నాడు వైఎస్సార్.. నేడు కేసీఆర్
బాన్సువాడలో బస చేసిన ఇద్దరు సీఎంలు
బాన్సువాడ : బాన్సువాడ ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆతిథ్యం వచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాన్సువాడలో రాత్రి బస చేశారు.
2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి రాజీవ్ పల్లెబాటలో భాగంగా బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాల్లో పర్యటించారు. రాత్రి బాన్సువాడలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఉదయం అప్పటి బాన్సువాడ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పట్లో వైఎస్సార్ రాక సందర్భంగా బాన్సువాడను ముస్తాబు చేసి, రోడ్లు వేశారు. వీధిలైట్లు బిగించారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శుక్రవారం రాత్రి బాన్సువాడకు వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో బస చేశారు. శనివారం తిమ్మాపూర్ వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. సీఎం రాక సందర్భంగా బాన్సువాడను మరోసారి సుందరంగా తీర్చిదిద్దారు. పట్టణ పొలిమేరల్లో ట్రాఫిక్ ఐలాండ్లు ఏర్పాటు చేశారు. మొక్కలు నాటారు. వీధిలైట్లు బిగించారు. రోడ్లను అభివృద్ధి చేశారు. ఆర్‌అండ్‌బీ, గ్రామపంచాయతీ గెస్ట్‌హౌస్‌లకు మరమ్మతు చేశారు. ఇలా ముఖ్యమంత్రుల రాకతో అభివృద్ధి జరుగుతోందని బాన్సువాడవాసులు పేర్కొంటున్నారు.