‘త్రి’గుణీకృతం.. ఈ టెంకాయ అంకురసిరి
Published Mon, Dec 12 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
లూటుకుర్రు (మామిడికుదురు) :
‘నాకులాగే ‘ముక్కంటి’ అయిన శివుడి కన్న నేనే ఒక్కిం త ఎక్కువ తెలు సా. ఆ బూడిదరాయుడికి బిడ్డలు ఇద్దరే అయి తే.. నాకు మాత్రం ముగ్గురు సంతానం’ అన్నట్టు.. ఓ టెం కా య మూడు మొలకలకు జన్మని చ్చింది. సాధారణం గా ఓ కొ బ్బరి కాయ నుంచి ఒకే మొలక వస్తుంది. లూటుకుర్రు శివారు బాడిలంకలో మామిడికుదురు ఎంపీపీ మద్దాల సావిత్రీదేవి ఇంటి పెరట్లోని ఓ కాయకు మూడు మొలకలు వచ్చాయి. దీనిపై పి.గన్నవరం ఏడీఏ జె.ఎలియాజర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా కొబ్బరి కాయలో ఒక బీజం ఉంటే ఒక మొలక వస్తుందని, ఈ కాయలో మూడు బీజాలు ఉండడం వల్ల మూడు మొలకలు వచ్చి ఉంటాయని చెప్పారు. అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుందన్నారు.
Advertisement
Advertisement