every week
-
మీ కోసం.. ఏదీ పరిష్కారం ?
– పదే పదే అర్జీలు ఇస్తున్నా ఫలితం శూన్యం – పరిష్కరించినట్లుగా నివేదికలు – వారంవారం పెరుగుతున్న అర్జీదారుల సంఖ్య ఇళ్ల పట్టాల కోసం తిరుగుతున్నాం – రాకెట్ల గ్రామ ఎస్సీలు ‘ఇరవై ఏళ్లుగా ఇళ్ల పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నాము. మీ కోసంలో పలుమార్లు అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు’. అని ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన ఎస్సీలు తులసమ్మ, లక్ష్మిదేవి, నాగమ్మ, రామాంజినమ్మ, విజయమ్మ, తిప్పమ్మ, తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాల కోసం 75 కుటుంబాలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాయని చెప్పారు. అనంతపురం అర్బన్ : ప్రతివారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో అర్జీలు ఇస్తే పరిష్కారమవుతాయనే ఆశతో జిల్లా నలమూలల నుంచి ప్రజలు వస్తున్నారు. అయితే చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో అర్జీదారులు ఆవేదనకు గురవుతున్నారు. ఒకే సమస్యపై పదేపదే అర్జీలు ఇస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. వారం వారం అర్జీదారుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అయితే సమస్యలను పరిష్కరించినట్లుగా అధికారులు నివేదికలు ఇస్తుండటం విమర్శలు తావిస్తోంది. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో మీ కోసం, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గీవెన్స్లను నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి, జెడ్పీ సీఈఓ రామచంద్ర అర్జీలు స్వీకరించారు. ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాలేదు పరిగి మండలం వన్నంపల్లి పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాలేదని బీజీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దేకుంట వెంకటేశ్వరరెడ్డి, రైతులు రమేశ్, నరిసింగప్ప, నరేశ్, హనుమంతప్ప, శ్రీరాములు, నరసింహమూర్తి, తదితులు విన్నవించారు. వ్యవసాయ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో సమస్య వచ్చిందన్నారు. బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి పేదరికంతో ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కోనూరు సతీశ్ శర్మ విన్నవించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బ్రాహ్మణులకు విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఉపకార వేతనంపై ఉన్న ఆంక్షలు తొలగించాలన్నారు. విద్యావ్యాపారానికి అడ్డుకట్ట వేయండి జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న విద్యావ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని విద్యార్థి సంఘాల నాయకులు విన్నవించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం, ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, శ్రీహరి, జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున నాయక్, సాకేనరేశ్, తదితరులు వినతిపత్రం అందజేశారు. -
ఆ బాలిక పరిస్థితి దయనీయం..
సింగ్భమ్: అదొక మారుమూల ప్రాంతం. గుట్టలు, పుట్టలు... నడిచేందుకు బాటకూడా సరిగా లేని వైనం.. తిండికూడా దొరకని పరిస్థితి. కడుపునిండా భోజనం లేక కొంత మేర కృశించిన శరీరంతో తొమ్మిదేళ్ల బాలిక. ఆ బాలికపై ఓ కామాంధుడి కళ్లుపడ్డాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలికను తీసుకెళ్లి ఓ నది ఒడ్డున పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో దాదాపు చచ్చుబడిపోయినట్లుగా మారిపోయిందా బాలిక శరీరం. ఈ దారుణానికి పాల్పడిన వాడిని అరెస్టు చేశారు కానీ.. ఆ బాలిక పరిస్థితి దయనీయంగా మారింది. తిరిగి తమ కూతురును మాములు స్థితిలోకి మార్చుకోవాలని నిరక్ష్యరాస్యులైన ఆ తల్లిదండ్రుల చేస్తున్న పోరాటం అంతా ఇంతా కాదు. ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్భమ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిగిన ఓ అమానవీయ ఘటన. రాంచీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ బాధిత కుటుంబం.. తమ కన్న కూతురికి తిరిగి పునరుజ్జీవం అందించేందుకు రెండు నెలలుగా ప్రాయసపడుతోంది. దాదాపు నాలుగు కిలోమీటర్లు ఆ బాలిక తండ్రి తన భుజాలపై ఎత్తుకొని రాంఛీలోని ప్రభుత్వ ఆస్పత్రికి కాలినడకన తీసుకెళుతున్నాడు. ఈ విషయం హైకోర్టు దృష్టికి వెళ్లడంతో కాస్త వారికి ఉపశమనం లభించింది. బ్లాక్ స్థాయి అధికారులు ముందుకొచ్చి ఆ కుటుంబానికి బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆ బాలికను తీసుకెళ్లేందుకు సైకిల్ ఏర్పాటు చేస్తామని, కోర్టు ఆదేశించినట్లుగా తక్షణమే లక్ష రూపాయలు అందిస్తామని, ఇతర ఆర్థిక పరమైన అవసరాలు కూడా తీరుస్తామని హామీ ఇచ్చారు. తండ్రికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దీర్ఘకాలిక ఉపాధి ఇప్పిస్తామని, వ్యవసాయ భూమి కూడా ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆ కుటుంబానికి కొంత ఊరట కలిగింది. వైద్యులు కూడా బాలిక ప్రాణానికి ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. ఈ బాలికపై లైంగిక దాడికిపాల్పడిన వ్యక్తిపై గతంలో కూడా ఇలాంటి కేసులు ఉన్నాయి. -
'సెక్షన్ 8 పై రాష్ట్రపతికి వినతిపత్రం ఇస్తాం'
హైదరాబాద్: పుష్కరాల నేపథ్యంలో వారానికోసారి కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పుష్కరాలకు కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల హైకోర్టు జడ్జిలను ఆహ్వానిస్తామన్నారు. సెక్షన్ 8, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. ఆగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతిపథకానికి ఆధార్‌ను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఆక్టోబర్ 22 న పోలవరం నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వనిస్తామని తెలిపారు.