చచ్చిన గొర్రెల అమ్మకం
పార్వతీపురం: పట్టణంలోని వివిధ మాంసం దుకాణాల్లో చచ్చిన గొర్రెల మాంసాన్ని విక్రయిస్తున్నారు. పార్వతీపురం పరిసరాల ప్రాంతాల నుంచి గొర్రెల వ్యాపారులు రోగాలు, ప్రమాదాలు, క్రూరమృగాల బారిన పడి మరణించిన గొర్రెలను తెచ్చి విక్రయిస్తున్నారు. వాటిని స్థానిక వ్యాపారులు కొని విడిగా విక్రయిస్తున్నారు. మృతిచెందిన గొర్రెలను వ్యాపారులు కొనుగోలు చేసేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో సాక్షి చిత్రీకరించడంతో చల్లగా జారుకున్నారు.