నేడు జిల్లాకు సీఎం | Today CM kcr coming to the district | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు సీఎం

Published Tue, Mar 1 2016 4:23 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

నేడు జిల్లాకు సీఎం - Sakshi

నేడు జిల్లాకు సీఎం

అధికారికంగా టీఆర్‌ఎస్‌లో  చేరనున్న ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
రాజేంద్రనగర్ కాటేదాన్‌లో బహిరంగ సభ

  
వికారాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం జిల్లాకు రానున్నారు. రాజేంద్రనగర్‌లోని కాటేదాన్ దుర్గానగర్ చౌరస్తాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో అధికారికంగా చేరనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ సోమవారం వికారాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వెల్లడించారు. సభకు 20 వేల మంది హాజరుకానున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అనుచరులు సైతం టీఆర్‌ఎస్‌లో చేరుతారన్నారు.

రాష్ట్రంలో టీడీపీ నాయకులంతా టీఆర్‌ఎస్ వైపు వస్తున్నారన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు మాత్రమే స్థానం ఉంటుందన్నారు.  టీఆర్‌ఎస్‌కు ఇప్పటికీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనడానికి వరంగల్, హైదరాబాద్, నారాయణఖేడ్ ఎన్నికలే సమాధానమన్నారు. నవాబుపేట జడ్పీటీసీ ఎన్నికల్లో 28 వేల ఓట్లకు గాను టీడీపీకి కేవలం 600 ఓట్లు పడ్డాయన్నారు. నేటి సభకు జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.

 8న మహిళా ప్రజా ప్రతినిధులకు సన్మానం
 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న పంజాగుట్టలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లాలోని మహిళా ప్రజా ప్రతినిధులను సన్మానించడం జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement