KALVAKUNTLA Chandrasekhar Rao
-
కన్నడిగుల కోసం సాహిత్య వేదిక
సాక్షి, హైదరాబాద్: గంగా జమునా తహెజీబ్‌కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకోవడానికి ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల సాహిత్యం, సంస్కృతిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న కన్నడ భాష మాట్లాడే కన్నడిగుల కోసం సాహిత్యవేదికను పునర్నిర్మాణం చేయాలని సీఎం నిర్ణయించారు. అందుకోసం రూ.5 కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా నివసిస్తున్న కర్ణాటకవాసులు, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాచిగూడలోని ‘కర్ణాటక సాహిత్య మందిరం’పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దానికి సంబంధించిన అనుమతిపత్రాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు శుక్రవారం ప్రగతిభవన్‌లో అందచేశారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు కమ్యూనిటీ అవసరాల కోసం వినియోగించుకునేవిధంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని అధికారులు, ఎమ్మెల్యేకు సీఎం సూచించారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు. -
‘దేశ భవిష్యత్తు కోసం.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి’
సాక్షి, హైదరాబాద్: దేశ బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు ముక్తకంఠంతో కోరారు. దేశంలో మోదీ సారథ్యంలోని రాక్షసపాలన అంతం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించి సాధించడంతో పాటు ఏ విధంగానైతే అభివృద్ధి చేశారో, ఆ విధంగా దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు జాతీయ పార్టీ ఏర్పాటు చేసి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న 21 మంది టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శుక్రవారం తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కావాలి కేసీఆర్.. రావాలి కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని దేశ ప్రజలు భావిస్తున్నారని బాల్క సుమన్ చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమై రాజకీయ శూన్యత ఏర్పడిందని, ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌తో ప్రత్యామ్నాయ శక్తి ఏర్పాటవుతుందని అన్ని రాష్ట్రాల నేతలు, ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పాలన లో దేశంలోని ఏ వర్గానికీ మేలు జరగడం లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. రైతులు, యువత, మహి ళలు, దళిత, బలహీన వర్గాలకు చెందిన వారంతా కేసీఆర్‌ను కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ తరహా అభివృద్ధి కోసం దేశ ప్రజలంతా చూస్తున్నా రని చెప్పారు. కావాలి కేసీఆర్.. రావాలి కేసీఆర్ అని ప్రజలు అంటున్నారని తెలిపారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందని లింగయ్య యాదవ్ విమర్శించారు. జిల్లాల పార్టీ అధ్యక్షులే కాదని, అన్ని స్థాయిల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ జాతీయ రాజకీ యాల్లోకి రావాలని కోరుతున్నారని తెలిపారు. తెలంగాణపై మోదీ సర్కారు కుట్ర అమిత్ షా ఆగడాలకు అడ్డుకట్ట పడాలన్నా, మోదీ మెడలు వంచాలన్నా కేసీఆర్‌తోనే సాధ్యమని మాలోత్ కవిత చెప్పారు. దేశ ప్రజలంతా ఆయన రాకకోసం ఎదురుచూస్తు న్నారని అన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని ధ్వజమెత్తారు. దేశాన్ని మోదీ బ్రష్టు పట్టించారని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమని మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని పద్మాదేవేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని చింతా ప్రభాకర్ చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని దాస్యం వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఒక విజన్ ఉన్న నాయకుడి కోసం దేశమంతా ఎదురుచూస్తున్నదని గువ్వల బాలరాజు పేర్కొన్నారు. దేశానికి కేసీఆర్ అవసరం ఉంది దేశానికి ప్రస్తుతం కేసీఆర్ అవసరం ఎంతో ఉందని, ఆయన దేశాన్ని పాలించాలని కోరుకంటి చందర్ పేర్కొన్నారు. దేశాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని సంపత్‌రెడ్డి అన్నారు. దేశాన్ని ఆవహించిన చీకటిని తొలగించే కాంతి రేఖ సీఎం కేసీఆర్ అని తాత మధు చెప్పారు. ఎంతో దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలని శంభీపూర్ రాజు అన్నారు. యావత్ దేశం కేసీఆర్ కోసం తెలంగాణ వైపు చూస్తున్నదని ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. పీవీ తర్వాత దేశానికి మరోసారి ప్రధానమంత్రిని అందించాలని కరీంనగర్ ఎదురు చూస్తోందని, కేసీఆర్ దేశానికి దారి చూపాలని జీవీ రామకృష్ణారావు చెప్పారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ముజీబ్, తోట ఆగయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
పాన్ ఇండియా పార్టీ.. దసరాకు విడుదల!
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరాను ముహూర్తంగా ఎంచుకున్నారు. విజయదశమి రోజున హైదరాబాద్ వేదికగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ పార్టీ పేరు, పతాకం, ఎజెండా తదితరాలపై ఇప్పటికే కసరత్తు పూర్తిచేసిన కేసీఆర్.. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేలా పార్టీ ప్రకటన ఉండాలని భావిస్తున్నారు. పార్టీ ప్రారంభానికి జాతీయస్థాయిలో భావ సారూప్యత కలిగిన పార్టీలు, ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు మంతనాలు జరుగుతున్నాయి. కొత్త జాతీయ పార్టీ ప్రకటనను స్వాగతిస్తూ తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా వేడుకలు జరిగేలా సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. పార్టీ ప్రకటన తర్వాత సుమారు రెండు నెలల పాటు వివిధ రాష్ట్రాల్లో విస్తృతస్థాయిలో పర్యటించేలా షెడ్యూల్ కూడా రూపొందిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. గులాబీ జెండా.. భారతదేశ చిత్రపటం? వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమాతోపాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమ్మేళనంగా కేసీఆర్ జాతీయ పార్టీ ఎజెండా ఉంటుందని అంచనా. రైతులు, దళితులు, సైనికులు, యువత తదితర వర్గాలకు పార్టీ ఎజెండాలో పెద్దపీట వేయనున్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ జెండా తరహాలోనే జాతీయ పార్టీ జెండా కూడా గులాబీ రంగులో భారతదేశ చిత్రపటంతో ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ పార్టీకి ‘భారతీయ రాష్ట్ర్ర సమితి’గా పేరు ఉంటుందనే ప్రచారం జరుగుతున్నా చివరి నిమిషం దాకా పేరుపై సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. జిల్లాల్లో పార్టీ నేతల తీర్మానాలు సుమారు ఏడాదిన్నరగా జాతీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ప్లీనరీ, పార్టీ సమావేశాలు, బహిరంగ సభల్లో కొత్త పార్టీ ఏర్పాటుకు ఆమోదం కోరుతూ వస్తున్నారు. తాజాగా శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఇదే తరహాలో పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ నేతలు కూడా ప్రకటన చేయనున్నారు. సోమ, మంగళవారాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ప్రసంగాల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించే అవకాశం ఉందని తెలిసింది. ఇక కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ జిల్లా, మండల స్థాయిలోనూ టీఆర్ఎస్ నేతలు తీర్మానాలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కీలక టీమ్‌లో వినోద్, కవిత? కొత్త జాతీయ పార్టీ విస్తరణకు అవసరమైన టీమ్‌ను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. వీరితోపాటు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరుల సేవలను కూడా కొత్త జాతీయ పార్టీలో కేసీఆర్ ఉపయోగించుకుంటారని సమాచారం. రేపు రాష్ట్రానికి జేడీఎస్ నేత కుమారస్వామి ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పలువురు బీజేపీయేతర, కాంగ్రెసేతర సీఎంలు, ముఖ్య నేతలతో కేసీఆర్ వరుసగా భేటీలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్ ఆహ్వానం మేరకు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసే జాతీయ పార్టీలో చిన్నా, చితకా ప్రాంతీయ పార్టీలు, దేశవ్యాప్తంగా పేరొందిన కొందరు ప్రముఖ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఆయా పార్టీల విలీనం, చేరికలకు సంబంధించి ఇప్పటికే మంతనాలు పూర్తయినట్టు సమాచారం. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన తర్వాత.. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే దేశవ్యాప్త పర్యటనల ద్వారా కొత్త పార్టీ విస్తరణ, బలోపేతం దిశగా కృషి చేయనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: ఎన్నికలే టార్గెట్‌గా ఇన్‌చార్జ్‌ల నియామకం.. బీజేపీ మాస్టర్ ప్లాన్స్! -
29న వస్తున్న ‘ఉద్యమ సింహం’
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఉద్యమ సింహం. ఈ సినిమా ట్రైలర్‌ను ఎంపీ కవిత పుట్టిన రోజు సందర్భంగా ఉద్యమ సింహం థియేట్రికల్ ట్రైలర్ విడుదల. తెలంగాణ ఉద్యమ సారథి .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపధ్య కథతో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమసింహం’. నటరాజన్, మాధవి రెడ్డి, జలగం సుధీర్, లత ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకం పై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్బంగా నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర రావు ట్రైలర్ విడుదల చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సింహం సినిమా కేసీఆర్ జీవిత కథ కాదు. ఇది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో సాగిన అంశాల నేపథ్యంగా తెరకెక్కించిన కథ. కేసీఆర్ పాత్రలో నటరాజన్ చక్కగా నటించారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావొచ్చాయి. ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు. దర్శకుడు కృష్ణంరాజు మాట్లాడుతూ .. ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు నడిపారు కానీ ఒక్క కేసీఆర్ మాత్రమే పోరాడి తెలంగాణను సాధించాడు. ఆయన సంకల్పం బలమైనది. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం ఎలా జరిపారు అన్న అంశాలు ఈ సినిమాలో చూపిస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ బండారి ఇచ్చిన పాటలు హైలెట్ గా నిలిచాయి. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. -
కాంగ్రెస్ అవినీతే అడ్డంకి..సారీ సారీ
హైదరాబాద్ : కాంగ్రెస్ అవినీతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి అని వ్యాఖ్యానించి కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి నాలిక కరుచుకున్నారు. అంతలోనే సర్దుకుని.. సారీ సారీ.. టీఆర్ఎస్ అవినీతే అభివృద్ధికి అడ్డంకి అని విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాయలంలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్పై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కాళ్లలో కట్టెలు పెడుతున్నారన్న టీఆర్ఎస్ నేతల మాటలను ఖండిస్తున్నానని చెప్పారు. ఎవరు కట్టెలు పెడుతున్నారు.. ఎవరి కాళ్లలో పెడుతున్నారు.. హరీష్ రావు కాళ్లలో పెట్టినారా లేక కేసీఆర్ కాళ్లలో పెట్టినారా అని సూటిగా ప్రశ్నించారు. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పెద్ద యూజ్‌లెస్‌ఫెల్లో అని తీవ్రపదజాలం వాడారు. కేసీఆర్, హరీష్‌ల అవినీతి బయటపెడతా అని వెల్లడించారు. కాళేశ్వరం పేరుతో బాంబే తమాషా చూపిస్తున్నారని, కాళేశ్వరం మోటార్లు కాంగ్రెస్ హయాంలో తెచ్చినవే కదా అని వ్యాఖ్యానించారు. ఆర్టీఐలో సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని సూటిగా ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, మూడెకరాల భూ పంపిణీ ఏం అయిందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు వంద సీట్లు ఎలా వస్తాయో చూసుకుందామని అని అన్నారు. నాకు సెక్యూరిటీ తొలగిస్తే భయపడనని, ప్రజలే తనకు సెక్యూరిటీ ఉంటారని చెప్పారు. తాను తప్పు చేస్తే తనను జైల్లో పెట్టండి..రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారమే తాను ప్రశ్నిస్తున్నానని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎందుకు పూర్తి చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. దోచుకోవడం, దాచుకోవడం కోసమే రీడిజైన్, రీఎస్టిమేషన్‌లు వేస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై నాగం జనార్దన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రవేశ పెట్టిన 108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వివరించారు. -
వచ్చే నెలనుంచి కాలేజీల విలీన పక్రియ
ఎంజీయూ(నల్లగొండ రూరల్) : వచ్చే నెల నుంచి రాష్ట్రంలో డిగ్రీ, పీజీ ప్రైవేట్ కళాశాలల విలీన ప్రక్రియను చేపడతామని రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీలో నిర్వహించిన రీసెర్చ్ మెథడాలజీ మూడు రోజుల వర్క్ షాప్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1100 డిగ్రీ, పీజీ కాలేజీలు ఉన్నాయని, అడ్మిషన్లు లేని డిగ్రీ, పీజీ కాలేజీలు 55, 20 శాతం అడ్మిషన్లు ఉన్న కాలేజీలు150 ఉన్నాయన్నారు. దోస్త్ ఆన్లైన్ (డిగ్రీ అడ్మిషన్లు)అడ్మిషన్లు 4 లక్షల 10 వేల సీట్లు ఉండగా గత ఏడాది 1 లక్ష 80 వేల సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. 400 డిగ్రీ కాలేజీలు అదనంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఒక మండలంలో 2, 3 డిగ్రీ కాలేజీల నుంచి పూర్తిస్థాయి అడ్మిషన్లు లేనపుడు వాటిని విలీనం చేయడం వల్లా క్వాలిటి విద్య పెరగడంతో పాటు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కొన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 200 కాలేజీల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామన్నారు. 2018–19 కి విద్యార్థులు తరగతి గదుల్లో ఉండాలి.. ఉపాధ్యాయులు బోధించాలే... అనే నినాదంతో ముందుకు పోతామన్నారు. యూనివర్సిటీకి, పరిశ్రమల మధ్య అనుసంధానం ఏర్పడడంతో పాటు అధ్యాపకులకు నైపుణ్యం పెంచేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థికి ఉద్యోగం, ఉపాధి లభించే విధంగా నైపుణ్యాలను పెంచుతామన్నారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు బెస్ట్ రీసెర్చ్ అవార్డు ఇస్తామన్నారు. సీబీసీఎస్ విధానం విద్యార్థులకు ఉపయోగకరమన్నారు. బయోమెట్రిక్ అన్ని కళాశాలల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలు విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరానికి చేరుకుంటారని అన్నారు. విద్యపై విద్యార్థులు దృష్టి సారించాలని, తరగతులకు రాకపోతే ఏమాత్రం ఫలితం ఉండదన్నారు. సీఎం కేసీఆర్ నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులకు నైపుణ్యం పెంచి ఉద్యోగం, ఉపాధి కల్పించే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరంతరం ప్రయత్నంతోనే విజయం సాధిస్తామన్నారు. ఎంజీ యూనివర్సిటీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. విద్యార్థికి నచ్చిన సబ్జెక్ట్ చదువుకోవడానికి సీబీసీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థులు రెగ్యులర్‌గా రాలేకపోతే దూరవిద్య ఎంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు చదువు పైనే దృష్టి ఉండాలన్నారు. రూరల్ ఎంగేజ్‌మెంట్‌ను రాష్ట్రంలోనే మొదటిసారిగా యూనివర్సిటీలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. పరిశోధన విధానంపై 23, 24, 25 తేదీల్లో 500 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రిజిస్టార్ ఉమేశ్ కుమార్, రమేష్,రవి, లక్ష్మీ ప్రభా, సరిత, వసంత, తదితరులు పాల్గొన్నారు. అక్రమ నియామకాలపై ప్రభుత్వానికి నివేదిక యూనివర్సిటీలో జరిగిన అక్రమ అధ్యాపకుల నియామకంపై ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిపారు. నియామకాలపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు వెల్లడించారు. -
వరంగల్‌కే అధిక ఫలాలు
► కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రెండు పంటలకు నీరు ► మల్కాపూర్ రిజర్వాయర్‌కు మంత్రివర్గం ఆమోదం ► సంగెంలో టెక్స్టైల్ పార్క్ ► త్వరలోనే శంకుస్థాపన చేస్తాం ► కురవి ఆలయం అభివృద్ధికి రూ.5 కోట్లు ► ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సాక్షి, మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫలాలు పూర్వపు వరంగల్ జిల్లాకే ఎక్కువగా చెందనున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. యావత్ ప్రజలు ఎన్నడూ ఊహించని వరంగల్ జిల్లాను చూడబోతున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మొక్కుల్లో భాగంగా రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ వీరభద్రస్వామికి శుక్రవారం బంగారు కోరమీసాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంచ్యాతండాలోని ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇంట్లో భోజనం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నేలా కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో పాత వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తానని తెలిపారు. కాళేశ్వరుడి ఆశీస్సులతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి లోయర్, మిడ్ మానేరు డ్యాంల ద్వారా 40 టీఎంసీల నీటిని రెండు పంటలకు సరిపడా అందిస్తామన్నారు. డోర్నకల్ నియోజకవర్గానికి తాత్కలికంగా పాలేరు నుంచి నీరందిస్తామని హామీ ఇచ్చారు. మల్కాపూర్ రిజర్వాయర్ కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య పట్టుబట్టారని, అది కూడా కేబినెట్లో అప్రూవల్ అయిందన్నారు. దేశంలోనే నంబర్‌వన్ టెక్స్టైల్ పార్క్ వరంగల్ రూరల్ జిల్లాలోని సంగెం మండలంలో టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేసి సూరత్, భీమండికి కూలీ కోసం వెళ్లినవారు అంత తిరిగొచ్చేలా దేశంలోనే పెద్ద టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పరిశ్రమ దేశంలోనే నంబర్‌వన్ టెక్స్టైల్ హబ్‌గా మారబోతుందన్నారు. ఇప్పటికే టెక్స్టైల్ పార్క్‌కు భూసేకరణ పూర్తయిందని తెలిపారు. త్వరలో టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ఇప్పటికే తిరుపూర్, సోలాపూర్‌కు ప్రత్యేక బృందాలు వెళ్లి టెక్స్టైల్ మీద అధ్యయనం చేశాయని గుర్తుచేశారు. కురవి ఆలయం అభివృద్ధికి రూ.5 కోట్లు డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక ఫండ్ నుంచి రూ.28.25 కోట్లు మంజూరు చేస్తానని సీఎం ప్రకటించారు. కురవి వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు, డోర్నకల్, మరిపెడ మండల కేంద్రాలకు రూ.కోటి చొప్పున , మిగతా 4 మండల కేంద్రాలకు రూ.50 లక్షల చొప్పున, 77 గ్రామాలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి, దేవాదాయ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ .శివశంకర్, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాంచంద్రునాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా, ఎంపీలు అజ్మీర సీతారాం నాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, శంకర్ నాయక్, కోరం కనుకయ్య, కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీలు కొండా మురళీధర్‌రావు, బోడకుంటి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, గొర్రెలు, మేకల పెంపకందారుల సంస్థ చైర్మన్ రాజయ్య యాదవ్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, గుడిమళ్ల రవికుమార్, వాసుదేవరెడ్డి, భరత్ కుమార్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. మూడు గంటలపాటు జిల్లాలో సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సుమారు మూడు గంటలపాటు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఉదయం 10.50 గంటలకు కురవికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ఆయన అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో 11.15 గంటలకు కురవి శ్రీవీరభద్రస్వామి దేవాలయానికి చేరుకున్నారు. 11.32 గంటలకు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. 11.50 గంటలకు బస్సులో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇంటికి బయల్దేరి వెళ్లారు. 12.25 గంటలకు రెడ్యానాయక్ ఇంటికి చేరుకొని, భోజనం, ప్రెస్‌మీట్ తర్వాత 1.45 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. -
8న జిల్లాకు సీఎం
అబ్దుల్లాపూర్‌మెట్‌లో హరితహారం ప్రారంభించే అవకాశం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 8న జిల్లాకు రానున్నారు. హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిర్వహించే ‘హరితహారం’లో మొక్కలు నాటనున్నారు. ఆ రోజున నల్లగొండ జిల్లాలో రాష్ట్రస్థాయిలో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఈ నేపథ్యంలో విజయవాడ జాతీయ రహదారికిరువైపులా మొక్కలు నాటడం ద్వారా మన జిల్లాలో కూడా హరితహారంను ప్రారంభించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన అధికారికంగా ఖరారుకాకపోయినా.. జిల్లా యంత్రాంగానికి ఈ మేరకు మౌఖిక ఆదేశాలందాయి. దీంతో హయత్‌నగర్ మండలంలో సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం అధికారులు పరిశీలించనున్నట్లు తెలిసింది. -
వరికోల్‌కు 400 డబుల్ బెడ్రూం ఇళ్లు
హన్మకొండ : జిల్లాపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక ప్రేమ చూపించారు. అదనంగా 400 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశారు. పరకాల మండలం వరికోల్ గ్రామంలో పేదలకు 400 ఇళ్లను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ గ్రామానికి చెందిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఇళ్లు మంజూరు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో పేదలకు డబుల్ బెడ్రూం పథకం విశేష ఆదరణ పొందింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం పేదల నుంచి లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 400 వంతున డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించింది. దశల వారీగా ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వరికోల్ గ్రామాన్ని ప్రత్యేకంగా పరిగణించి ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కేసీఆర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపునకు కారణమైన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా ఈ గ్రామంలో ఉన్న ఓటర్లంతా టీఆర్ఎస్కు మద్దతు తెలపాలని నిర్ణయించారు. పోలింగ్ సందర్భంగా వంద శాతం ఓట్లు టీఆర్ఎస్కే వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ గ్రామానికి 400 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. -
నాడు వైఎస్సార్.. నేడు కేసీఆర్
బాన్సువాడలో బస చేసిన ఇద్దరు సీఎంలు బాన్సువాడ : బాన్సువాడ ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆతిథ్యం వచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాన్సువాడలో రాత్రి బస చేశారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి రాజీవ్ పల్లెబాటలో భాగంగా బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాల్లో పర్యటించారు. రాత్రి బాన్సువాడలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఉదయం అప్పటి బాన్సువాడ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పట్లో వైఎస్సార్ రాక సందర్భంగా బాన్సువాడను ముస్తాబు చేసి, రోడ్లు వేశారు. వీధిలైట్లు బిగించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శుక్రవారం రాత్రి బాన్సువాడకు వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో బస చేశారు. శనివారం తిమ్మాపూర్ వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. సీఎం రాక సందర్భంగా బాన్సువాడను మరోసారి సుందరంగా తీర్చిదిద్దారు. పట్టణ పొలిమేరల్లో ట్రాఫిక్ ఐలాండ్లు ఏర్పాటు చేశారు. మొక్కలు నాటారు. వీధిలైట్లు బిగించారు. రోడ్లను అభివృద్ధి చేశారు. ఆర్అండ్బీ, గ్రామపంచాయతీ గెస్ట్‌హౌస్‌లకు మరమ్మతు చేశారు. ఇలా ముఖ్యమంత్రుల రాకతో అభివృద్ధి జరుగుతోందని బాన్సువాడవాసులు పేర్కొంటున్నారు. -
నేడు జిల్లాకు సీఎం
అధికారికంగా టీఆర్ఎస్లో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ రాజేంద్రనగర్ కాటేదాన్‌లో బహిరంగ సభ వికారాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం జిల్లాకు రానున్నారు. రాజేంద్రనగర్‌లోని కాటేదాన్ దుర్గానగర్ చౌరస్తాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ టీఆర్ఎస్లో అధికారికంగా చేరనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ సోమవారం వికారాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వెల్లడించారు. సభకు 20 వేల మంది హాజరుకానున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అనుచరులు సైతం టీఆర్ఎస్లో చేరుతారన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులంతా టీఆర్ఎస్ వైపు వస్తున్నారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు మాత్రమే స్థానం ఉంటుందన్నారు. టీఆర్ఎస్కు ఇప్పటికీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనడానికి వరంగల్, హైదరాబాద్, నారాయణఖేడ్ ఎన్నికలే సమాధానమన్నారు. నవాబుపేట జడ్పీటీసీ ఎన్నికల్లో 28 వేల ఓట్లకు గాను టీడీపీకి కేవలం 600 ఓట్లు పడ్డాయన్నారు. నేటి సభకు జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. 8న మహిళా ప్రజా ప్రతినిధులకు సన్మానం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న పంజాగుట్టలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లాలోని మహిళా ప్రజా ప్రతినిధులను సన్మానించడం జరుగుతుందన్నారు. -
19న మేడారానికి సీఎం
హన్మకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 19వ తేదీన మేడారం రానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సీఎం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా మేడారం చేరుకుంటారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించిన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరుగుతున్న మేడారం జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో పాటు జాతర విజయవంతానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. -
వెలుగు కావాలి! వేడి కాదు!!
త్రికాలమ్ విద్యుత్తులో న్యాయబద్ధమైన వాటా కావాలంటూ తెలంగాణ రాష్ట్రం కోరుతోంది. విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సద్భావం అవసరం. నీటి విషయంలో సీమాంధ్ర ప్రయోజనాలు తెలంగాణ ప్రభుత్వ సహకారంపైన ఆధారపడి ఉన్నాయి. హుద్‌హుద్ తుపాను తీరం దాటినా, దీపావళి పం డుగ గడిచిపోయినా తెలుగునాట గాలిదుమారం, ధ్వని కాలుష్యం మాత్రం తగ్గలేదు. తెలుగు నేతలు కత్తులు దూసి నిప్పురవ్వలు పుట్టిస్తున్నారు. దాయాదుల మధ్య వాగ్యుద్ధం పతాకస్థాయికి చేరుతోంది. తెలంగాణ రైతుల పాలిట దయ్యంగా దాపురించావంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై తెలంగాణ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. నాయుడు నేరుగా తలబడకుండా అక్షరా యుధాలు సంధించగల నేర్పరి పరకాల ప్రభాకర్‌ను తిరుగుదాడికి పురమాయిం చారు. తోడుగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘు నాథరెడ్డి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంతరెడ్డి తదితరులు ఉండనే ఉన్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు మరోసారి ఎదురుదాడి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ సకల కష్టాలూ, నష్టాలూ మరచిపోయి టీవీ చానళ్ళలో రసవత్తరమైన, ఉత్కంఠభరితమైన నాటకం తిలకించి తరిస్తున్నారు. కరెంటు కోతల గురించి తెలంగాణ ప్రజలూ, రైతుల రుణమాఫీ, తుపాను బాధితులకు సహాయక చర్యల గురించి ఆంధ్రులూ తమ ప్రభుత్వాలను ప్రశ్నించే వాతావరణం లేదు. తాజా కలహకారణం శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమల ఉన్న విద్యుత్ కేంద్రా లలో ఉత్పత్తి కొనసాగించడం. జలాశయంలో నీటిమట్టం కనీస స్థాయికంటే కిందికి పోతే రాయలసీమ ప్రజలకు తాగునీరు కూడా అందని దుస్థితి దాపురిస్తుందనే ఆందోళన వ్యక్తంచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుడివైపు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అదే పనిచేయాలంటూ రకరకాల ఒత్తిళ్ళు తెస్తున్నది. తెలంగాణ సర్కారు ససేమిరా అంటున్నది. విద్యుదుత్పత్తిని ఆపుచేసి రైతుల ప్రాణాలు తీయలేమంటూ హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈ వివా దాన్ని ముఖ్యమంత్రులు ఇద్దరూ చర్చించుకొని పరిష్కరించుకోవాలంటూ కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయెల్ మరోసారి హితవు చెప్పారు. ఈ నెల 29న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరగబోతోంది. అందులోనూ ఖరారు నిర్ణయం జరగకపోవచ్చు. ఒకవేళ బోర్డు ఎడమవైపు కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ నిర్ణయించినా, ఆ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోతే ఏమి చేయాలన్నది ప్రశ్న. రెండు వైపులా బలమైన వాదన లు ఉన్న మాట నిజం. ఎవరి వాదన ఏమిటో పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన: 1) శ్రీశైలం నీటి మట్టం 856 అడుగులకు చేరింది. జలాశయం నుంచి ఇంకా నీరు విడుదల చేసే పక్షంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి సరఫరా ఆగిపో తుంది. రాయలసీమకు తాగునీటి సమస్య ఏర్పడుతుంది. 2) జీవో 69, జీవో 107 లకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నీటిని వాడుకుంటోంది. 3) రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ముందుగా తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. తర్వాత సాగు నీరు. అనంతరమే విద్యదుత్పత్తికి నీటిని వినియోగించాలి. ఈ చట్టాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. 4)నీరు వృథాగా పోయి సాగర్, పులిచింతల జలాశయాలు కూడా నిండి సముద్రం పాలవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏమంటోంది? 1) తెలంగాణలో విద్యుత్తు లేకపోతే నీరు లేదు. భూగర్భజలాలపైన ఆధారపడిన ప్రాంతంలో విద్యుచ్ఛక్తి ద్వారానే నీరు పైకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో భూమ్యాకర్షణ శక్తి వల్ల నీరు పారుతుంది. తెలం గాణలో లిఫ్ట్ ఇరిగేషనే శరణ్యం. 2) కృష్ణా జలాలలో నికర జలాలూ, వరద జలాలూ కలిపి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 60 టీఎంసీల దాకా వినియోగించింది. ఇది బచావత్ ట్రిబ్యూనల్ అవార్డు కేటాయించిన నీటి మొత్తం కంటే ఎక్కువ. 3) జీవో 69ని ఉల్లంఘిస్తున్నామనడం తప్పు. జీవో 107లో ప్రభుత్వం అవసరమని భావిస్తే శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగుల కంటే కిందికి పడిపోయినా కూడా నీరు విడుదల చేయవచ్చు (ఇందులో కూడా తాగునీటికీ తర్వాత సాగునీటికీ ప్రాధాన్యం ఇవ్వాలనీ, తర్వాతే విద్యుదుత్పత్తికి నీటిని వినియోగించాలనీ ఉంది). 4) ఉమ్మడి రాష్ట్రంలో జీవో 107కు భిన్నంగా 854 అడుగులకంటే నీటి మట్టం తగ్గిన తర్వాత కూడా విద్యుదుత్పత్తి చేసిన సందర్భాలు అనేకం. ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు? ఎవరి వాదన వారికి న్యాయసమ్మతంగా కనిపిస్తుంది. ఎవరి సమర్థకులు వారికి ఉన్నారు. ఈ పరిస్థితికి నేపథ్యం ఏమిటి? తుపాను బీభత్సం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విద్యుత్ సంక్షోభం సృష్టిం చింది. అంతవరకూ కాస్త మెరుగ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అకస్మాత్తుగా విద్యుత్ కొరత ఏర్పడితే అసలే కటకటగా ఉన్న తెలంగాణ గింగిరాలు తిరిగింది. తుపాను తాకిడికి గాజువాక-జేపోర్ లైను కుదేలు కావడంతో రెండు రాష్ట్రాలూ దారుణంగా నష్టపోయాయి. విద్యుచ్ఛక్తి రంగంలో దేశాన్ని ఐదు విభాగాలు చేశారు. నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, సదరన్ రీజియన్స్గా విభజించారు. న్యూగ్రిడ్లో దక్షిణాది (సౌత్) మినహా తక్కిన నాలుగు ప్రాంతాలూ అనుసంధానమై ఉన్నాయి. దక్షిణాదితో న్యూగ్రిడ్ అనుసంధానం సంపూర్ణం కాలేదు. ఉత్తరాదిలో మిగులు విద్యుత్తును దక్షిణాదికి రవాణా చేసేందుకు ప్రస్తుతం గాజువాక-జేపోర్, చంద్రాపూర్- రామ గుండం, తాల్చేర్-కోలార్, రాయచూర్-షోలాపూర్ లైన్స్ ఉన్నాయి. ఈ లైన్ల ద్వారా మొత్తం 4,500 మెగావాట్ల విద్యుత్ రవాణా అవుతోంది. ఇప్పుడు నిర్మాణం లో ఉన్న మరి నాలుగు లైన్లు పూర్తయితే ఇంకా 10 నుంచి 12 వేల మెగావాట్ల విద్యు త్తు రవాణా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉత్తరాదిలో మిగులు ఉన్న విద్యుత్తు వివిధ దక్షిణాది రాష్ట్రాలకు రవాణా అవుతోంది. ఈ ఏర్పాట్లు ఇదివరకే జరిగిపోయాయి. కొత్తగా విద్యుత్తు లభించే అవకాశం లేదు. తుపాను వచ్చే వరకూ తెలంగాణ రాష్ట్రం ఉత్తరాది నుంచి నిత్యం 10 నుంచి 15 మిలియన్ (ఒక మిలియన్ అంటే పది లక్ష లు) యూనిట్ల విద్యుత్తును ఈస్టర్న్ గ్రిడ్ ద్వారా పవర్ ఎక్స్చేంజి నుంచి కొనుగోలు చేసేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అదే మార్గంలో ఐదు మిలియన్ యూనిట్లు కొనుక్కునేది. గాజువాక-జేపోర్ లైను కుప్పకూలడంతో ఈ రవాణా ఆకస్మికంగా ఆగిపోయింది. తుపాను రావడానికి పూర్వం ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సరఫరా కాస్త నయం. కరెంటు కోత లేకుండా 24 గంటలూ సరఫరా చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే పరిస్థితి. కానీ తెలంగాణలో అప్పటికే దాదాపు 30 మిలియన్ యూనిట్ల కొరత పీడిస్తోంది. మూడేళ్ళ వరకూ కోతలు ఉంటాయనీ, ఆ తర్వాత కనురెప్పపాటు కూడా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉండబోదనీ తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇవ్వవలసిన పరిస్థితి. ఈస్టర్న్ గ్రిడ్ నుంచి సరఫరా నిలిచిపోవడానికి తోడు సింహాద్రిలో 2,000 మెగావాట్ల ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) విద్యుత్ కేంద్రం తుపాను కారణంగా మూతపడింది. ఈ కేంద్రం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు 53.89: 46.11 నిష్పత్తిలో విద్యుత్తు వాటా రావాలి. ఈ వాటా అందక పోవడంతో తెలంగాణలో విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రతరమైతే ఆంధ్రప్రదేశ్‌లో సైతం విద్యుత్తు సరఫరా కష్టతరమై కోత విధించక తప్పనిస్థితి ఏర్పడింది. ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్ని చిన్న చిన్న ప్రైవేటు విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించేవి. అవి కూడా తుపాను దెబ్బకు మూలనపడ్డాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడగా తెలంగాణలో అది 40 మిలియన్ యూనిట్లు దాటింది.. ఈ నేపథ్యంలో శ్రీశైలం కుడిఎడమల విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి చేయవలసిన అవసరం రెండు రాష్ట్రాలకూ ఏర్పడింది. కుడివైపు (ఏపీ) జలవిద్యుత్ ప్రాజెక్టు సామర్థ్యం 770 మెగావాట్లు అయితే ఎడమగట్టు (తెలంగాణ) విద్యుత్ కేంద్ర సామర్థ్యం 900 మెగావాట్లు (ఇందులో 800 మెగావాట్ల మేరకు ఉత్పత్తి జరుగుతోంది). తుపాను తీరం దాటి వెళ్ళిపోగానే రెండు రాష్ట్రాలూ శ్రీశైలం ప్రాజె క్టుల నుంచి ఉత్పత్తి ప్రారంభించాయి. నీటి మట్టం తగ్గిపోతుండటంతో ఆందోళన చెందిన పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చి కుడి ప్రాజెక్టు ఉత్పత్తి ఆపు చేయించారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం తగ్గిపోతే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీరు సరఫరా కాజాలదనీ, రాయలసీమ ప్రజలకు తాగునీరు కూడా అందని దుస్థితి దాపురిస్తుందనీ భయం. కుడివైపు ప్రాజెక్టు ఉత్పత్తి నిలుపు చేసినప్పటికీ ఎడమవైపు విద్యుత్ కేంద్రం నుంచి 15 నుంచి 18 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతూనే ఉంది. అప్పటికీ తెలంగాణలో కొరత 20 నుంచి 30 మిలియన్ యూనిట్లు ఉంది. ఈ దశలో ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావుకు ఫోన్ చేసి శ్రీశైలం ఎడమ జలవిద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి నిలిపి వేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుదుత్పత్తిని కొనసాగించి నీటి వాడకం ఆపకపోతే రాయలసీమకు తాగునీటి కొరత, సాగునీటి కొరత ఏర్పడతాయని వివరించారు. ఉమామహేశ్వరరావు విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం మన్నించలేదు. రైతులనూ, పంటలనూ కాపాడుకోవడం కోసం విద్యుదుత్పత్తి కొనసాగించక తప్పదనీ, ఆపేది లేదనీ కుండబద్దలు కొట్టింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. 1969లో జారీ చేసిన 69వ నంబరు జీవోనూ, 2006లో వచ్చిన 107 నంబరు జీవోనూ తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిం చిందంటూ ఆరోపించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఏమిటంటే, బచావత్ అవార్డును గౌరవించాలంటూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కూడా ఆదేశించిందనీ, బచావత్ ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాలలో తెలుగుగంగ ద్వారా చెన్నై పట్టణానికి 15 టీఎంసీల (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల వాటాలలో తలా ఐదు టీఎంసీలు) నీరు వాడుకోవచ్చుననీ, ఇది కాకుండా శ్రీశైలం కుడి కాలువ ద్వారా 19 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చుననీ, నికర జలాలూ, వరద జలాలూ కలిపి దాదాపు 60 టీ ఎంసీల దాకా ఇంతవరకూ వినియోగించుకున్నారనీ వాదించి ఆంధ్ర ప్రదేశ్ తనకు కృష్ణా ట్రిబ్యూనల్ కేటాయించిన నీటి కంటే ఎక్కువే వినియోగించు కున్నదని తేల్చింది. జలవిద్యుదుత్పత్తిని నిలుపు చేయాలనే నిబంధన 69వ జీవోలో ఎక్కడా లేదనీ, నిజానికి పక్షానికి కనీసం ఆరు టీఎంసీల నీరు వంతున విద్యుదు త్పత్తి కోసం విడుదల చేయాలంటూ ఆ జీవోలో ఉన్నదని తెలంగాణ సర్కారు వాదన. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 834 అడుగుల కంటే తగ్గకుండా చూడా లనే అంశం కూడా ఇదే జీవోలో ఉంది. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న కాలంలో (2006లో) విడుదలైన 107వ నంబరు జీవోలో మాత్రం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలని నిర్దేశించారు. అయితే నీటి మట్టం కనీసస్థాయి కంటే తగ్గినా సరే నీటిని వినియోగించడం అత్యవసరమని ప్రభుత్వాలు భావించిన పక్షంలో ఆ విధంగా విచక్షణాధికారాలు ఉపయోగించి నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఆ జీవోలో కల్పించారు. శ్రీశైలం ఎడమగట్టున విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికోసం వినియోగించే నీరు అనంతరం నాగార్జునసాగర్‌కూ, ఆ తర్వాత పులి చింతలకూ, అక్కడి నుంచి కృష్ణా బరాజ్‌కు వెళ్ళి నిల్వ ఉంటాయి కానీ వృథాగా సముద్రంలో కలిసిపోతాయనడం వాస్తవం కాదని కూడా తెలంగాణ ప్రభుత్వం అంటోంది. పైగా 2006లో 107వ జీవో విడుదలైన దరిమిలా ప్రతి సంవత్సరం శ్రీశైలం నీటిమట్టం 854 అడుగుల కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా జలవిద్యుదు త్పత్తి జరిగింది. ఈ యేడాది మార్చిలో సైతం కనీస నీటిమట్టం కంటే తక్కువ స్థాయిలో ఉన్న దశలో శ్రీశైలం ప్రాజెక్టుకు కుడిఎడమల కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగిందని గుర్తుచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ వాదనలో తెగింపు ధోరణి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలో కొన్ని అసంబద్ధతలూ, ద్వంద్వప్రమాణాలూ ఉన్నాయి. ఒకటి, వైఎస్ హయాంలో రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షించేందుకు 107 జీవోను విడుదల చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చింది. ‘గుట్టుగా పెరిగిన నీటి మట్టం’ అంటూ నాటి పత్రికలు పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించాయి. టీడీపీ జీవో 107 పైన దృశ్యరూపకం రూపొందించి మేలు చేయాల్సిన రాజే కీడు చేస్తున్నాడంటూ, సాగర్, డెల్టా రైతులు ఆందోళన చెందు తున్నారంటూ, డెల్టా అంతా ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదంటూ విమర్శించింది. ఇందుకు సంబంధించిన వార్తాకథనాలు పత్రికలలో, టీవీ చానళ్ళలో వచ్చాయి. ఇప్పుడు అదే జీవోను ఉల్లంఘిస్తున్నదంటూ తెలంగాణ ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. రెండు, ఒకవైపు నీటి విడుదలకు సంబంధించి జీవో 69ని తెలంగాణ ప్రభుత్వం తుచ తప్పకుండా పాటించాలని పట్టుబడుతున్న చంద్ర బాబునాయుడు విద్యుత్ పంపకాలకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన జీవో 53కు చట్టబద్ధత లేదని వాదిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర అవస రాల దృష్ట్యా గతంలో జారీ చేసిన జీవోలు చెల్లవన్నది ఆయన వాదన. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి, విద్యుత్తులో వాటాకు సంబంధించిన పాత జీవోలు చెల్లవంటే జీవో 69, జీవో 107 కూడా చెల్లవు మరి. మూడు, శ్రీశైలం నీటి విడుద లను నిలుపు చేయడానికి కృష్ణా బోర్డు జోక్యం చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చిన చంద్రబాబునాయుడు సీలేరు విద్యుత్ విషయంలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులనూ, పవర్ పర్చేజి అగ్రిమెంట్ల (పీపీఏల) విషయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుచ్ఛక్తి నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ), సదరన్ రీజినల్ లోడ్ డిశ్పాచ్ సెంటర్ (బెంగళూరు) జారీ చేసిన ఆదేశాలనూ బేఖాతరు చేశారు. చట్టబద్ధత కలిగిన సంస్థల ఆదేశాలను స్వయంగా ఉల్లంఘిస్తూ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను మాత్రం తెలంగాణ ప్రభుత్వం శిరసావహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలో పస కనిపించదు. విద్యుత్తులో న్యాయబద్ధమైన వాటా కావాలంటూ తెలంగాణ రాష్ట్రం కోరుతోం ది. విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సద్భావం అవసరం. నీటి విషయంలో సీమాంధ్ర ప్రయోజనాలు తెలం గాణ ప్రభుత్వ సహకారంపైన ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే రాయలసీమకూ, దక్షిణ తెలంగాణకూ మధ్య శ్రీశైలం ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కారణంగా ద్వేషభావం నెలకొని ఉన్నది. నదీజలాలకూ, విద్యుత్‌కూ మధ్య అవినాభావ సంబం ధం ఉంది. తెలంగాణకూ, ఆంధ్రప్రదేశ్‌కూ మధ్య విడదీయలేని బంధాలు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు. ఒకరికి ఒకరు అతుక్కుపోయి పుట్టిన కవల పిల్లలు (సియామీజ్) ఎంత గింజుకున్నా ఎవరిదారిన వారు వెళ్ళలేరు. కలసి కదలాల్సిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కూడా నీరు, విద్యుత్తు అదే విధంగా కట్టిపడ వేశాయి. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకున్నా చేసుకోనట్టు నటించి అసలైన సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ఈ సమస్యను విని యోగించుకోవాలనుకుంటే అది వారి ఇష్టం. ఇదే విధంగా కలహించుకుంటూ ఉంటే అందరం నవ్వులపాలవుతాం. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం ప్రకటిం చినా, న్యాయస్థానం తీర్పు ఇచ్చినా దాన్ని అమలుచేయడానికి సీఆర్పీఎఫ్ బల గాలనో, సైన్యాన్నో నియమించవలసిన పరిస్థితులు ఏర్పడితే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య శాశ్వత శత్రుత్వం ప్రబలుతుంది. తెలుగుజాతికి తీరని అపకారం జరుగు తుంది. అది ఇద్దరు చంద్రులకీ చెరగని మచ్చ తెస్తుంది. కె. రామచంద్రమూర్తి -
వరాల వాన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఇందూరుకు వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాపై వరాల వాన కురిపించారు. నాలుగేళ్లలో అన్ని పనులు సాధించి తీరుతామని ప్రజలకు భరోసా ఇచ్చారు. నగరంలో నిమ్స్ తరహాలో మెగా ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని, తెలంగాణలోనే దీనిని తొలి పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుంటామని చెప్పారు. జక్రాన్‌పల్లిలో విమానాశ్రయ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆర్మూరులో కీలక అంశంగా ఉన్న ఎర్రజొన్నల బకాయిలు రూ.10.83 కోట్లు వారం రోజులలో చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సాగు నీరు, వైద్యం, పర్యాటక, కనీస సౌకర్యాల కల్పనపై స్పష్టమైన హామీ ఇచ్చారు. జిల్లాలోని రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్కు కట్టబెట్టిన ప్రజల కోసం ఏమై నా చేస్తానన్నారు. గురువారం ఆయన ఆర్మూర్, అంకాపూర్, నిజామాబాద్‌లో పర్యటించారు. ఆరేళ్ల ‘ఎర్రజొన్నల’కు మోక్షం ఆరేళ్లుగా నలుగుతున్న ఎర్రజొన్నల వివాదానికి కేసీఆర్ ఎట్టకేలకు తెరదించారు. వారం రోజులలో ఎర్రజొన్నల బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఈ మేరకు ఉత్తర్వులు కూడ జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రైతుల ఇళ్లకే వెళ్లి బకాయిలు చెల్లించాలని సూచించారు. దీంతో ఆరేళ్ల క్రితం పోలీసు కాల్పులకు దారితీసిన ఎర్రజొన్నల బకాయిలకు మోక్షం కలిగినట్లయ్యింది. ఆర్మూరులో రూ.114.11 కోట్లతో శంకుస్థాపన చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని ఏడాదిలో పూర్తి చేసి తానే ప్రారంభిస్తానన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు జిల్లాలోని ఆటోలు, ట్రాక్టర్లు, ట్రాక్టర్ ట్రాలీల కు రవాణా పన్ను రద్దు చేస్తామన్నారు. వచ్చే దసరా, దీపావళి పండగల మధ్యలో వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున ఫించను అందజేస్తామన్నారు. గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి గుట్టు రట్టయ్యాక, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.3.50 లక్షలు వెచ్చించి రెండు పడక గదుల పక్కా ఇళ్లను నిర్మిస్తామని, మొదట ఆర్మూరు, అంకాపూర్‌లో మోడల్ కాలనీలను రూపొందిస్తామని సీఎం స్పష్టం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఈ పంద్రాగస్టు నుంచే పంపిణీ చేస్తామన్నారు. కళ్యాణలక్ష్మి పథకం కింద పెళ్లి చేసుకునే ప్రతి గిరిజన, దళిత యువతికి ప్రభుత్వం రూ.50 వేలు అందజేస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక కార్యాచరణ నిజాంసాగర్, గుత్ప, అలీసాగర్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించిన సీఎం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిం చనున్నట్లు ప్రకటించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు ప్రాంతాలైన ఆర్మూర్, వేల్పూర్, జక్రాన్‌పల్లి మండలాలకు సాగునీరు అం దిస్తామన్నారు. అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచి బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లి, ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ మండలంలోని 18 గ్రామాలకు సాగునీరందే ఏర్పాటు చేస్తామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులపైనా దృష్టి సారిం చనున్నామన్నారు. ప్రధానంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయరంగాన్ని పటిష్టం చేయనున్నామన్నారు. నగరంపైనా దృష్టి జిల్లా కేంద్రంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ), బైపాస్ రహదారి అసంపూర్తిగా ఉండటం నగర ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఆ రెండు ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేసేలా మార్గ నిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమాలలో కేసీ ఆర్ వెంట రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, షకీల్ అహ్మద్, బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు పాతూరి సుధా కర్‌రెడ్డి, డి.రాజేశ్వర్, సీఎంఓ కార్యదర్శి స్మితసబర్వాల్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత ఉన్నారు. -
రాజకీయ సుస్థిరతకే ప్రాధాన్యం
* రెండు సభల్లో టీఆర్ఎస్ బలోపేతం * పాలనలో ముద్రకు యత్నాలు * కేసీఆర్ సర్కారు 30రోజులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా నెల రోజులు. జూన్ 2న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్.. ఈ నెల రోజుల వ్యవధిలో రాజకీయ సుస్థిరతకే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఎన్నికల్లో టీఆర్ఎస్కు పాస్ మార్కులు(63 అసెంబ్లీ సీట్లు) రావడంతో భవిష్యత్తులో విపక్షాల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు పక్కా రాజకీయ వ్యూహంతో ఆయన ముందుకెళుతున్నారు. బీఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుని సంఖ్యాబలాన్ని పెంచుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరిని తనవైపు తిప్పుకొనేందుకు రహస్య మంతనాలు జరిపారు. అదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన 10 మంది ఎమ్మెల్సీలకూ గులాబీ కండువా కప్పారు. దీంతో శాసనమండలిలోనూ మెజారిటీ సాధించారు. మండలాధ్యక్షులు, మున్సిపల్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో మెజారిటీ పీఠాలను దక్కించుకుని స్థానికంగా సత్తాను చాటుకునే పనిలో పడ్డారు. ఈ ఏడాది ఆఖరులో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను రెపరెపలాడించి టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా మార్చాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే మజ్లిస్‌ను దోస్తీ చేసుకోవడంలోనూ విజయం సాధించారు. పార్టీ నేతల్లో అసంతృప్తి తలెత్తకుండా ఉండేందుకు శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్ వంటి కీలక పదవులతో పాటు నామినేటెడ్ పదవులను కూడా ముఖ్యమంత్రి సద్వినియోగం చేసుకుంటున్నారు. పాలనలో కొత్త కొత్తగా.. రాష్ర్ట విభజన ప్రక్రియ పూర్తి కాకపోవడం, ఉన్నతాధికారుల కొరత, పదవీ బాధ్యతలు స్వీకరించడానికి సమయం పట్టడం, ఉద్యోగుల పంపిణీలో అస్పష్టత వంటి పలు కారణాలు పాలనలో వేగానికి ప్రతిబంధకాలయ్యాయి. పాలనా పగ్గాలు పట్టిన తొలి రోజుల్లోనే... గత ఏడాది పంట రుణాలనే మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం చేసిన అనాలోచిత ప్రకటన కొంత ఇబ్బందికరంగా మారింది. దీన్ని అధిగమించేందుకు కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. లక్షలోపు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని అసెంబ్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసే పెన్షన్ల పెంపు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాల అమలుపై నేటికీ స్పష్టత ఇవ్వలేకపోయారు. తెలంగాణలో పుట్టిన బిడ్డలకే ఫీజుల చెల్లింపు వర్తింపజేస్తామని ప్రకటించినప్పటికీ.. దానికి సరైన ప్రాతిపదికను నిర్ణయించలేక పోయారు. తెలంగాణలో 4 నుంచి 10 వరకు విద్యనభ్యసించిన వారంతా స్థానికులేనని ఒకసారి, ముల్కీ నిబంధనలని మరోసారి, 1956కు పూర్వం తెలంగాణలో స్థిరపడిన కుటుంబాలకే ఫీజుల పథకమని ఇంకోసారి.. ఇలా పలు ప్రతిపాదనలను సర్కారు పెద్దలు తెరపైకి తెచ్చారు. పాలనలో తెలంగాణ ముద్ర కనిపించే దిశగా ఈ ఆలోచన కొంత విజయవంతమైందని వారు భావిస్తున్నారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేత, పెన్షన్లలో అనర్హుల తొలగింపు వంటి చర్యలు పూర్తి చేశాకే.. పెన్షన్ల పెంపు వంటి నిర్ణయాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ రెండు పడక గదులతో ఇళ్ల నిర్మాణం, వాహనాలకు కొత్త నంబర్ల కేటాయింపు వంటి విషయాల్లోనూ అస్పష్టత కొనసాగుతుండటం గమనార్హం. ఇక పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్సు రద్దు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి కీలకాంశాలపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినప్పటికీ.. ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు కాక వాయిదా వేస్తూ వస్తున్నారు. పీపీఏల రద్దు విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేదన్న భావన కొంత వ్యక్తమైంది. ఒక్క హామీనైనా నెరవేర్చారా?: పొన్నాల సాక్షి, హైదరాబాద్: నెల రోజుల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పెదవి విరిచారు. ప్రభుత్వానికి నెలరోజుల సమయం తక్కువే అయినప్పటికీ టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేక పోయిందని విమర్శించారు. కీలకమైన రుణమాఫీ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీలపైనా స్పష్టత ఇవ్వలేకపోయారని అన్నారు. నెల రోజుల పాలనలో కేసీఆర్ ప్రజా సమస్యలను పక్కనపెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికే పరిమితమయ్యారని విమర్శించారు. బీజేపీ గెలిస్తే మంచిరోజులు వస్తాయని ప్రచారం చేసిన మోడీ నెల రోజుల్లో రైల్వే, పెట్రోలు ఛార్జీలు పెంచడం మినహా సాధించిందేమీ లేదన్నారు. ఆయన పాలన చూస్తుంటే మోడీతో ధరల దాడే అనే భావన కలుగుతోందన్నారు. -
లోక్‌సభ పోరులోనూ గులాబీ హోరు
సాక్షి, సంగారెడ్డి: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందిభి మోగించింది. మెదక్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. మెదక్ నుంచి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 3,97,029 ఓట్ల మెజారిటీతో గెలుపొంది కొత్త చరిత్ర సృష్టించారు. కేసీఆర్ 6,57,492 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పి. శ్రవణ్ కుమార్ రెడ్డికి 2,60,463 ఓట్లు, టీడీపీ బలపర్చిన బీజేపీ అభ్యర్థి చాగండ్ల నరేంద్రనాథ్‌కు 1,81,804 ఓట్లు పోలయ్యాయి. 1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీని మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లు 2.19 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు కాగా.. తాజాగా కేసీఆర్ ఇంతకు మించి భారీ మెజారిటీ సాధించి ఇందిరా పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 11,93,548 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా .. కేసీఆర్‌కు 55.08 శాతం ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ రెడ్డికి 21.82, బీజేపీ అభ్యర్థి నరేంద్రనాథ్‌కు 15.23 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉండగా.. మెదక్ లోక్‌సభ స్థానానికి రాబోయే ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన మెదక్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయాల్సి రానుంది. జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 1,44,631 ఓట్ల మెజారిటీతో సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌పై గెలుపొందారు. బీబీ పాటిల్‌కు 5,08,661 ఓట్లు పోలు కాగా సురేష్ షెట్కార్ 3,64,030 ఓట్లు, బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు 1,57,497 ఓట్లు సాధించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో సిద్దిపేట లోక్‌సభ స్థానం రద్దు అయి జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఆవిర్భవించిన విషయం తెలిసిందే. మొత్తం 10,97,242 ఓట్లు పోలుగా టీఆర్ఎస్కు 46.35 శాతం, కాంగ్రెస్‌కు 33.13 శాతం, టీడీపీకి 14.35 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన సురేష్ షెట్కార్ నాటి టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్‌పై 17,407 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 1.44 లక్షల ఓట్ల మెజారిటీ సాధించి కొత్త రికార్డును సృష్టించారు. -
కేసీఆర్ ఘన విజయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉద్యమాల పురిటిగడ్డ మెతుకుసీమలో టీఆర్ఎస్ ధూం..ధాం చేసింది. తెలంగాణ తెచ్చిన ఉద్యమ పార్టీకే జిల్లా ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉద్ధండులు దామోదర రాజనర్సింహ, సునీతారెడ్డి, జగ్గారెడ్డి, విజయశాంతి తదితరులు ఓటమిపాలయ్యారు. జిల్లా ముద్దుబిడ్డ, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)ను తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం దాదాపు లాంఛనమే. జిల్లాలోని మొత్తం పది అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది స్థానాలను, రెండు పార్లమెంటు సీట్లనూ గెలుచుకుని టీఆర్ఎస్ సత్తా చాటింది. ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత కనబరిచారు. గజ్వేల్, సిద్దిపేట, మెదక్, పటాన్చెరు, సంగారెడ్డి, దుబ్బాక, నర్సాపూర్, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. నారాయణఖేడ్, జహీరాబాద్‌లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకుంది. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలహీనంగా ఉన్నట్టు కనిపించినా.. సార్వత్రిక ఎన్నికల్లో ‘యువతరం’ అండగా నిలబడి ఏకపక్షంగా ఓట్లు వేయడంతో ఆ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. శనివారం జరగబోయే టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సభాపక్ష నాయకునిగా కేసీఆర్ పేరు ప్రతిపాదించనున్నారు. హరీష్‌రావు భారీ మెజార్టీతో గెలుపు సిద్దిపేట నియోజకవర్గం నుంచి హరీష్‌రావు భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. సిద్దిపేటలో సుమారు 1.50 లక్షల ఓట్లు పోల్ కాగా హరీష్‌రావుకు 1.18 లక్షల ఓట్లు వచ్చాయి. మొత్తం 93,928 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మిగిలిన పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. నిజానికి గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్‌కు 95,858 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే గతంలో పాలిస్తే పోలింగ్ శాతం ఈ ఎన్నికల్లో తగ్గడంతో ఆయనకు కొద్దిగా ఆధిక్యం తగ్గింది. ఇక కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నుంచి 19,218 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గజ్వేల్ నియోజకవర్గంలో 1.99 లక్షల ఓట్లు పోల్ కాగా కేసీఆర్‌కు 86,372 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డికి 67,154 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సారెడ్డి 33,998 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మెదక్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయశాంతిని 39, 234 ఓట్ల మెజార్టీతో ఓడించారు. దుబ్బాక నియోజకవర్గంలో సోలిపేట రామలింగారెడ్డి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై 37,899 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హోరాహోరీ పోరులో.... అందోల్ నియోజకవర్గంలో మొదటి నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆధిక్యత కనబరిచినప్పటికీ చివరి రౌండ్లలో చేతులెత్తేశారు. 10వ రౌండ్ వరకు రాజనర్సింహ దాదాపు 1,700 ఓట్ల మెజార్టీ ఉన్నారు. ఆ తర్వాత రౌండ్లలో కూడా ఆయన మెజార్టీని కనబరిచారు. చివరి ఐదు రౌండ్ల నుంచి బాబూమోహన్ అనూహ్యంగా దూసుకురావడంతో దామోదరకు ఓటమి తప్పలేదు. మాజీ మంత్రి గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు స్వల్ప ఆధిక్యంతో గెలిచి ఊపిరి పీల్చుకున్నారు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో చివరికి గీతారెడ్డి 814 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుపై గెలుపొందారు. అభ్యర్థుల ఓట్ల వివరాలు గజ్వేల్‌లో కేసీఆర్: గజ్వేల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయం సాధించారు. 19,218 ఓట్ల మెజార్టీతో సమీప టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిపై గెలుపొందారు. గజ్వేల్‌లో నియోజకవర్గం ఎమ్మెల్యే బరిలో పది మంది పోటీ చేయగా ఏడుగురి డిపాజిట్లు గల్లంతయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కె.చంద్రశేఖర్‌రావుకు 86,372 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డికి 67,154, కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డికి 33,998 ఓట్లు సాధించారు. గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపొందటం ఇదే ప్రథమం. సిద్దిపేటలో హరీష్ ఐదోమారు విజయం: సిద్దిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థి తన్నీరు హరీష్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. 93,928 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి తాడురు శ్రీనివాస్‌గౌడ్‌పై గెలుపొందారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆయన ఐదో మారు గెలిచారు. ఇక్కడ బరిలో ఉన్న పది మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎమ్మెల్యే బరిలో 11 మంది ఉండగా హరీష్‌రావుకు 1,08,699 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి తాడూరు శ్రీనివాస్‌గౌడ్‌కు 15,371, బీజేపీ అభ్యర్థి చొప్పదండి విద్యాసాగర్‌కు 13,003 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి బత్తుల చంద్రంకు 3,774, లోక్‌సత్తా అభ్యర్థి శ్రీనివాస్‌కు 627, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి కమలాకర్‌కు 1,140 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డిలో చింతాదే గెలుపు: సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ 29,814 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ఇక్కడ ఓటమి చవిచూశారు. జగ్గారెడ్డికి 53,046 ఓట్లు రాగా బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కె. సత్యనారాయణకు 11,091 ఓట్లు, సీపీఎం అభ్యర్థి బి.మల్లేశానికి 2,681 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో మొత్తం 13 మంది అభర్థులు పోటీ చేయగా పది మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. దుబ్బాకలో రామలింగారెడ్డి ఘన విజయం: దుబ్బాక నియోజవకర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఘన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డిపై ఆయన 37,899 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు సొంతం చేసుకున్నారు. నియోజవకర్గంలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా రామలింగారెడ్డికి 82,123 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి చెరుకు ముత్యంరెడ్డికి 44,224, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 15,118 ఓట్లు సాధించారు. తొమ్మిది మంది అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. పటాన్చెరులో గూడెం గెలుపు: పటాన్చెరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి గెలుపొందారు. మహిపాల్‌రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి ఎం. సపాన్‌దేవ్‌పై 19,007 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సపాన్‌దేవ్‌కు 55,100 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యరి టి. నందీశ్వర్‌గౌడ్‌కు 37,205తో మూడో స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలో మొత్తం 17 మంది బరిలో నిలవగా 14 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. అందోలులో బాబూమోహన్ విక్టరీ: అందోలు నియోజవకర్గంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మాజీ డిప్యూటీ సీఎం సి. దామోదరను టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పి. బాబూమోహన్ ఓడించారు. దామోదర, బాబూమోహన్ మధ్య విజయం నీదా నాదా అన్నట్టు దోబూచులాడింది. చివరకు బాబూమోహన్ 3,208 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బాబూమోహన్‌కు మొత్తం 86,759 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి దామోదరకు 83,551 ఓట్లు వచ్చాయి. బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎల్లయ్యకు 3,059 ఓట్లు పొందారు. నర్సాపూర్‌లో టీఆర్ఎస్ పాగా: కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి నర్సాపూర్ నియోజకవర్గంలో మొదటిసారిగా టీఆర్ఎస్ పాగా వేసింది. మాజీ మంత్రి సునీతారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి విజయం సాధించారు. చిలుముల మదన్‌రెడ్డి 14,217 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మదన్‌రెడ్డికి మొత్తం 85,890 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డికి 71,673, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బల్వీందర్నాథ్కు 6,075 ఓట్లు వచ్చాయి. మెదక్‌లో వికసించిన ‘పద్మ’: మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయశాంతిని ఓడించారు. పద్మా దేవేందర్‌రెడ్డి 39,234 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించింది. పద్మా దేవేందర్‌రెడ్డికి 89,119 ఓట్లు రాగా విజయశాంతికి 49,885 ఓట్లు వచ్చాయి. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బట్టి జగపతికి 9,266 ఓట్లు వచ్చాయి. ఖేడ్‌లో మళ్లీ కిష్టారెడ్డే: నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల కిష్టారెడ్డి రెండోమారు విజయం సాధించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్‌రెడ్డిపై ఆయన 14,782 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కిష్టారెడ్డికి మొత్తం 62,007 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎం. భూపాల్‌రెడ్డికి 47,225, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయపాల్‌రెడ్డికి 40,307 ఓట్లు వచ్చాయి. స్వల్ప మెజార్టీతో గీతమ్మ విజయం: మాజీ మంత్రి జెట్టి గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండోమారు గెలుపును సొంతం చేసుకున్నారు. చివరివరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుపై గీతారెడ్డి 842 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గీతారెడ్డికి 57,558 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావుకు 56,716, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వై. నరోత్తంకు 39,057 ఓట్లు వచ్చాయి. -
గులాబీ దళమిదే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 69 మంది పేర్లు ప్రకటించగా వాటిలో జిల్లాలో ఆరు పేర్లు ఖరారు చేశారు. శుక్రవారం పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో జాబితా విడుదల చేశారు. అయితే గురువారం రాత్రి ‘సాక్షి’కి అందిన అభ్యర్థుల జాబితాలోంచి దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి పేరు గల్లంతయింది. ‘సాక్షి’కి అందిన పక్కా సమాచారంతో ఏడు నియోజకవర్గాల్లో ఏడు మంది అభ్యర్థుల పేర్లను శుక్రవారం సంచికలో ‘గులాబీ దళం ఖరారు’ శీర్షికన ప్రచురించింది. ముందు చెప్పినట్టుగానే గజ్వేల్ నుంచి కేసీఆర్, సిద్దిపేటకు తన్నీరు హరీశ్వర్‌రావు, ఆందోల్ నుంచి బాబూమోహన్, సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్, పటాన్‌చెరుకు మహిపాల్‌రెడ్డి, మెదక్ అసెంబ్లీ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి పేర్లనే టీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. ఇద్దరిని కూర్చోబెట్టిన తర్వాతే.... తుదిరూపు దిద్దుకున్న తొలి జాబితాలో సోలిపేట రామలింగారెడ్డి పేరు ఖరారైంది. అధికారికంగా విడుదలైన జాబితాలో ఆయన పేరు లేకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఠమొదటిపేజీ తరువాయి పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితోపాటు, కొత్త ప్రభాకర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. సోలిపేట ఉద్యమంలో ముందు నడిచి, జైలు పాలయ్యారు. ఉద్యమం నడపటానికి అవసరమైన సమయంలో కొత్త ప్రభాకరరెడ్డి ఆర్థికంగా సహకరించారు. దాదాపు సోలిపేటకు టికెట్ ఖరారు అయినట్టేనని గులాబీ బాస్ సంకేతాలు పంపారు. అయితే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డిని పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాతే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. రెండో జాబితాలోనైనా సోలిపేట పేరునే ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సంగారెడ్డి: చింతా ప్రభాకర్ స్వస్థలం సదాశివపేట 1988లో టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలైంది. పీఎస్ఎంఎల్ పరిశ్రమలో ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా పనిచేశారు. 1995లో టీడీపీ నుంచి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ బీ ఫారం ఇచ్చి మహాకూటమి పొత్తుతో మళ్లీ వెనక్కి తీసుకుంది. టీడీపీ రెబల్‌గా పోటీ చేశారు. జగ్గారెడ్డి చేతిలో 6,772 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేశారు. చింతా ప్రభాకర్‌కు 34,329 ఒట్లు పడగా... జగ్గారెడ్డికి 41,101 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డి మండలం ఆయన్ను బాగా దెబ్బతీసింది. గజ్వేల్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) స్వగ్రామం సిద్దిపేట మండలం చింతమడక గ్రామం 1983కి ముందు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి సిద్దిపేట నుంచి తొలిసారిగా పోటీ చేసి కాంగ్రెస్ నేత అనంతుల మదన్మెహన్పై ఓటమిపాలయ్యారు. 1985 నుంచి 1999 వరకు అసెంబ్లీ నుంచి వరుసగా గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో శాసనసభా డిప్యూటీ స్పీకర్‌గా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2001 ఏప్రీల్ 27న ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి)ని స్థాపించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. 2004 ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందారు. ఆ తర్వాత సిద్దిపేట ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. ఆరు నెలల పోర్ట్‌పోలియో లేని మంత్రిగా కొనసాగి, ఆ తర్వాత కేంద్ర కార్మిక మంత్రిగా ఏడాదిన్నర కాలం పనిచేశారు. 2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మరోసారి కరీంనగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. 2008లో కరీంనగర్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్ధానం పోటీ చేసి విజయం సాధించారు. మెదక్: పద్మా దేవేందర్‌రెడ్డి స్వగ్రామం రామాయంపేట మండలం కోనాపూర్. 2001లో రాజకీయాల్లోకి వచ్చారు. రామాయంపేట జెడ్పీటీసీగా టీఆర్ఎస్ నుంచి 12 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జిల్లా పరిషత్‌లో ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. 2004లో రామాయంపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీచేసి 32 వేల ఓట్లతో గెలుపొందారు. 2007లో కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్-టీడీపీ పొత్తులో భాగంగా ఆమెకు టికెట్ రాలేదు. అప్పటికే రామాయంపేట పునర్విభజనలో మెదక్ నియోజకవర్గంలోకి వెళ్లింది. టీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేశారు. దాదాపు 24 వేల ఓట్లు సాధించారు. పాపన్నపేట మండలం, మెదక్ పట్టణంలో పద్మకు చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. ఆందోల్: పల్లి బాబూమోహన్ స్వస్థలం ఖమ్మం జిల్లా , తిరుమలయపాలెం మండలం, బీరోలు గ్రామం, 1974 నుంచి 1988 వరకు రెవెన్యూ శాఖలో ఆర్ఐగా పనిచేశారు. 1988 నుంచి సినిమా రంగంలోకి వచ్చారు 1998ఉప ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఆందోల్ నుంచి పోటీచేసి గెలిచారు. 1999లో రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. 2004లో కాంగ్రెస్ దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు. 2009లో మరోసారి పోటీ చేసి దామోదర రాజనర్సింహ చేతిలోనే 2,906 ఓట్ల స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఆయనకు 75,765 ఓట్లు పడగా రాజనర్సింహకు 78,671 కోట్లు వచ్చాయి. రాయికోడ్, టేక్మాల్ మండలాలు బాబూమోహన్‌ను దెబ్బతీశాయి. 2014లో టీఆర్ఎస్లో చేరి మళ్లీ ఆందోల్ బరిలో నిలబడ్డారు. పటాన్చెరు: గూడెం మహిపాల్‌రెడ్డి స్వస్థలం పటాన్చెరు. 1996-99 వరకు పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు 1995లో ఎంపీటీసీగా, 2001లో పటాన్చెరు ఎంపీపీగా ఎన్నిక 2009లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ఎన్నికల తర్వాత టీడీపీలో, 2013లో వైఎస్సార్సీపీలో చేరారు. 2014లో టీఆర్ఎస్లో చేరి, పటాన్చెరు టిక్కెట్ పొందారు. సిద్దిపేట.. తన్నీరు హరీష్‌రావు 1971 జూన్ 3న సిద్దిపేటలో సత్యనారాయణ, లక్ష్మీ దంపతులకు జన్మించారు. స్వగ్రామం.. కరీంనగర్ జిల్లా, బెజ్జింకి మండలం, తోటపల్లి గ్రామం. టీఆర్ఎస్ ఆవిర్భావం కంటే ముందే టీడీపీలో రాజకీయ ప్రయాణం. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. 2004 అక్టోబర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా హరీష్‌రావు.. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం 2008 మే ఉప ఎన్నికల్లో హరీష్‌రావు.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి భైరి అంజయ్యపై భారీ మెజారిటీతో గెలుపు 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భైరి అంజయ్యపై 64.677వేల ఓట్ల మెజార్టీతో హరీష్‌రావు గెలుపు 2010 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌పై 95.858 ఓట్ల మెజార్టీతో హరీష్‌రావు విజయం. ఈ మెజార్టీ రాష్ట్ర వ్యాప్తంగానే అత్యధిక మెజార్టీ కావడం విశేషం.