సివిల్స్ పరీక్ష రాసేందుకు వెళ్లుతున్న విద్యార్థులు
యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి): సివిల్స్ సర్వీసుల్లో ప్రవేశానికి యూపీఎస్సీ ఆదివారం తిరుపతిలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలు తిరుపతిలో ప్రశాంతంగా జరిగాయి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు మొత్తం 8,024 మంది దరఖాస్తు చేశారు. వారిలో కేవలం 35 శాతం మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఉదయం నిర్వహించిన పేపర్ –1కు 2,845 మంది హాజరయ్యారు. 5,179 మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2కు 2,808 మంది హాజరు కాగా 5,216 మంది హాజరు కాలేదు.