స్వాధీనం చేసుకున్న సామగ్రి
పార్వతీపురం : పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ సీఐ ఎస్. విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆటోలో నాటు సారా తీసుకువస్తున్న అజ్జాడ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుంచి 80 లీటర్ల నాటుసారా, ఆటో, సారా తయారీ సామాన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒడిశా నుంచి ఆటోలో సారా తీసుకువస్తున్న సొండి వినోద్‌ను కూడా అరెస్ట్ చేశారు.