అనంతపురం అగ్రికల్చర్: వృక్ష పద్ధతిలో మల్బరీ సాగు విస్తీర్ణం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించామని పట్టుపరిశ్రమశాఖ జాయింట్ డైరెక్టర్ సి.అరుణుకుమారి గురువారం ‘సాక్షి’కి తెలిపారు. అందులో భాగంగా ఈ పద్ధతిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. వృక్ష పద్ధతిలో మల్బరీ సాగుచేస్తున్న కర్ణాటక ప్రాంతానికి రైతులను తీసుకెళుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి డివిజన్ నుంచి 80 మంది రైతులను రెండు రోజుల పాటు చిక్‌బళ్లాపూర్, దొడ్డబళ్లాపూర్, కోలార్, బెంగళూరు, మైసూర్ ప్రాంతాల్లో తిప్పి అక్కడ సాగు చేస్తున్న మల్బరీ పంటలను చూపిస్తున్నామన్నారు.
ఇప్పటికే ఒక బృందంలోని రైతులు క్షేత్ర పరిశీలనకు వెళ్లి వచ్చారన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల పట్టు సాగుకు ఇబ్బందిగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వృక్ష పద్ధతిలో మల్బరీ సాగు చేయడం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అలాగే సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పద్ధతులను ఎలా ఉపయోగించాలన్న దానిపై పర్యటనలో రైతులకు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వృక్ష పద్ధతి మల్బరీ సాగుపై దృష్టి
Published Thu, Jul 27 2017 7:18 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement