మినీ శిల్పారామానికి భూములు సేకరించండి
Published Fri, Jun 23 2017 11:43 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
– కర్నూలు ఆర్‌డీఓకు కలెక్టర్ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్) : కర్నూలులో మినీ శిల్పారామం ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ.. కర్నూలు ఆర్‌డీఓను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో రాష్ట్ర శిల్పారామాల ప్రత్యేక అధికారి శివరామ్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి, కర్నూలు ఆర్‌డీఓ హుసేన్ సాహెబ్, మున్సిపల్ కమిషనర్ హరినాథ్ రెడ్డి తదితరులు కలిశారు. మినీ శిల్పారామం ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శివరామ్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో ప్రభుత్వం మినీ శిల్పారామాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, జిల్లాలో 15 నుంచి 20 ఎకరాల భూమి కేటాయిస్తే ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. చేతివృత్తులను ప్రోత్సహించేందుకు మినీ శిల్పారామం తోడ్పడుతుందని వివరించారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ శిల్పారామం ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించాలని కర్నూలు ఆర్‌డీఓ, కర్నూలు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
Advertisement