tpt
-
తిరుపతిలో ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమినరీ
యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి): సివిల్స్ సర్వీసుల్లో ప్రవేశానికి యూపీఎస్సీ ఆదివారం తిరుపతిలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలు తిరుపతిలో ప్రశాంతంగా జరిగాయి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు మొత్తం 8,024 మంది దరఖాస్తు చేశారు. వారిలో కేవలం 35 శాతం మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఉదయం నిర్వహించిన పేపర్ –1కు 2,845 మంది హాజరయ్యారు. 5,179 మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2కు 2,808 మంది హాజరు కాగా 5,216 మంది హాజరు కాలేదు. -
అలరించిన ఆర్తి, అర్చనల గానామృతం
తిరుపతి కల్చరల్: త్యాగరాజ సంగీతోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి త్యాగరాజ మండపంలో కవలలైన ఆర్తి, అర్చనల గానామృతం కమనీయంగా సాగింది. సద్గురు శ్రీత్యాగరాజస్వామి 250వ జయంతి సందర్భంగా త్యాగరాజు ఉత్సవ కమిటీ74వ వార్షిక సంగీతోత్సవాలు సోమవారంతో 8వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చెన్నైకి చెందిన ఇంజినీరింగ్ పట్టభద్రులైన కవలలు శాస్త్రీయ కర్ణాటక సంగీతంతో శ్రోతల హృదయాలను రంజింపజేశారు. శ్రీరాగంలో వందే వాసుదేవం, విజయశ్రీ రాగంలో వరనారద నారాయణ., భైరవి రాగంలో తనయుని బ్రోబ జనని వచ్చునో వంటి అపూర్వ కృతులను ఆలపించి ప్రేక్షకుల హర్ష««ధ్వానాలు అందుకున్నారు. వీరికి వయోలిన్‌పై రాజీవ్, మృందంగంపై ప్రవీణ్ చక్కటి సహకారం అందించారు. అనంతరం చెన్నైకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, సప్తగిరి సంగీత విద్వన్మణి అరుణాసాయిరామ్ గాత్ర కచేరి సాగింది. తోడిరాగంలో కద్దను వారికి కద్దు కద్దు.., హిరణ్మయి లక్ష్మీ లలిత వంటి అన్నమయ్య, ముత్తుస్వామి దీక్షితులు, వనానందకరంగా ఆలపించి ప్రేక్షులను మైమరిపించారు. వీరికి వయోలిన్‌పై ఎంఏ.కృష్ణస్వామి, మృదంగంపై వైద్యనాథన్, ఘటంపై మురళి సహకారం అందించారు. ఈ సందర్భంగా సంగీత విద్యాంసులను త్యాగరాజ ఉత్సవ కమిటీ నిర్వాహకులు భీమాస్ రఘు, కంచి రఘురామ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మోహనసుందరం, ప్రభాకర్, వేణుగోపాల్‌రెడ్డి, దొరైరాజ్ పాల్గొన్నారు. -
‘మహాప్రభో..మా గోడు వినండి’
– నిరవధిక సమ్మెలో ఏజీ వర్సిటీ టైమ్‌స్కేల్ ఉద్యోగులు – రెగ్యులరైజేషన్, హెచ్ఆర్ఏల ఊసెత్తని ప్రభుత్వం – డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమణ సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కేంద్రాల్లో పనిచేసే టైమ్‌స్కేల్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గడచిన నెల రోజులుగా వీరు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నెల రోజుల్లోగా డిమాండ్లను పరిష్కరిస్తామన్న వర్సిటీ అధికారులు మళ్లీ ఉద్యోగుల ముఖం చూసింది లేదు. దీంతో టైమ్‌స్కేల్ ఉద్యోగులంతా డిమాండ్ల సాధన కోసం రోజుకో పద్దతిలో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం 900 మంది టైమ్‌స్కేల్ ఉద్యోగులున్నారు. వీరంతా మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉద్యోగాల్లో నియమితులైన వారే. అప్పట్లో మొత్తం 1650 మంది ఉద్యోగాల్లో చేరగా, 2014 నాటికి 900 మంది మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. మిగతా వారంతా ఉద్యోగ విరమణ చేశారు. ప్రభుత్వం వీరికి మూలవేతనం, డీఏలను మాత్రమే చెల్లిస్తోంది. ఇవి రెండూ కలిపి ఒక్కొక్కరికీ నెలకు రూ. 14 వేల వరకూ అందుతున్నాయి. వీరి నియామకాల సమయంలో హెచ్ఆర్ఏ, సిటీ అలవెన్సులపై ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంతేకాకుండా జీవో నెంబరు 119 కింద వీరి ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా వీరి సమస్యలపై స్పందించనే లేదు. ఇప్పటికి పలు మార్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు, వర్సిటీ రిజిస్ట్రార్ టీవీ సత్యనారాయణలను కలిసిన టైమ్‌స్కేల్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. వారి నుంచి సరైన స్పందన కరువవడంతో గుంటూరులోని వర్సిటీ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. గుంటూరు,తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, కడప, కర్నూలుల్లో వర్సిటీ పరిధిలోని టైమ్‌స్కేల్ ఉద్యోగులు రోజుకో విధంగా నిరసనలు, ఆందోళనలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని యూనివర్సిటీ టైమ్‌స్కేల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పీ మురళీ కోరుతున్నారు. -
మంచుకురిసే వేళలో..
-
అగ్నిగుండ మహోత్సవంలో అపశ్రుతి