయక్ బదిలీ చేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ వైద్యులు, సిబ్బంది శనివారం నిరసనకు దిగారు.