పట్టు బట్టాడు.. పట్టుబడ్డాడు | coroption issue, engineering officer arrested | Sakshi
Sakshi News home page

పట్టు బట్టాడు.. పట్టుబడ్డాడు

Published Thu, Mar 16 2017 10:31 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

పట్టు బట్టాడు.. పట్టుబడ్డాడు - Sakshi

పట్టు బట్టాడు.. పట్టుబడ్డాడు

  • రూ.30 వేలు తీసుకుని పట్టుపడిన వైనం
  • పట్టించిన పంచాయతీ వార్డు సభ్యుడు
  • కరప (కాకినాడ రూరల్‌) : 
    ఏసీబీ అధికారుల ట్రాప్‌లో మరో ఇంజనీరింగ్‌ అధికారి పడ్డాడు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుపట్టాడు. ఏడాది కాలంగా బిల్లులు చేయకుండా తిప్పుతున్నందుకు విసిగిపోయి ఇలా చేయాల్సి వచ్చిందని పట్టిచ్చిన పంచాయతీ వార్డు సభ్యుడు మేడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ (పట్టాభి) తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. వేళంగి, యండమూరు, సిరిపురం తదితర గ్రామాల్లో గతేడాది మార్చి నుంచి ఇంతవరకు రూ.82 లక్షల విలువ జేసే సీసీ రోడ్లు, శ్మశాన వాటిక నిర్మాణం తదితర పనులను వేళంగి పంచాయతీ వార్డు సభ్యుడు పట్టాభి చేయించారు. ఈ పనుల బిల్లులు చేయడానికి ఇంతవరకూ రెండు దఫాలుగా రూ.1.15 లక్షలు ఇంజనీరింగ్‌ అధికారికి ఇచ్చానని, మిగిలిన పర్సంటేజ్‌ సొమ్ము బిల్లులు పూర్తయ్యాక ఇస్తానని చెప్పినా బిల్లులు చేయకుండా తిప్పుతున్నట్టు బాధితుడు తెలిపాడు. 
    ఇక తట్టుకోలేక ఆరు వారాల క్రితం రాజమండ్రిలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. అయినా జాలేసీ అధికారి ఊరిలో లేరని చెప్పడంతో కడియం వరకూ వచ్చిన ఏసీబీ అధికారులు వెనక్కి వెళ్లిపోయినట్టు చెప్పారు. అయితే ముందుగానే రూ.30 వేలు ఇవ్వాలని పట్టుపట్టడంతో తప్పనిసరి పరిస్ధితిలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నాడు. ఈమేరకు వేళంగిలో మార్కెట్‌ షెడ్‌కు స్లాబ్‌ వేయిస్తున్న ఇంజనీరింగ్‌ అధికారి నాగభూషణం సొమ్ము ఇస్తానని చెప్పినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో, రాజమండ్రి నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు డీఎస్పీ ఎం.సుధాకరరావు, సీఐ పీవీ సూర్యమోహన్, ఎస్సై నరేష్, సిబ్బంది రమణబాబు, రామకృష్ణ, మధు, రాంబాబు వేళంగి మార్కెట్‌ ప్రాంతంలో మాటువేశారు. ఇంజనీరింగ్‌ అధికారి డబ్బులున్న కవరు తీసుకుని ప్యాంట్‌ జేబులోపెట్టుకుని ఉన్నాడు. దీంతో ఏసీబీ అధికారులు.. ఇంజనీరింగ్‌ అధికారిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆయన తడబడుతూ నాకేమీ తెలియదని, చేతిలో పెట్టి వెళ్లిపోయాడని దబాయించారు. అధికారి తీసుకున్న రూ.2 వేల నోట్ల నెంబర్లు, వేలిముద్రలు సరిపోవడంతో స్టేట్‌మెంట్‌ తీసుకుని ఏసీబీ డీఎస్పీ సుధాకరరావు, సీఐ సూర్యమోహ¯ŒS కేసు నమోదు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరించేందుకు రాజమండ్రి నుంచి ఏపీ ట్రా¯Œ్సకో ఏడీఈ కె.రత్నాలరావు సమక్షంలో ఈ తతంగం సాగింది. విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సుధాకరరావు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాకినాడలో ఉండే ఏసీబీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో విలీనం చేశారన్నారు. మామూళ్ల కోసం అధికారులు వేధిస్తుంటే 94404 46160కు సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని తెలిపారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement