ప్రమాణ స్వీకారం చేసిన కొత్త కార్యవర్గం
పార్వతీపురం వాసవీ క్లబ్ ఇంటర్‌నేషనల్ పార్వతీపురం కొత్త కార్యవర్గం ఎన్నిక శనివారం రాత్రి హోటల్ శ్రీకాంత్‌లో జరిగింది. క్లబ్ అధ్యక్షునిగా పెంటపాటి సాయికిరణ్, ఉపాధ్యక్షునిగా జల్దు వినయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా పేకేటి పుండరీకాక్ష, కోశాధికారిగా గంటా శైలజ , సంయుక్త కార్యదర్శిగా పీవీ సత్యానంద్, సంయుక్త కోశాధికారిగా మెంటా రవికుమార్‌లను ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా పీవీకే మణికుమార్, పసుమర్తి గోపాలరావు, బుడ్డేపు రామకష్ణ, కందుకూరి ప్రభాకరరావు, పసుమర్తి వెంకటప్రసాద్(బుజ్జి), చెక్కా సత్యనారాయణమూర్తి(చంటి), పసుమర్తి సుబ్బారావు, పూసర్ల సురేష్‌కుమార్, ముక్తా బాలాజీ, యిండుపూరు కష్ణమోహన్, వరదా రాజన్‌బాబులను ఎన్నుకున్నారు. వీరితో ముఖ్య అతిథి అడ్డగళ్ల శ్రీనివాసరావు, డిస్టిక్ట్ గవర్నర్ అడ్డగళ్ల సునీతాదేవి, మున్సిపల్ చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, వైస్‌చైర్మన్ బెలగాం జయబాబు, ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు నారాయణ ముత్యాలు, డిప్యూటీ గవర్నర్ పేర్ల కామరాజు, జోనల్ చైర్‌పర్సన్ కొత్తా సన్యాసిరాజు, ప్రెసిడెంట్ డీవీవీఎస్ గుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ వాసవీ తల్లి దయతో ఉత్తమ సేవలందించేందుకు కషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పేద పిల్లలకు బట్టలు, పేదలకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ పెద్దలు బెలగాం రామశంకరరావు, డాక్టర్ వసంత్‌కుమార్, దొగ్గ మోహన్ పాల్గొన్నారు.