ముగిసిన సప్తాహ భజనలు | Completed Saptaha Bhajans | Sakshi
Sakshi News home page

ముగిసిన సప్తాహ భజనలు

Published Sat, Aug 13 2016 7:10 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

Completed Saptaha Bhajans

మల్దకల్‌ : మల్దకల్‌ ఆదిశిలా క్షేత్రంలో ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన సప్తాహ భజనలు శనివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సమద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సరం సప్తాహ భజనల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు గద్వాల పట్టణ సమీపంలోని కష్ణానది జలాలను తీసుకొచ్చి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రాజారెడ్డి, సర్పంచ్‌ నాగరాజు, ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, నాయకులు మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, ఆలయ సిబ్బంది నర్సింహులు, శ్రీనివాసులు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement