నీట మునిగిన పంటలు
Published Wed, Jul 20 2016 11:19 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
సిర్పూర్(టి) : మండలంలో ఇటీవల ఎడ తెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు మండలం మీదుగా ప్రవహిస్తున్న పెన్‌గంగ నది పరివాహక ప్రాంతాల్లోని పంట చేలు పొలాలు పూర్తిగా వరదనీటిలో మునిగిపోయాయి. పెన్‌గంగ పరివాహక ప్రాంతాలైన సిర్పూర్(టి), హుడ్కిలి, జక్కాపూర్, మాకిడి, వెంకట్రావ్‌పేట, టోంనికి, పారిగాం, లోనవెల్లి గ్రామాల శివారుల్లోని పెన్‌గంగ పరివాహక ప్రాంతాల పంట చేనుపొలాలు వరదనీటిలో మునిగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఐదు రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురువడంతోపాటు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు, మహారాష్ట్రలోని ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో మండలం మీదుగా ప్రవహిస్తున్న పెన్‌గంగ నది ఉదృతంగ ప్రవహించడంతో పెన్‌గంగ పరివాహక ప్రాంతాల్లోని పంట చేనుపొలాలు వరదనీటిలో రోజుల తరబడి మునిగిపోవడంతో విత్తనాలు, మొలకలు మురిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధిదికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.
Advertisement
Advertisement