నేడు విధులకు నూతన కలెక్టర్‌ | collector today joins his duty | Sakshi
Sakshi News home page

నేడు విధులకు నూతన కలెక్టర్‌

Published Mon, Apr 24 2017 12:30 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

collector today joins his duty

అనంతపురం అర్బన్‌ : జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన జి.వీరపాండియన్‌ సోమవారం విధులకు హాజరుకానున్నారు. ఆదివారం రాత్రి ఆలస్యంగా జిల్లాకు చేరుకున్న ఆయన... కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. జిల్లా కలెక్టర్‌గా ఉన్న శశిధర్‌ను గుంటూరు కలెక్టర్‌గా, విజయవాడ మున్సిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఉన్న వీర పాండియన్‌ను జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. ఈ నెల 20న జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుతో పాటు నూతన కలెక్టర్‌ వీరపాండియన్‌ పాల్గొన్నారు. అదే రోజు రాత్రి ఆయన తిరిగి విజయవాడ వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement