జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య
పార్వతీపురం : జీవితంపై విసుగుచెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి స్థానిక రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానిక రైల్వే పోలీసులు, మతుని కుటుంబ సభ్యులు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలం ఇప్పలవలస గ్రామానికి చెందిన గుత్తివిల్లి ఆశోక్(22) జులాయిగా తిరిగేవాడు. కొద్ది రోజులుగా రాయగడలో పనిచేస్తూ అప్పుడప్పుడూ ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి స్థానిక రైల్వేస్టేషన్‌లో గుళికలు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే రైల్వే పోలీసులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ అశోక్ సోమవారం మతి చెందాడు. మతుడికి తల్లి ప్రేమమ్మ, తండ్రి తిరుపతి ఉన్నారు.
ఫొటోరైటప్:08పీపీఎం22ఎ,బి అశోక్