రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 19వ తేదీన మేడారం రానున్నారు.
హన్మకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 19వ తేదీన మేడారం రానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సీఎం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నేరుగా మేడారం చేరుకుంటారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించిన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరుగుతున్న మేడారం జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో పాటు జాతర విజయవంతానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది.