తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఉద్యమ సింహం. ఈ సినిమా ట్రైలర్‌ను ఎంపీ కవిత పుట్టిన రోజు సందర్భంగా ఉద్యమ సింహం థియేట్రికల్ ట్రైలర్ విడుదల. తెలంగాణ ఉద్యమ సారథి .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపధ్య కథతో తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమసింహం’. నటరాజన్, మాధవి రెడ్డి, జలగం సుధీర్, లత ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకం పై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఫిలిం ఛాంబర్ లో జరిగింది.
ఈ సందర్బంగా నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర రావు ట్రైలర్ విడుదల చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సింహం సినిమా కేసీఆర్ జీవిత కథ కాదు. ఇది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో సాగిన అంశాల నేపథ్యంగా తెరకెక్కించిన కథ. కేసీఆర్ పాత్రలో నటరాజన్ చక్కగా నటించారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావొచ్చాయి. ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు కృష్ణంరాజు మాట్లాడుతూ .. ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు నడిపారు కానీ ఒక్క కేసీఆర్ మాత్రమే పోరాడి తెలంగాణను సాధించాడు. ఆయన సంకల్పం బలమైనది. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం ఎలా జరిపారు అన్న అంశాలు ఈ సినిమాలో చూపిస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ బండారి ఇచ్చిన పాటలు హైలెట్ గా నిలిచాయి. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment