మీ కోసం.. ఏదీ పరిష్కారం ? | complaints hike of every week in meekosam | Sakshi
Sakshi News home page

మీ కోసం.. ఏదీ పరిష్కారం ?

Published Mon, Jun 12 2017 11:29 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

మీ కోసం.. ఏదీ పరిష్కారం ? - Sakshi

మీ కోసం.. ఏదీ పరిష్కారం ?

– పదే పదే అర్జీలు ఇస్తున్నా ఫలితం శూన్యం
– పరిష్కరించినట్లుగా నివేదికలు
– వారంవారం పెరుగుతున్న అర్జీదారుల సంఖ్య


ఇళ్ల పట్టాల కోసం తిరుగుతున్నాం – రాకెట్ల గ్రామ ఎస్సీలు
‘ఇరవై ఏళ్లుగా ఇళ్ల పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నాము. మీ కోసంలో పలుమార్లు అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు’. అని ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన ఎస్సీలు తులసమ్మ, లక్ష్మిదేవి, నాగమ్మ, రామాంజినమ్మ, విజయమ్మ, తిప్పమ్మ, తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాల కోసం 75 కుటుంబాలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాయని చెప్పారు.

అనంతపురం అర్బన్‌ : ప్రతివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ కార్యక్రమం జరుగుతోంది.  ఇందులో అర్జీలు ఇస్తే పరిష్కారమవుతాయనే ఆశతో జిల్లా నలమూలల నుంచి ప్రజలు వస్తున్నారు. అయితే చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో అర్జీదారులు ఆవేదనకు గురవుతున్నారు. ఒకే సమస్యపై పదేపదే అర్జీలు ఇస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. వారం వారం అర్జీదారుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అయితే సమస్యలను పరిష్కరించినట్లుగా అధికారులు నివేదికలు ఇస్తుండటం విమర్శలు తావిస్తోంది. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో మీ కోసం, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గీవెన్స్‌లను నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి, జెడ్పీ సీఈఓ రామచంద్ర అర్జీలు స్వీకరించారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు కాలేదు
పరిగి మండలం వన్నంపల్లి పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు కాలేదని బీజీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దేకుంట వెంకటేశ్వరరెడ్డి, రైతులు రమేశ్, నరిసింగప్ప, నరేశ్, హనుమంతప్ప, శ్రీరాములు, నరసింహమూర్తి, తదితులు విన్నవించారు. వ్యవసాయ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో సమస్య వచ్చిందన్నారు.

బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి
పేదరికంతో ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కోనూరు సతీశ్‌ శర్మ విన్నవించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బ్రాహ్మణులకు విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలన్నారు.  ఉపకార వేతనంపై ఉన్న ఆంక్షలు తొలగించాలన్నారు.

విద్యావ్యాపారానికి అడ్డుకట్ట వేయండి
జిల్లాలో కార్పొరేట్‌ విద్యా సంస్థలు  చేస్తున్న విద్యావ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని విద్యార్థి సంఘాల నాయకులు విన్నవించారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం, ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, శ్రీహరి, జీవీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున నాయక్, సాకేనరేశ్, తదితరులు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement