Engineering Officer
-
పట్టు బట్టాడు.. పట్టుబడ్డాడు
రూ.30 వేలు తీసుకుని పట్టుపడిన వైనం పట్టించిన పంచాయతీ వార్డు సభ్యుడు కరప (కాకినాడ రూరల్) : ఏసీబీ అధికారుల ట్రాప్‌లో మరో ఇంజనీరింగ్ అధికారి పడ్డాడు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుపట్టాడు. ఏడాది కాలంగా బిల్లులు చేయకుండా తిప్పుతున్నందుకు విసిగిపోయి ఇలా చేయాల్సి వచ్చిందని పట్టిచ్చిన పంచాయతీ వార్డు సభ్యుడు మేడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ (పట్టాభి) తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. వేళంగి, యండమూరు, సిరిపురం తదితర గ్రామాల్లో గతేడాది మార్చి నుంచి ఇంతవరకు రూ.82 లక్షల విలువ జేసే సీసీ రోడ్లు, శ్మశాన వాటిక నిర్మాణం తదితర పనులను వేళంగి పంచాయతీ వార్డు సభ్యుడు పట్టాభి చేయించారు. ఈ పనుల బిల్లులు చేయడానికి ఇంతవరకూ రెండు దఫాలుగా రూ.1.15 లక్షలు ఇంజనీరింగ్ అధికారికి ఇచ్చానని, మిగిలిన పర్సంటేజ్ సొమ్ము బిల్లులు పూర్తయ్యాక ఇస్తానని చెప్పినా బిల్లులు చేయకుండా తిప్పుతున్నట్టు బాధితుడు తెలిపాడు. ఇక తట్టుకోలేక ఆరు వారాల క్రితం రాజమండ్రిలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. అయినా జాలేసీ అధికారి ఊరిలో లేరని చెప్పడంతో కడియం వరకూ వచ్చిన ఏసీబీ అధికారులు వెనక్కి వెళ్లిపోయినట్టు చెప్పారు. అయితే ముందుగానే రూ.30 వేలు ఇవ్వాలని పట్టుపట్టడంతో తప్పనిసరి పరిస్ధితిలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నాడు. ఈమేరకు వేళంగిలో మార్కెట్ షెడ్‌కు స్లాబ్ వేయిస్తున్న ఇంజనీరింగ్ అధికారి నాగభూషణం సొమ్ము ఇస్తానని చెప్పినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో, రాజమండ్రి నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు డీఎస్పీ ఎం.సుధాకరరావు, సీఐ పీవీ సూర్యమోహన్, ఎస్సై నరేష్, సిబ్బంది రమణబాబు, రామకృష్ణ, మధు, రాంబాబు వేళంగి మార్కెట్ ప్రాంతంలో మాటువేశారు. ఇంజనీరింగ్ అధికారి డబ్బులున్న కవరు తీసుకుని ప్యాంట్ జేబులోపెట్టుకుని ఉన్నాడు. దీంతో ఏసీబీ అధికారులు.. ఇంజనీరింగ్ అధికారిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆయన తడబడుతూ నాకేమీ తెలియదని, చేతిలో పెట్టి వెళ్లిపోయాడని దబాయించారు. అధికారి తీసుకున్న రూ.2 వేల నోట్ల నెంబర్లు, వేలిముద్రలు సరిపోవడంతో స్టేట్మెంట్ తీసుకుని ఏసీబీ డీఎస్పీ సుధాకరరావు, సీఐ సూర్యమోహ¯ŒS కేసు నమోదు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరించేందుకు రాజమండ్రి నుంచి ఏపీ ట్రా¯Œ్సకో ఏడీఈ కె.రత్నాలరావు సమక్షంలో ఈ తతంగం సాగింది. విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సుధాకరరావు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాకినాడలో ఉండే ఏసీబీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో విలీనం చేశారన్నారు. మామూళ్ల కోసం అధికారులు వేధిస్తుంటే 94404 46160కు సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని తెలిపారు. -
తన్నులు తింటావ్.. చర్మం ఊడదీస్తా..
మండల ఇంజినీరింగ్ అధికారిపై టీడీపీ నాయకుడి శివాలు ఇక్కడ ఎలా పని చేస్తావో చూస్తానంటూ వార్నింగ్ రాజమహేంద్రవరం రూరల్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు, అధికారులకు రక్షణ లేకుండా పోతోంది. పశ్చిమ గోదావరి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకొని దాడి చేయడం.. అంగ¯ŒSవాడీలపై దుర్భాషలాడుతూ విరుచుకుపడడం.. మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా జల్లిపల్లిలో టీడీపీ సర్పంచ్ ఓ మహిళను ఎగిరెగిరి కాళ్లతో తన్నడం.. ఇలా అనేక దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు తామేమీ తీసిపోకూడదనుకున్నారో ఏమో మరి! రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో.. మండల ఇంజినీరింగ్ అధికారిపై మండల టీడీపీ అధ్యక్షుడు ‘తన్నులు తింటావ్’ అంటూ విరుచుకుపడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శాటిలైట్ సిటీ గ్రామంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప చేతుల మీదుగా ఆర్టీసీ సిటీ బస్సులను ఆదివారం ప్రారంభించారు. అనంతరం అధికారులు, టీడీపీ నాయకులు కలిసి టిఫి¯ŒS చేస్తున్నారు. ఈలోగా పిడింగొయ్యి పంచాయతీ బుచ్చియ్యనగర్‌లో జనావాసాలు లేనిచోట ఇటీవల రూ.22 లక్షలతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డు విషయం చర్చకు వచ్చింది. దీనిపై మండల ఇంజినీరింగ్ అధికారి సూర్యనారాయణ తన పక్కనే ఉన్న మాజీ వైస్ ఎంపీపీ గంగిన హనుమంతరావుతో మాట్లాడుతూ, పంచాయతీ తీర్మానం లేకుండా, వర్కార్డర్ వస్తుందా? అని అడిగారు. హనుమంతరావు మాట్లాడుతూ, తీర్మానం లేకుండా ఎటువంటి పనులకూ వర్కార్డర్ రాదని బదులిచ్చారు. అదే సమయంలో అక్కడే ఉన్న మండల టీడీపీ అధ్యక్షుడు మార్ని వాసుదేవరావు ఒక్కసారిగా కోపోద్రిక్తుడై మండల ఇంజినీరింగ్ అధికారి సూర్యనారాయణపై విరుచుకుపడ్డాడు. ‘‘తన్నులు తింటావ్. చర్మం ఊడదీస్తా. ఇక్కడ ఎలా పని చేస్తావో చూస్తాను’’ అంటూ శివాలెత్తాడు. ‘‘కొట్టండి సారూ.. కొట్టేసుకోండి సారూ..’’ అంటూ బదులిచ్చారు. వాసుదేవరావు పక్కన ఉన్న ఆయన కుమారుడు కూడా మండల ఇంజినీరింగ్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులు మిన్నకుండిపోయారు. కొంతసేపటి తరువాత ఇరువురికీ సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే వాసుదేవరావు దుర్భాషలాడడంతో మనస్తాపానికి గురైన మండల ఇంజినీరింగ్ అధికారి.. ఈ విషయాన్ని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి దృష్టికి, ఉద్యోగ సంఘ నాయకులు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. అనంతరం దీనిపై తగు నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. -
ముడుపులకు మూల్యం
ముడుపులకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రతి బిల్లుకు డబ్బులు వసూలు చేస్తున్నందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పర్సెంటేజీల పేరిట వేధింపులకు తగిన శాస్తి జరిగింది. ప్రజోపయోగానికి రోడ్డు నిర్మించేందుకు లంచాలు చెల్లించాలి. ఆ పని దక్కించుకోవడానికి పర్సంటేజీలు ఇవ్వాలి. ఇక పని పూర్తి చేశాక ఆ కాంట్రాక్టర్‌కు దక్కిందేమిటి. కడుపు మండిన ఓ కాంట్రాక్టర్ వేధిస్తున్న ఇంజినీరింగ్ అధికారిని అవినీతి నిరోధక శాఖకు పట్టించారు. ఏసీబీకి చిక్కిన ఇంజినీరింగ్ అధికారి ఎంబుక్‌లో నమోదు చేసేందుకు రూ. 20వేలు డిమాండ్ కడుపుమండి ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ సాక్షి ప్రతినిధి, విజయనగరం :పర్సంటేజీలు, ముడుపులు ఇచ్చుకోలేక చిన్నపాటి కాంట్రాక్టర్లు చితికిపోతున్నారు. సహనం ఉన్న వాళ్లు భరిస్తున్నారు. తట్టుకోలేని వాళ్లు అవినీతికి పాల్పడుతున్న వారికి తిరిగి బుద్ధి చెబుతున్నారు. ఇప్పుడా విధంగానే సాలూరు మండల ఇంజినీరింగ్ అధికారి రాంగోపాల్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ఎంబుక్‌లో రికార్డు చేసేందుకు చిన్నపాటి కాంట్రాక్టర్ నుంచి రూ. 20వేలు లంచం తీసుకుని విజయనగరం కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద పబ్లిక్‌గా దొరికిపోయారు. పని చేతికొచ్చిన దగ్గరి నుంచే ముడుపులే పనులు మంజూరైన దగ్గరి నుంచి చేపట్టిన వరకు అడ్డుగోలు కార్యక్రమమే. నామినేటేడ్ పద్ధతిలో మంజూరైన పనులను సంబంధిత సర్పంచ్‌లు, నీటి సంఘాల అధ్యక్షులు చేపట్టాల్సి ఉంది. కొందరు అధికార పార్టీ నేతలు కష్టపడకుండానే సొమ్ము చేసుకోవాలన్న అత్యాశతో మంజూరైన పనులను పర్సంటేజీకి చిన్నపాటి కాంట్రాక్టర్లకు అమ్మేస్తున్నారు. నాలుగు డబ్బులొస్తాయని ఆశపడి కాంట్రాక్టర్లు ఏదో ఒక రకంగా పని కానిచ్చేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులకు మామూళ్లు ఇక సర్పంచ్‌లనుంచి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లను ఇంజినీరింగ్ అధికారులు వదలడంలేదు. తమకు రావల్సినవి ఇచ్చేయాల్సేందంటూ పర్సంటేజీలు తీసుకుంటున్నారు. కొందరు పని విలువలో 10నుంచి 12శాతం తీసుకుంటుండగా, మరికొందరు 15శాతం వరకు గుంజేస్తున్నారు. ఇరిగేషన్ పనుల్లోనైతే 20శాతం వరకు లాగేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు వాటితో సంతృప్తి చెందడం లేదు. ఎంబుక్‌లో రికార్డు చేసిన ప్రతీసారి పిండేస్తున్నారు. అప్పుడు కూడా తమను సంతృప్తి పరచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడా రకంగా ఇవ్వలేకే సాలూరు మండలం పురోహితునివలసకు చెందిన కాంట్రాక్టర్ బి.సూర్యనారాయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వ్యూహాత్మకంగా ఎంబుక్ రికార్డు చేసేందుకు డబ్బులు అడిగిన మండల ఇంజినీరింగ్ అధికారి రాంగోపాల్‌రెడ్డిని బుక్ చేయించారు. పట్టు బడేంతవరకు తొందరే బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ రాంగోపాల్‌రెడ్డి వ్యవహారం చూస్తే లంచం సొమ్ము కోసం తానెంత ఆత్రుత పడ్డాడన్నది స్పష్టమవుతుంది. రూ. 5లక్షల విలువైన సీసీ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే రూ. 3.50లక్షల బిల్లు చేసేశారు. మిగతా రూ. లక్షా 50వేలు బిల్లు కోసం రూ. 20వేలు డిమాండ్ చేశారు. లంచమిస్తేనే ఎంబుక్ రికార్డు చేస్తానని మొండికేయడంతో కాంట్రాక్టర్ సూర్యనారాయణ మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ప్రణాళిక ప్రకారం అడిగినంత ఇస్తామంటూ ఇంజినీరింగ్ అధికారికి చెప్పించారు. బుధవారం తెల్లవారు జామునుంచి లంచం సొమ్ము కోసం ఇంజినీరింగ్ అధికారి తెగ ఆరాట పడ్డారు. ఉదయం 7.30గంటలకు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి సాలూరు రావడం లేదని... కలెక్టరేట్లో సమావేశం ఉందని... ఇక్కడికొచ్చి ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మళ్లీ 9గంటలకు ఫోన్ చేసి వస్తున్నావా...అని అడిగారు. 9.30గంటలకు మరోసారి ఎక్కడున్నావని అడిగారు. 10గంటలకు ఫోన్ చేసి కలెక్టరేట్ వద్దకు వచ్చేశానని, తెలిపారు. ఇదిగో వచ్చేస్తున్నానంటూ కాంట్రాక్టర్ సూర్యనారాయణ ఏసీబీ అధికారులను వెంటబెట్టుకుని కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దకు వచ్చారు. ఆ పక్కనే చెట్లు కింద ఉన్న ఇంజినీరింగ్ అధికారిని కలిశారు. లంచం సొమ్మును ఇచ్చేందుకు ప్రయత్నించగా తన బ్యాగ్‌లో పెట్టాలని ఇంజనీరింగ్ అధికారి కోరారు. కానీ, కాంట్రాక్టర్ బ్యాగ్‌లో పెట్టకుండా నేరుగా చేతికిచ్చాడు. అదే అదనుగా మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు పబ్లిక్‌గా పట్టుకున్నారు. వెంటనే కారులోకి ఎక్కించి, విచారించారు. మీడియా కంట పడకుండా గంటన్నరకు పైగా కారులోనే ఇంజనీరింగ్ అధికారి ఉండిపోయారు. కొసమెరుపు ఏంటంటే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఇంజినీరింగ్ అధికారికి మరో రెండేళ్లే సర్వీసు ఉంది. దాడుల్లో విజయనగరం ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి, సీఐలు రమేష్, లక్మోజులు పాల్గొన్నారు.