గన్నేరుకాయలు తిని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం : గన్నేరు కాయలు తిని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం స్థానిక రామాపురం కాలనీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బాధితుడు చప్పటి మహేష్ అందించిన వివరాలిలా ఉన్నాయి.కుటుంబ సభ్యులెవ్వరూ పట్టించుకోకపోవడం వల్ల మహేష్ మనస్థాపం చెంది గన్నేరు పిక్కలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇదిలా ఉంటే మహేష్ సైకిల్ షాపులో మెకానిక్‌గా పనిచేస్తూ సంపాదన అంతా తాగుడుకే ఖర్చు చేస్తున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.