ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ | collector went for cm conference | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్

Published Tue, Dec 20 2016 11:56 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

collector went for cm conference

– ఉదయం నుంచి సాయంత్రం వరకు నోట్స్‌ తయారీలో నిమగ్నం
 
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు నిర్వహించే  కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం బయలుదేరారు.  ఉదయం నుంచే ఆయన అన్ని శాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమై నోట్స్‌ తయారీలోనే నిమగ్నమయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 27 అంశాలపై తాజా వివరాలు తీసుకున్నారు. ప్రధానంగా నగదు రహిత లావాదేవీలు, ప్రజా సాధికార సర్వే, వ్యవసాయ అనుబంధ శాఖల ప్రగతి, రెండంకెల అభివృద్ధి రేటు, నీరు–చెట్టు తదితర అంశాలపై తాజా ప్రగతిని సిద్ధం చేసుకున్నారు. రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను జిల్లా యంత్రాంగం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షిస్తుంది. కాన్ఫరెన్స్‌లో భాగంగా జిల్లా అధికారులతోనూ మాట్లాడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement