8న జిల్లాకు సీఎం | cm visits abdullapurmet for haritha haram july 8th | Sakshi
Sakshi News home page

8న జిల్లాకు సీఎం

Published Tue, Jul 5 2016 2:59 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

8న జిల్లాకు సీఎం - Sakshi

8న జిల్లాకు సీఎం

అబ్దుల్లాపూర్‌మెట్‌లో హరితహారం ప్రారంభించే అవకాశం

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 8న జిల్లాకు రానున్నారు. హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిర్వహించే ‘హరితహారం’లో మొక్కలు నాటనున్నారు. ఆ రోజున నల్లగొండ జిల్లాలో రాష్ట్రస్థాయిలో  హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఈ నేపథ్యంలో విజయవాడ జాతీయ రహదారికిరువైపులా మొక్కలు నాటడం ద్వారా మన జిల్లాలో కూడా హరితహారంను ప్రారంభించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన అధికారికంగా ఖరారుకాకపోయినా.. జిల్లా యంత్రాంగానికి ఈ మేరకు మౌఖిక ఆదేశాలందాయి. దీంతో హయత్‌నగర్ మండలంలో సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం అధికారులు పరిశీలించనున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement