Published
Wed, Jul 20 2016 8:08 PM
| Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
అధిక ఫీజులను నియంత్రించాలి
నల్లగొండ టౌన్: హైదరాబాద్‌లోని కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ విగ్రహం వద్ద కార్పొరేట్ విద్యా సంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్ మాట్లాడుతు కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తు దోపిడికి పాల్పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో బీవీ. చారి, ఎన్. హరికృష్ణ, కోటేశ్, సుధాకర్‌రెడ్డి, నవీన్, మధు, సురేశ్, బంగారు, శివారెడ్డి, స్వామి, సంపత్, రంజిత్, నర్సింహ పాల్గొన్నారు.