రక్తదానంతో ప్రాణాలు నిలిపిన విద్యార్థి
Published Thu, Jul 28 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
పార్వతీపురం: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు వాసవీ –గాయత్రి విద్యాసంస్థల విద్యార్థి రక్తం దానం చేసి ప్రాణాలు నిలబెట్టాడు. జియ్యమ్మవలస మండలం బట్లభద్ర గ్రామానికి చెందిన నక్క పార్వతమ్మ కడుపులో పెద్ద కణితి ఏర్పడటంతో అధిక రక్తస్రావమవుతోంది. దీంతో ఆమెకు వెంటనే రక్తం ఎక్కించి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆమె గ్రూపు రక్తం లేకపోవడంతో కుటుంబ సభ్యులు రోడ్డుౖపైకి వచ్చి కనిపించిన వారందరినీ అడిగారు. అటు వెళ్తున్న గాయత్రి కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ , కంప్యూటర్స్ విద్యార్థి గెంబలి చరణ్ తేజ రక్తాన్ని దానం చేశాడు. ఈ సందర్భంగా చర ణ్‌కు రోగి కుటుంబసభ్యులు కతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement