నారింజ పరివాహక ప్రాంతంలో నీట మునిగిన పంట పొలాలు
కోహీర్: మండలంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. 46.4 మి.మీ వర్షపాతం నమోదైంది. నారింజ, పెద్దవాగు ప్రాజెక్ట్ పొంగి ప్రవహించాయి. పరివాహక, లోతట్టు ప్రాంతాలు జలమయమైయాయి. వర్షాలకు వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, కంది, పత్తి పంటలకు నష్టం వాటిల్లగా ఏడిళ్లు కూలిపోయాయి.
మండల కేంద్రమైన కోహీర్ పట్లూర్‌బేస్‌లో మధుకర్ అనే వ్యక్తి ఇళ్లు కుప్ప కూలింది. పరిస్థితిని గమనించి కుటుంబసభ్యులు బయటికి వెళ్లడంతో ప్రాణాలను కాపడుకోగలిగారు. సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిళ్లింది. తహసీల్దార్ గీత, వ్యవసాయాధికారి రత్న, ఆర్‌ఐ శ్రావణి దెబ్బతిన్న పొలాలు, కూలిన ఇళ్లను పరిశీలించారు.