పనితీరు మెరుగుపరుచుకోండి
నెల్లూరు(పొగతోట): పనితీరు మెరుగుపరుచుకుని సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉపాధి హామీ పనులు వేగవంతం చే యాలని, రికార్డుల నిర్వహణ పూర్తి స్థాయిలో ఇ-ఆఫీస్ విధానం ద్వారా నిర్వహించాలని, స్మార్ట్ పల్స్ సర్వే నెలఖారులోపు పూర్తి చేసే లా చర్యలు చేపట్టాలని, గ్రీవెన్స్‌డేలో ప్రజల సమర్పిస్తున్న అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్‌కు వస్తు న్న ఫిర్యాదులపై వెంటనే స్పందించి వివరాలు అందజేయాలన్నారు. పరిష్కరించిన వాటి వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని తెలిపారు. అనంతరం డయల్ యువ ర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు, బోగోలు, కొడవలూరు, బాలాయపల్లి తదితర మండలాల నుంచి 18 ఫిర్యాదులు వచ్చాయి. భూ సమస్యలు, పారిశుద్ధ్యం, ఉపాధి పనులు తదితర వాటిపై ఫిర్యాదులు చేశారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
గ్రామీణ ప్రాంతాలల్లో పారిశుద్ధా్యన్ని మెరుగుపరిచేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు టాస్క్‌ఫోర్స్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో టాస్క్‌ఫోర్స్ అధికారులతో నిర్వహించి న సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వచ్చే నెల నుంచి వారి వారి పరిధిలో ఉన్న గ్రామాలను సందర్శించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ ఇంతియాజ్, జేసి-2 రాజ్‌కుమార్, డీఆర్‌ఓ మార్కండేయులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.