వారం రోజులుగా నిలిచిన నీటి సరఫరా
ధర పెంచిన మినరల్ వాటర్ ప్లాంట్లు
పార్వతీపురం: వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటికి అల్లాడిపోతున్నారు. రైల్వే ఫ్లైఓవర్ వద్ద పైప్‌లైను మార్చే పనిలో భాగంగా ఒకరోజు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ప్రకటించిన మున్సిపాల్టీ, వారం రోజులైనా నీటి సరఫరాను పునరుద్ధరించలేదు. దీంతో క్యాన్లు, బిందెలు పట్టుకొని మినరల్, ఆర్వో ప్లాంట్లకు పరుగులు తీస్తున్నారు. ఇదే అవకాశంగా యజమానులు ధరలు పెంచి మామూలు నీటినే ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు పక్క గ్రామాలు, బోర్లున్న ఇళ్లకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు.