సీఎం రాజధాని జపం
సీఎం రాజధాని జపం
Published Wed, Nov 16 2016 9:03 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
- మాజీ కేంద్ర మంత్రి కోట్ల
కోడుమూరు : రాష్ట్రంలో తీవ్రమైన దుర్భిక్షమైన పరిస్థితులతో రైతులు కొట్టుమిట్టాడుతుంటే సీఎం చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా రాజధాని జపం చేస్తున్నాడని కేంద్ర మాజీ రైల్వే సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన కోడుమూరులో విలేకర్లతో మాట్లాడారు. 7 లక్షల ఎకరాల్లో రెయిన్‌గన్‌ల ద్వారా పంటలను కాపాడానని చెబుతూ మరోవైపు కరువు మండలాలను ప్రకటించి సీఎం ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మోసాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఎన్నో రోజులు నడపలేరని హెచ్చరించారు. రైతు సమస్యలపై పోరాడేందుకు ఈ నెల 19న కోడుమూరులో రైతు మహాసభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున కర్గే, సినీ నటుడు చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పనబాక లక్ష్మీ, పల్లం రాజు, జేడీ శీలం, కేవీపీ రామచంద్రారావు, సి.రామచంద్రయ్య హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, సర్పంచ్ సిబి.లత పాల్గొన్నారు.
Advertisement