breaking news
crops damaged
-
'దయలేని బాబు' దగా పాలన
తుపాన్‌తో నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి.. ఎలా పరిహారం ఎగ్గొడదామా అని ఆలోచనలు చేస్తుండటం దుర్మార్గం. ఎన్యుమరేషన్ అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి కావాలని చెబుతూ ఒక్క రోజు ముందు 30న ప్రొసీడింగ్స్ ఇవ్వడాన్ని ఏమంటారు? ఒక్క రోజులో ఎన్యుమరేషన్ అనేది ఎలా సాధ్యం? పంట నష్ట పరిహారం జాబితాలో పేరుంటే ధాన్యం కొనుగోలు చేయం అని చెప్పడం దారుణం. ఇలా రైతులను బ్లాక్ మెయిల్ చేస్తూ.. బెదిరిస్తూ.. పైకి మాత్రం రైతులను ఉద్దరిస్తున్నట్లు బిల్డప్లా?తుపాను కారణంగా వరి కంకుల సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించడం ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలకం. ఎన్యుమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితే లేదు. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే మీ విధానం? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కృష్ణా జిల్లా ఆకుమర్రు లాకు నుంచి సాక్షి ప్రతినిధి: ‘రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తుపాను దెబ్బకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అనేదే దండగ.. రైతు అనే వాడు వేస్ట్.. అందుకే ఆయన హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయం, రైతుల విషయంలో చంద్రబాబు మైండ్‌సెట్ మార్చుకోవాలి.. రైతులు రాష్ట్రానికి వెన్నెముక అని గుర్తించాలి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు మారకపోతే బాధితుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టిగా హెచ్చరించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. పంట పొలాల్లో దిగి.. బాధిత రైతులతో మమేమకవుతూ జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన తానున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మండలం ఆకుమర్రు లాకు వద్ద బాధిత రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టం అని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ‘మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పోతాడు.. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడటానికి ముంబై పోతాడు.. రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’ అని ఎత్తిచూపారు. పంటలు దెబ్బ తిన్న ప్రతీ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, పంటల బీమా పరిహారం కూడా ఇవ్వాలని, ప్రస్తుత రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. గత 18 నెలల్లో సంభవించిన విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. లేదంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కృష్ణాజిల్లా నిడుమోలు వద్ద భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ 18 నెలల్లో ఒక్క రైతుకైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ⇒ రైతు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి మారుమూల ప్రాంతాలకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో తిరిగితేనే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం రైతుల విషయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు ఉన్నాయి. మోంథా తుపాను దాదాపు 25 జిల్లాలపై ప్రభావం చూపింది. ⇒ అటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు కృష్ణా నుంచి కర్నూలు వరకు దాని ప్రభావం కన్పించింది. దాదాపుగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడూ ఊహించని విధంగా పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వరి పంటకే ఎక్కువగా 11 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు మరో నాలుగు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ⇒ వరి పంట గింజలు పాలు పోసుకున్న దశలో తుపాను విరుచుకుపడింది. తీవ్రమైన గాలులు, వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతింది. చంద్రబాబు 18 నెలల పాలనలో దాదాపు 16 సార్లు తుపానులు, వరదలు, అకాల వర్షాలు, కరువు వంటి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ 18 నెలల్లో ఏ రైతుకైనా ఒక్క సారైనా ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఏ రైతుకైనా ఒక్కసారైనా పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) ఇచ్చారా? అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తా అని హామీ ఇచ్చి.. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.ఐదు వేలతో సరిపెట్టారు. ⇒ ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాలేదు. ఇన్సూరెన్స్ రాలేదు. చివరికి ఎరువులు బ్లాకులో కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లోకి రైతులు వెళ్లిపోయారు. రూ.266కు దొరకాల్సిన యూరియా కట్టను ఏకంగా రూ.500, రూ.600 చొప్పున బ్లాకులో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అవసరాన్ని బట్టి బ్లాకులో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇలా కష్టాల సాగు చేసిన రైతులు తాము పండించిన పంటను అమ్ముదామంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం మద్దతు ధరకు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది ధాన్యం 75 కేజీల బస్తాకు మద్దతు ధర ప్రకారం రూ.1,750 రావాల్సి ఉండగా, రైతుల చేతికొచ్చింది మాత్రం కేవలం రూ.1,350 మాత్రమే. చంద్రబాబు హయాంలో ప్రతి అడుగులోనూ రైతు నష్టపోతూనే ఉన్నాడు. నాడు ప్రతి రైతుకు భరోసా ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో వారిపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని ఐదేళ్ల పాటు అమలు చేసి అండగా నిలిచింది. మూడున్నర ఎకరాలున్న రైతులు సైతం దాదాపు రూ.70 వేలు, రూ.66 వేలు చొప్పున గతంలో బీమా పరిహారం డబ్బులు అందుకున్న పరిస్థితులను ఇక్కడి రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు ఏ రైతు ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. విపత్తుల వేళ పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని ఏ రోజు ఏ రైతు ఆ ఐదేళ్లలో అధైర్య పడలేదు. కారణం.. పంట నష్టం జరిగితే జగనన్న ఉన్నాడు.. పైసా భారం పడకుండా తమ పంటకు బీమా చేయించాడని, తమకు డబ్బులొస్తాయని ధైర్యంగా ఉండేవారు. ప్రతి రైతుకు భరోసా ఉండేది. ⇒ ఏదైనా విపత్తు వేళ పంటలకు నష్టం వాటిల్లితే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇస్తాడనే ధైర్యం ఉండేది. ఆ డబ్బులతో మరుసటి సీజన్లో పెట్టుబడి పెట్టుకోవచ్చనే ధైర్యం ఉండేది. సీజన్ మొదలయ్యే సరికే ప్రతి రైతుకు ఓ భరోసా ఉండేది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున ఇస్తారన్న నమ్మకం ఉండేది. ⇒ ఆర్బీకే వ్యవస్థ అనేది రైతులను చేయి పట్టి నడిపించే వ్యవస్థగా ఉండేది. ప్రతీ రైతు వేసిన పంటకు ఈ–క్రాప్ జరిగేది. ఆర్బీకే పరిధిలోనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్.. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులకు అందుబాటులో ఉండే వారు. సచివాలయాలతో అనుసంధానం చేసి వలంటీర్లతో కలిసి రైతులను చేయిపట్టి నడిపించేవారు. ప్రతి రైతును.. అతను సాగు చేసిన పొలంలో నిలబెట్టి జియో ట్యాగ్ చేసి ఈ–క్రాప్ బుకింగ్ చేసే వారు. తద్వారా పంటకు ఎప్పుడు, ఏ ఇబ్బంది వచ్చినా రైతుకు ప్రభుత్వం తోడుగా నిలబడేది. ధరలు పతనమైన ప్రతిసారి ప్రభుత్వ జోక్యం ⇒ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉండేది కాదు. ఆర్బీకే పరిధిలో ఏ పంటను ఏ రేటుకు కొనుగోలు చేసేది రైతులకు తెలియజేసేవాళ్లం. ఆ రేట్ల కంటే తక్కువగా పడిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. మద్దతు ధరల వివరాలు ఆర్బీకేలో ప్రదర్శించేవాళ్లం.⇒ ఎక్కడ ఏ పంట రేటు తగ్గినా వెంటనే ఆర్బీకే అసిస్టెంట్ నుంచి ఎలెర్ట్ వచ్చేది. మార్క్‌ఫెడ్‌కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్న జేసీలు వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకునే వారు. ధరలు పడిపోయిన పంటలను కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీని తీసుకొచ్చి «రైతుకు తోడుగా నిలబడేవారు. ఇందుకోసం కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ (సీఎం యాప్) అనే యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలో ఉండేది. ⇒ ఈ యాప్ ద్వారా గ్రామ స్థాయిలో ధరలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రతి రైతుకు బాసటగా నిలిచే వారు. ఇలా ఐదేళ్లలో ధర లేని సమయంలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కనీస మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ⇒ అప్పట్లో రైతులు సాగు చేసిన ప్రతి పంటను ఈ–క్రాప్‌లో నమోదు చేసేవాళ్లం. తద్వారా రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేశాం. దాదాపు 85 లక్షల మంది రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉచితంగా పంటల బీమా అమలు చేశాం. 54.55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ కింద రూ.7,800 కోట్లు జమ చేశాం. ⇒ ప్రస్తుతం చంద్రబాబు హయాంలో కేవలం 19 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అది కూడా బ్యాంక్ రుణాలు తీసుకున్న వారు. మరి ప్రీమియం చెల్లించని మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి పంటల బీమా పరిహారం అందకుండా చేయడం దుర్మార్గం కాదా?ఇదేం విడ్డూరం.. ఒక్క రోజు ముందు ప్రొసీడింగ్సా!?⇒ తుపాన్‌తో నష్టపోయిన రైతులు ఆశ్చర్యం కలిగించే విషయాలు చెబుతున్నారు. మీ పొలంలో ఎన్యుమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా? అని అడిగితే.. ఈ పొలంలోకే కాదు రాష్ట్రంలో దెబ్బతిన్న ఏ పొలంలోకి, ఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ చేసేందుకు ఎవరూ రాలేదన్న మాట విని్పస్తోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30వ తేదీన ప్రొసీడింగ్స్ (ఉత్తర్వులు చూపిస్తూ) ఇచ్చారు.⇒ ఎన్యుమరేషన్ ఆఫ్ క్రాప్ డామేజ్, సోషల్ ఆడిట్ 31వ తేదీ కల్లా పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. ఒక్క రోజులో ఎన్యుమరేషన్ (పంట నష్టం మదింపు), సోషల్ ఆడిట్ అయిపోవాలట! ఎలా సాధ్యమో మీరే చెప్పండి. పైగా ఈ గడువులోగా చేయకపోతే యాక్షన్ తీసుకుంటామని ఇదే ప్రొసీడింగ్స్‌లో స్పష్టం చేశారు. క్రాప్ డామేజ్, ఎన్యుమరేషన్, సోషల్ ఆడిట్, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అంతా పూర్తి చేసి తుది జాబితాలను 1వ తేదీకల్లా వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌కు పంపాలని పేర్కొన్నారు.⇒ ఈ ఆదేశాలు చూస్తుంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారో తెలుస్తోంది. ఎన్యుమరేషన్ అనేది ఎవరూ పంట పొలాల వద్దకు వచ్చి చేసే పరిస్థితి లేదు. గాలులు, తుపాను వల్ల ధాన్యం సుంకు విరిగిపోయింది. ఎన్యుమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారి అయినా సరే పొలంలో అడుగుపెట్టాలి. వరి కంకులను చూడాలి. సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించాలి. ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఈ విషయాన్ని స్పష్టంగా రాయాలి. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే విధానం?ధాన్యం కొనబోమని బ్లాక్ మెయిల్ చేస్తారా?⇒ ఎన్యుమరేషన్ కోసం ఎందుకు పొలం వద్దకు రాలేదని ఏ రైతు అయినా అడిగితేæ వారిని వెటకారం చేసి మాట్లాడుతున్నారు. పైగా ప్రతి రైతుకు వ్యవసాయ శాఖాధికారి నుంచి తాము చెప్పిన పత్రాలు (ఆధార్, 1బి జిరాక్స్, కౌలు గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం) సమరి్పంచిన వారి పొలాల్లో మాత్రమే పంట నష్టం పరిశీలించి జాబితాలో పెడతామని మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కూడా చెప్పిస్తున్నారు. అదీ అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా తీసుకొస్తేనే స్వీకరిస్తామని, లేదంటే ఆ పత్రాలు స్వీకరించం అని తెగేసి చెబుతున్నారు. ⇒ మరొక వైపు ‘దయచేసి రైతులు గమనించగలరు. ఇప్పుడు పంట నష్టం చేయించుకున్న రైతుల నుంచి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయబడదు’ అని నిర్దయగా మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎవరైనా అడిగితే వాళ్ల ధాన్యం కొనుగోలు చేయరట! అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?⇒ ఎక్కడైనా తుపాను వచ్చినపుడు ప్రభుత్వం మానవత్వం ప్రదర్శించాలి. నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకునేందుకు ముందుకు రావాలి. పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) వచ్చేలా చేయాలి. అంతే కాకుండా వారి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టాలి. అది ఇస్తే ఇది ఇవ్వం.. ఇది ఇస్తే ఆది ఇవ్వం.. అని చెబుతూ రైతులను బెదిరించడం దారుణం. దీన్నిబట్టి ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది.మా హయాంలో కచ్చితమైన చర్యలు⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి తుపానులు వచ్చే ముందు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించే వాళ్లం. వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో జిల్లా యంత్రాంగం కలిసి పనిచేసేది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్ల పరిధి తగ్గించాం. తక్కువ నియోజకవర్గాలకు ఎక్కువ మంది కలెక్టర్లు, జేసీలు వచ్చారు. ఇలాంటి విపత్తుల వేళ ప్రాణ నష్టం జరగకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే వాళ్లం. కలెక్టర్ల చేతుల్లో కావాల్సినంత డబ్బులు పెట్టేవాళ్లం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్లం.⇒ వారం.. పది రోజుల టైం ఇస్తున్నాం.. ఎన్యుమరేషన్ పక్కాగా, పారదర్శకంగా చేయాలని చెప్పేవాళ్లం. తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు కలెక్టర్ పనితీరు ఏలా ఉంది.. పంట నష్టం కోసం ఎన్యుమరేషన్ ఎలా జరిగింది.. అన్ని సదుపాయాలు మీకు కల్పించారా.. లేదా.. వంటి వివరాలు ప్రజలను అడిగి తెలుసుకునేవాణ్ని. ఏ ఒక్కరైనా అధికారులు బాగా చేయలేదని చెబితే ఉద్యోగం పీకేస్తామని గట్టిగా చెప్పే వాళ్లం. అందువల్ల అధికారుల్లో ఒక భయం ఉండేది. ఆకుమర్రు లాకు వద్ద పొలంలోకి వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్ ఈ–క్రాప్‌ను గాలికొదిలేశారు..⇒ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఈ క్రాప్ అనేది రైతులకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అలాంటిది ఈ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ తెరమరుగైపోయింది. పంట పొలంలో రైతులను నిలబెట్టి, జియో ట్యాగ్ చేసి, వారి ఫొటోతీసిసి అప్లోడ్ చేసే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఈ–క్రాప్ నిర్వచనం మార్చేశారు. ఈ–క్రాప్ చేశామంటే చేశామన్నట్టుగా ఉంది. టీడీపీ వాళ్లయితే ఉన్న భూమి కంటే ఎక్కువగా సాగు చేసినట్టు చూపిస్తున్నారు.⇒ ఇందుకు బాపట్ల జిల్లాయే ఉదాహరణ. ఈ జిల్లాలోని పర్చురులో 112 శాతం, జే.పంగలూరులో 114 శాతం.. బల్లికురవలో 115 శాతం.. వేటపాలంలో 117 శాతం.. చీరాలలో 122 శాతం.. చినగంజాంలో 128 శాతం చొప్పున ఈ–క్రాప్ నమోదైనట్టుగా చూపించారు. అంటే ఉన్న భూమి కన్నా సాగైన భూమి ఎక్కువగా ఉందా? ఉన్నభూమి 100 శాతమైతే 128 శాతం విస్తీర్ణంలో సాగైనట్టు చూపిస్తున్నారు. అదెలా సాధ్యం! ఈ–క్రాప్‌ను ఏ విధంగా నీరుగారుస్తున్నారో ఇంతకంటే ఉదాహరణలు కావాలా?⇒ ఇలాంటి విపత్తుల వేళ కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు ప్రభావిత ప్రాంతాల్లో తిరిగే వారు. వారం, పది రోజుల తర్వాత నేను వెళ్లే వాడిని. పరిస్థితిని అంచనా వేసే వాళ్లం. ముఖ్యమంత్రి వస్తాడేమో అనే భయంతో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా కలెక్టర్లు పనిచేసే వారు. ఈ రోజు ప్రభుత్వ పనితీరు చూస్తుంటే.. ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ⇒ రైతుకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే.. ఒకరోజు చాపర్‌లో అలా అలా తిరుగుతాడు. మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వస్తాడు.. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి పోతాడు. ఇక్కడ రైతుల పరిస్థితి ఏడవ లేక.. కడుపులో బాధ తట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ ఒక్క కౌలు రైతుకు కౌలు కార్డులు ఇవ్వడం లేదు. ఇస్తే వాళ్లకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే దురాలోచనతో ఉన్నారు.ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తున్నారు?⇒ ఎన్యుమరేషన్ లెక్కలు ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు? తుపాను వల్ల దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇంత పంట నష్టం ఎప్పుడు జరగలేదని మీ ఎల్లో మీడియాలో, మీ గెజిట్ పేపర్ ఈనాడులోనే తొలుత రాశారు. ఇప్పుడు ఎందుకు తగ్గించి రాస్తున్నారు? ఎన్యుమరేషన్ చేసేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడలేకపోతున్నారు? పైగా ఎన్యుమరేషన్ చేస్తే మీ పంటను కొనుగోలు చేయం అని ఎందుకు భయపెట్టిస్తున్నారు? రైతుకు మంచి చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తోంది?⇒ మీ తప్పిదం వల్ల రైతులకు పంటల బీమా పరిహారం (ఇన్సూరెన్స్) డబ్బులు రావడం లేదు. ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి ఉండి ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నష్టపోయిన ప్రతి రైతుకు కనీసం రూ.25 వేలకు పైగా పరిహారం వచ్చేది. మీ తప్పిదం వల్ల వారికి ఈ పరిహారం అందకుండా పోయింది. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం వల్ల నష్టం జరిగింది. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వచ్చేలా చేయాల్సిన బాధ్యత మీదే. అలా చేయాలని రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. 18 నెలల్లో 16 సార్లు రైతులు నష్టపోయారు. మీరు తగ్గించి, కోతలేసి వేసిన లెక్కల ప్రకారమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూ.600 కోట్లు ఇవ్వాలి. ఆ బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. రబీ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నా. -
అన్నదాతకు గుండె కోత
-
‘కరువు’ సాగు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాలువల ద్వారా సాగునీటి సరఫరా అందడం లేదు. బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. దీనితో చాలాచోట్ల సాగునీటికి కొరత ఏర్పడింది. దీనితో ముఖ్యంగా వరి పంట దెబ్బతింటోంది. పొట్టదశకు వచ్చిన వరి ఎండిపోతుంటే రైతులు ఆందోళన పడుతున్నారు. ఎలాగోలా పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీటిని తెచ్చి పొలాల్లో పోస్తున్నారు. ఇలా చేయలేనివారు కన్నీటితో పంటలను అలాగే వదిలేస్తున్నారు. పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కొందరు రైతులు ఎండిన పంటలకు ఆవేదనతో నిప్పు పెడుతున్నారు. మూడో వంతు పంటలకు దెబ్బ వర్షాభావంతో కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని రిజర్వాయర్లు నిండలేదు. దీనితో యాసంగి సీజన్లో ప్రాజెక్టుల నుంచి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దీనికితోడు భూగర్భజలాలు పడిపోవడం మరింత కష్టం తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిగతా పంటలనూ కలుపుకొంటే యాసంగిలో సాగుచేసిన పంటల్లో దాదాపు 30 శాతం మేర ఎండిపోయాయని పేర్కొంటున్నారు. దీనితో గ్రామాల్లో రైతులతోపాటు కూలీలకు కూడా పనులు లేకుండా పోయాయి. ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. ఇది కరువు పరిస్థితేనని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిని కరువుగా భావించడం లేదని పేర్కొంటున్నాయి. అడుగంటిన భూగర్భ జలాలు.. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటున 7.34 మీటర్ల లోతులో ఉండగా.. ఈసారి ఫిబ్రవరి నాటికి 8.70 మీటర్ల లోతుకు పడిపోయాయి. కామారెడ్డి జిల్లాలో 10.64 మీటర్ల లోతు నుంచి.. ఈసారి 12.92 మీటర్ల లోతుకు తగ్గిపోయాయి. ఖమ్మం జిల్లాలో 5.11 మీటర్ల నుంచి 6.22 మీటర్ల లోతుకు.. మేడ్చల్ జిల్లాలో 8.97 మీటర్ల నుంచి 11.45 మీటర్ల లోతుకు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 6.57 మీటర్ల నుంచి 9.52 మీటర్ల లోతుకు పడిపోయాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 6.93 మీటర్ల నుంచి ఏకంగా 10.19 మీటర్ల లోతుకు.. నల్లగొండ జిల్లాలో 6.15 మీటర్ల నుంచి 10.86 మీటర్ల లోతుకు.. వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. తగ్గిన పంటల సాగు విస్తీర్ణం సాగు నీటి వసతులు తగ్గడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి యాసంగి సీజన్లో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగిలో 72.58 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. ఈసారి 66.30 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. సుమారు 6.28 లక్షల ఎకరాలు తగ్గినట్లు వ్యవసాయశాఖ తేలి్చ, ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. గత యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైతే.. ఈసారి 50.69 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 5.75 లక్షల ఎకరాల సాగు తగ్గింది. పప్పుధాన్యాల సాగు గత యాసంగిలో 4.33 లక్షల ఎకరాలు అయితే.. ఇప్పుడు 3.18 లక్షల ఎకరాలకు తగ్గింది. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏది? ఒకవైపు పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, మరోవైపు వేసిన పంటలు ఎండిపోతుండటం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా వ్యవసాయశాఖ స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. కనీసం తమకు భరోసా కల్పించే ప్రయత్నాలైనా చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. పంట నష్టంపై సర్వే చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందని.. సర్వే చేసి కరువు తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే.. పరిహారమో, సాయమో అందే పరిస్థితి ఉండేదని వాపోతున్నారు. మూడు జిల్లాల్లో ‘సాగు’ గోస! ► ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యాసంగి కింద ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, ఇతర పంటలు సాగు చేశారు. మొత్తం 7,25,345 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 4,71,047 ఎకరాల్లో సాగైనట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. కానీ సాగునీరు అందక, బోర్లు వట్టిపోవడంతో ఇప్పటివరకు సుమారు 88,752 ఎకరాల్లో వరి, 2,605 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న పంటలు ఎండిపోయినట్టు ప్రాథమిక అంచనా. ► ఖమ్మం జిల్లాలో గత నాలుగేళ్లుగా యాసంగిలో మూడు లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగవుతున్నాయి. నాగార్జునసాగర్ జలాలు అందుబాటులో ఉండటంతోపాటు బోర్లు, బావులు, చెరువుల కింద సాగు కొనసాగింది. కానీ ఈసారి కృష్ణా పరీవాహకంలో వర్షాభావంతో సాగర్ నిండలేదు. పంటల సాగుకు జలాలు విడుదల కాలేదు. దీనితో వరి, ఇతర పంటల సాగు తగ్గింది. చాలా మంది చెరువులు, బోర్లపై ఆధారపడి పంటలు వేశారు. దీంతో ఈ ఏడాది సాగు 1,47,389 ఎకరాలకే పరిమితమైంది. ఇందులో వరి 80,025 ఎకరాల్లో, మొక్కజొన్న 57,342 ఎకరాల్లో వేశారు. సాగైన చోట కూడా పంటలు ఎండిపోతున్నాయి. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కాల్వల కింద ఏడాది నుంచి సాగునీరు అందలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో వందల సంఖ్యలో బోర్లలో నీరు రావడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు అంచనా. పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా యాతనా పడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని గ్రామాల్లో చేసేదేమీ లేక పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. పంట పశువుల మేతకు వదలాల్సి వచ్చింది నాకు ఊరు చెరువు వెనకాల రెండెకరాల పొలం ఉంది. యాసంగిలో వరిసాగు చేసేందుకు చెరువు నుంచి నీరు వదలడం లేదు. దీనితో జనవరిలో పొలంలో బోరు వేయించాను. నీరు బాగానే పడటంతో నా రెండెకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. కానీ నెలన్నర రోజుల్లో బోరు ఎండిపోయింది. పంటను దక్కించుకునేందుకు 400 అడుగుల లోతుతో మరో బోరు వేయించా. అందులోనూ నీరు అడుగంటింది. దీనితో మరో రెండు బోర్లు వేయించినా ఫలితం లేకపోయింది. పొలం ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలిపెట్టా. నాలుగు బోర్లు, పంట పెట్టుబడికి ఏడు లక్షలదాకా అప్పులు అయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. – చిన్నయ్య, రైతు, గాధిర్యాల్ గ్రామం, మహమ్మదాబాద్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి నందిగామ బ్రాంచి కెనాల్ కింద రెండెకరాల వరి వేశా. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక ఎండిపోయింది. మునుపెన్నడూ లేనంతగా నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. – మల్లెబోయిన సైదులు, రైతు, భైరవనిపల్లి గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా నాలుగెకరాల పంటంతా ఎండి పోయింది నాకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అయింది. ఉన్న ఒక్క బోరులో నీళ్లు అడుగంటాయి. నీళ్లు సరిపోక పంటంతా ఎండిపోయింది. ఎస్సారెస్పీ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేక పంటను వదలివేసిన. – ధరావతు సోమాని, రైతు, పాశ్చ్యానాయక్ తండ, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా రెండు బోర్లూ అడుగంటాయి రెండున్నర ఎకరాల భూమిలో వరి వేశాను. ఉన్న రెండు బోర్లలో నీళ్లు అడుగంటాయి. 15 రోజులైతే పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో పొలం ఎండిపోయింది. పంటకు పెట్టిన రూ.50 వేలు పెట్టుబడి నష్టపోయాను. – దొంతినేని జగన్రావు, వెంకటాద్రిపాలెం, తిప్పర్తి మండలం, నల్లగొండ జిల్లా -
భారీ వర్షం,పంట నష్టంపై కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
అర్హులైన రైతులందరికీ ఉచిత పంటల బీమా పరిహారం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఖరీఫ్–2021లో పంట నష్టపోయిన రైతులందరికీ డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం అందించి న్యాయం చేస్తామని కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. మంగళవారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యల కారణంగా పలువురు రైతులకు పంటల బీమా రాలేదని వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్లను, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్రంలోనే పంటల బీమా పరిహారం అనంతపురం జిల్లాకు అత్యధికంగా రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. చాలాచోట్ల వేరుశనగ పంటకు బీమా రాలేదన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాస్తవానికి ఈ–క్రాప్ నిబంధనల ప్రకారం అన్ని పంటలకూ ఇస్తారని స్పష్టం చేశారు. అర్హత ఉన్నా బీమా రాని రైతులకు కచ్చితంగా పరిహారం వచ్చేలా చేస్తామని తెలిపారు. అలాంటి రైతులు ఆర్బీకేలు, తహసీల్దార్ కార్యాలయాల్లో సంప్రదించాలని ఇదివరకే సూచించామని చెప్పారు. అర్జీలు ఇచ్చుకోవడానికి 15 రోజులు గడువు ఇస్తున్నామన్నారు. ఎరువులు ఇబ్బంది లేకుండా.. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. లక్షలాదిమంది రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత రాకుండా పర్యవేక్షణ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. 1.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా ఇప్పటికే 33.36వేల టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. సెపె్టంబర్ వరకు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి నెలవారీ ఎరువులు సేకరిస్తున్నామన్నారు. ఒక్క యూరియానే 37వేల టన్నులకు పైగా అవసరం ఉందని, కాంప్లెక్స్, 9వేల టన్నులు, ఎస్ఎస్పీ, ఎంఓపీ 9618 టన్నుల అవసరం ఉన్నట్టు గుర్తించామన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల లభ్యత ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా పంటల బీమా పరిహారం ‘అనంత’కు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్–2021లో పంట నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద ప్రభుత్వం రూ.2977.82 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఉమ్మడి ‘అనంత’కు అత్యధిక మొత్తం వచ్చింది. అనంతపురం జిల్లాలో 2,32,580 మంది రైతులకు రూ.629.77 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లాలో 1,71,881 మంది రైతులకు రూ.255.78 కోట్లు విడుదలైంది. ఇది కూడా చదవండి: మారవా.. నారాయణా! -
పంటలకు వరద పోటు..
సాక్షి, నెట్వర్క్: భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. ప్రధానంగా పత్తి పంట దెబ్బ తినగా, నాట్లు వేసిన వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. కొన్ని చోట్ల నీటి ప్రవాహానికి మొక్కలు కొట్టుకుపోయాయి. మంచిర్యాల జిల్లాలో ఏటా ప్రాణహిత తీరంలో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుండగా.. గత రెండు రోజులుగా కురిసిన వానలతో వేలాది ఎకరాల్లో భారీగా వరద నీరు చేరింది. పత్తి చేనుల్లో నీటి చేరికతో పాటు ఇసుక మేటలు వేయడంతో పత్తి మొలక, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా వరి నాట్లు వేస్తుండగా, ఈ వర్షాలతో నారు ఎదగకుండా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 6,864 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 5, 099 ఎకరాల్లో పత్తి, 1,447 ఎకరాల్లో వరి, 312 ఎకరాల్లో మిరప, 6 ఎకరాల్లో కంది నీట మునిగింది. పత్తికే ఎక్కువ నష్టం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 6 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా వేయగా, ఇప్పటివరకు సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. అలాగే సుమారు లక్ష న్నర ఎకరాల్లో పత్తి పంట వేశారు. భారీ వర్షాలతో చాలాచోట్ల ఇప్పటికే వేసిన వరి నాట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం తో పొలాలు మునిగిపోయాయి. పల్లపు ప్రాంతాల్లో పంటల మునక ఖమ్మం జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 2,70,000 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1,82,068 ఎకరాల్లో పంట వేశారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2,52,500 ఎకరాలు కాగా.. ఇప్పటికి 49,233 ఎకరాల్లో నాట్లు వేశారు. జిల్లాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో పల్లపు ప్రాంతాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 2.86 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. అలాగే పత్తి 2,363 ఎకరాల్లో సాగైంది. -
నీట మునిగిన పంటలు
వేమనపల్లి: ప్రాణహిత నదికి వరద పోటెత్తడంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రాణహితకు సహజ సిద్ధంగా వచ్చే వరద దిగువన ఉన్న గోదావరిలోకి వెళ్లకుండా మేడిగడ్డ వద్ద రిజర్వాయర్ అడ్డుగా ఉండటంతో వరద ఆదివారం రాత్రికి రాత్రే లోతట్టు పంటలను ముంచెత్తింది. దీంతో రైతులు లబోదిబోమం టున్నారు. నదీతీరం వెంట ఉన్న వేమనపల్లి, కోటపల్లి మండలాలతోపాటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లోని వేల ఎకరాల్లో పత్తి పంటలు నీటిపాలయ్యాయి. వేమనపల్లి శివారులో 240 ఎకరాలు, గొర్లపల్లిలో 110 ఎకరాలు, కేతన్‌పల్లిలో 140, కల్మలపేట శివారులో 120, ముల్కలపేట 80, రాచర్ల 110, ఒడ్డుగూడెం 60, సుంపుటం 85, జాజులపేట 70, ముక్కిడిగూడం 92, కళ్లంపల్లి 60 ఎకరాలు మునిగినట్లు అధికారులు తెలిపారు. స్తంభించిన రాకపోకలు ప్రాణహిత వరద పోటెత్తడంతో లోతట్టు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మత్తడివాగు వరకు వరద నీరు పోటెత్తుతుండటంతో వంతెనపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కళ్లెంపల్లి బొందచేను ఒర్రె, చింత ఒర్రె వంతెనలపై నుంచి వరద వెళ్తోంది. దీంతో పలు మండలాలకు రాకపోకలు స్తంభించాయి. ముల్కలపేట, రాచర్ల గ్రామాల మధ్య ఉన్న ఆర్అండ్బీ రోడ్డు వంతెనలపై నుంచి వరద పోటెత్తి ప్రవహిస్తోంది. దీంతో కోటపల్లి, వేమనపల్లి మండలాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. -
1.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం భారీగా జరిగింది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలతో కురిసిన భారీ వర్షాలకు చేతికొస్తున్న పంట దెబ్బతింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయశాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం 1.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఫలితంగా 56 వేల మంది రైతులు నష్టపోయారు. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక సమర్పించింది. వరి పంట ఎక్కువ విస్తీర్ణంలో దెబ్బతిన్నట్లు నివేదికలో పేర్కొంది. మరో వారం, పది రోజుల్లో కోతకు వచ్చే వరి 80,447 ఎకరాల్లో వర్షాలకు నష్టపోయినట్లు నివేదించింది. కరీంనగర్ జిల్లాలో 25,595 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. రాష్ట్రవ్యాప్తంగా 35,610 ఎకరాల్లో పత్తి పంట వర్షాలకు నష్టపోయినట్లు పేర్కొంది. ఇప్పటికే పత్తి మొదటితీత కొనసాగుతోంది. ముందుగా వేసిన పత్తిని రైతులు తీస్తున్నారు. ప్రతిరోజూ వర్షాలు కురుస్తుండటం వల్ల పత్తి తడిచి నల్లబడిపోయింది. కాయలు కూడా మచ్చలు వచ్చి పూర్తిగా నల్లపడ్డాయి. అలా రంగుమారిన పత్తిని వ్యాపారులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. 4,022 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. జిల్లాల వారీగా చూస్తే సూర్యాపేటలో 29 వేల ఎకరాల్లో, కరీంనగర్లో 25 వేల ఎకరాల్లో, పెద్దపల్లి జిల్లాలో 8,354 ఎకరాల్లో, నిజామాబాద్‌లో 8,730 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మంచిర్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో మొత్తంగా 142 మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు ఆలస్యంగా వచ్చాయి. నైరుతి ఒక నెల ఆలస్యంగా రావడంతో పాటు నెల ఆలస్యంగా వెనుతిరిగింది. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా కదలడంతో వారం, పది రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. -
ఏపీలో బీభత్సం సృష్టించిన అకాల వర్షాలు
-
వర్షార్పణం
ఖరీఫ్ కతం.. రైతన్నల ఆందోళన ఆదుకోవాలని వేడుకోలు ఝరాసంగం: గత సంవత్సరం వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. ప్రస్తుత సంవత్సరం అధిక వర్షాలు పడి పంటలు నాశనం అయ్యాయి. ఇలా ఈ విధంగా అయితేనేమి రైతులు నష్టపోవడం తప్పడం లేదు. సాగుకు పెట్టిన పెట్టుబడులు చేతికి అందక తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతుంది. దీంతో రైతులు పెట్టుబడి కోసం చేసిన అప్పలు తీర్చలేక అప్పుల పాలవుతున్నారు. గతంలో ఏన్నాడు లేని విధంగా శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి చేతికి వచ్చే పంటలు వాగులో కోట్టుకపోయాయి. మరి కొద్ది ప్రాంతాలలో వాగు పక్కనే ఉన్న పంట పొలాలలోని మట్టి కొట్టుకపోయి ఇసుక దిబ్బలుగా తయారు అయ్యాయి. ఈ పంట పొలాలను చూసిన రైతన్న కన్నీరుమున్నీరు అవుతున్నారు. రెండు రోజులుగా కురిసన వర్షాలకు పంట పొలాల్లో నీరు చేరుకుని జలమయమయ్యాయి. మండల కేంద్రమైన ఝరాసంగంతో పాటు కక్కరవాడ, బోరేగావ్, ప్యాలవరం, బోపన్పల్లి, చిలపల్లి, మేదపల్లి, జీర్లపల్లి, జునేగావ్ గ్రామాలలో పంటలు అధిక మొతాదులో నాశనం అయ్యాయి. సోయాబీన్, చెరుకు, పత్తి, అల్లం, పసుపు తదితర పంటలు వర్షం కారణంగా జలమయమయ్యాయి. మండలంలో సుమారు 4నుంచి 5వేల ఏకరాలలో పంటలు నీట మునిగినట్లు అధికారులు అంచన వేస్తున్నారు. జీర్లపల్లి, బోరేగావ్, బోపన్పల్లి గ్రామాలలో సాగుచేసుకున్న చెరుకు పంట రైతులకు చేదును మిగిల్చింది. సాగుచేసుకున్న చెరుకు పంటలో నుండి వాగు పారడంతో వరద ఉదృతికి పూర్తిగా నెలమట్టం అయింది. వేలాది ఎకరాలలో పంట నష్టం మండలంలో సుమారు 4నుంచి 5వేల ఎకరాలలో రైతులు సాగుచేసుకున్న వివిధ రకాల పంటలు వర్షంతో నాశనంతో అయ్యాయి. గ్రామాలలో అధికారులు పర్యటించి పంట నష్టపోయిన రైతుల యొక్క వివరాలు సేకరిస్తున్నారు. పంటలు వారిగా దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించి నివేదికలను ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు. నష్టపోయిన రైతులు తమను ప్రభుత్వం ఆదుకొని నష్టం పరిహరం చెల్లించి ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. -
పంటలకు భారీ నష్టం
కోహీర్: మండలంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. 46.4 మి.మీ వర్షపాతం నమోదైంది. నారింజ, పెద్దవాగు ప్రాజెక్ట్ పొంగి ప్రవహించాయి. పరివాహక, లోతట్టు ప్రాంతాలు జలమయమైయాయి. వర్షాలకు వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, కంది, పత్తి పంటలకు నష్టం వాటిల్లగా ఏడిళ్లు కూలిపోయాయి. మండల కేంద్రమైన కోహీర్ పట్లూర్‌బేస్‌లో మధుకర్ అనే వ్యక్తి ఇళ్లు కుప్ప కూలింది. పరిస్థితిని గమనించి కుటుంబసభ్యులు బయటికి వెళ్లడంతో ప్రాణాలను కాపడుకోగలిగారు. సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిళ్లింది. తహసీల్దార్ గీత, వ్యవసాయాధికారి రత్న, ఆర్ఐ శ్రావణి దెబ్బతిన్న పొలాలు, కూలిన ఇళ్లను పరిశీలించారు. -
భారీ వర్షం.. అపార నష్టం
నారాయణఖేడ్: నియోజకవర్గాన్ని మళ్లీ భారీ వర్షం అతలాకుతలం చేసింది. భారీగా ఆస్తినష్టం మిగిల్చింది. వర్షాకాలం ప్రారంభం అయ్యాక ఒక్క రోజు ఇంత మేర వర్షం కురవడం ఇదే మొదటిసారి. శనివారం తెల్లవారు జామున వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెరపి ఇచ్చినా మళ్లీ సాయంత్రం మొదలయ్యింది. నారాయణఖేడ్ మండలంలో 11.9 సెంటీ మీటర్ల వర్షం పడింది. గంగాపూర్ మొండి మత్తడి, తుర్కాపల్లి పటేల్ చెరువులకు గండ్లు పడ్డాయి.నీరంతా వృథాగా పోయింది. మండలంలో సుమారు 5 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పక్షం రోజులుగా వర్షాలు, వరదల వల్ల పంటలన్నీ దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కంది, పెసర, మినుము, సోయా, పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పంటలు నీట మునిగి కుళ్లిపోయాయి. నారాయణఖేడ్ పట్టణ శివారులో గల వాగు పొంగి ప్రవహించింది. కంగ్టి, సిర్గాపూర్- నారాయణఖేడ్ రూట్లో నెహ్రూ నగర్- మన్సుర్‌పూర్ గ్రామాల మధ్య ఉన్న వంతెనపై నుంచి ఐదు అడుగుల ఎత్తు మేర నీరు ప్రవహించింది. దీంతో వంతెన వద్ద గల రోడ్డు కొట్టుకుపోయింది. ఫలితంగా నారాయణఖేడ్- కంగ్టి, సిర్గాపూర్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దెబ్బతిన్న రోడ్డును అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. -
ఈసారైనా పరిహారం అందేనా?
-
ఈసారైనా పరిహారం అందేనా?
గతేడాది 2.72 లక్షల హెక్టార్లలో పంట నష్టం నేటికీ అందని ఇన్పుట్ సబ్సిడీ ఈ ఏడు అతివృష్టితో భారీగా పంటనష్టం మెదక్: రెండేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు రెక్కలు తెగిన పక్షుల్లా విలవిల్లాడుతున్నారు. గతేడాది తీవ్ర కరువుతో నష్టపోయిన రైతులకు నేటికి పైసా పరిహారం అందలేదు. ఈ యేడు అనేక నష్టాలకోర్చి సాగు చేసిన కొద్దిపాటి పంటలు చేతికందే సమయంలో అతివృష్టితో కొట్టుకుపోయాయి. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. మెదక్ జిల్లాలో గత సంవత్సరం తీవ్రకరువు కారణంగా అధికారిక లెక్కల ప్రకారం 2 లక్షల 73 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు, సోయాబిన్ తదితర పంటలు ఎండి పోయాయి. దీంతో జిల్లా రైతాంగానికి రూ. 197.7 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులే లెక్కలు కట్టారు. కాగా నేటికి యేడాది గడిచిపోతున్నా రైతులకు పైసా పరిహారం (ఇన్పుట్) సబ్సిడీ అందలేదు. గత సంవత్సరం పంట నష్టపోయిన రైతులు బతుకు దెరవు కోసం పట్టణాలకు వలస వెళ్లారు. ఈ క్రమంలో ఈ యేడు ఖరీఫ్‌లో మళ్లీ పంటలు సాగు చేసేందుకు పల్లెటూర్లకు చేరుకున్నారు. ఖరీఫ్ప్రారంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు మెట్టప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేయగా కొద్దో, గొప్పో నీరువచ్చే బోరుబావుల ఆధారంగా వరి, సోయాబిన్లాంటి పంటలను 3.5 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. అయితే ముందు మురిపించిన వర్షాలకు మొక్కజొన్న ఏపుగా ఎదిగినా గింజదశకు వచ్చిన ఆగస్టు నెలలో చుక్కవర్షం పడలేదు. దీంతో వర్షాధార పంటలైన మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయాయి. కాగా బోరుబావుల ఆధారంగా సాగు చేసిన వరి ఇటీవల కురిసిన భారీవర్షాలకు వాగులు, వంకలు పొంగి కొట్టుకుపోయింది. దీంతో సుమారు లక్ష ఎకరాలల్లో పంట దెబ్బతినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇంకా పలు మండలాల్లో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంటనష్టం వివరాలను సేకరిస్తున్నారు. కాగా గతేడాది అనావృష్టితో పంటలు నష్టపోయిన రైతులకు నేటికి పైసా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. కనీసం ఈ సారైనా సకాలంలో బాధితరైతులకు పరిహారం ఇస్తారో లేదో అంటూ పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వరుస విపత్తులతో సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గతేడాది కూడా పరిహారం ఇవ్వలేదు గతేడాది మూడెకరాల్లో మొక్కజొన్న వేశా. వర్షాలు పడక పంట ఎండిపోయింది. అధికారులు వచ్చి రాసుకు పోయారు. కాని నేటికీ పరిహారం అందలేదు. ఈయేడు కూడా మొక్కజొన్న వేయగా అది ఎండిపోయాక వర్షం పడింది. ఈయేడైనా పరిహారం అందిస్తారో లేదో? - కెతావత్ శ్రీను, బ్యాతోల్తండా -
దెబ్బతిన్న పంటల పరిశీలన
జిన్నారం: మండలంలోని బొంతపల్లి, అండూర్ గ్రామాల్లో వ్యవసాయ అధికారులు వర్షం కారణంగా నష్టపోయిన పంటలను బుధవారం పరిశీలించారు. అండూర్‌లో మండల వ్యవసాయశాఖ అధికారి సాల్మన్‌నాయక్ నష్టపోయిన మొక్కజొన్న, వరి, జొన్న పంటలను ఆయన పరిశీలించారు. సుమారు వంద ఎకరాల్లో వివిధ రకాల పంటలు వర్షం కారణంగా నష్టపోయాయని ఆయన తెలిపారు. బొంతపల్లిలోని వీరన్న చెరువు అలుగు పారటంతో వరి పంట నాశనమైందని రైతులు అధికారులకు తెలిపారు. ఏఈఓ చైతన్య వరి పంటలను పరిశీలించారు. బొంతపల్లిలో సుమారు 50 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నాశనమైందని చైతన్య తెలిపారు. పంట నష్టంపూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు చెప్పారు. -
పంటనష్టంపై ప్రభుత్వానికి నివేదిక
వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు గజ్వేల్ మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన గజ్వేల్: అధిక వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ మండలం సింగాటం, అహ్మదీపూర్, పిడిచెడ్, ప్రజ్ఞాపూర్ గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరిపిలేకుండా కురిసిన వర్షాలు ప్రధానంగా పత్తి, మొక్కజొన్నకు అపారనష్టం కలిగించాయని తెలిపారు. ఇప్పటికైనా వర్షాలు తెరిపి ఇచ్చి ఎండలు వస్తే పత్తి పంట తిరిగి కోలుకునే అవకాశముందన్నారు. రైతులు వర్షపునీరు బయటకు వెళ్లేలా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతేగాకుండా తెగుళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు వివరించారు. పలు చేలల్లో మొక్కజొన్న వాలిపోవడం, అధిక తేమ కారణంగా మొలకలు రావడం గమనించిన డిప్యూటీ డైరెక్టర్ మొక్కజొన్నకు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. కంది, వరి పంటలకు పెద్దగా నష్టం కలగలేదని తెలిపారు. జిల్లాలోని పరిస్థితిపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించారు. సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అధిక వర్షాలు కురుస్తున్న ప్రస్తుత సమయంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రధానంగా చేలల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చని చెప్పారు. తెగుళ్లు సంక్రమిస్తే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమీషనరేట్ కార్యాలయ ఏడీఏ పుణ్యవతి, గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్, గజ్వేల్ వ్యవసాయాధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
నోటికాడి కూడు కొట్టుకుపోయింది
పంటలన్నీ నీటి పాలు ఆరుగాలం కష్టం.. వర్షార్పణం కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతలు 1.16 లక్షల ఎకరాల్లో పంటలు నష్టం మెదక్: ‘చేతికొచ్చిన పంట నీటిపాలైంది.. ఆరుగాలం కష్టపడి బోరుబావి ఆధారంగా రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తే వరద ఉధృతికి పంటతో పాటు బోరుమోటార్‌సైతం కొట్టుకు పోయి మాకు బతుకు దెరవు లేకుండా పోయింది. మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి సారూ..’ అంటు మెదక్ మండలం అవుసులపల్లి గ్రామానికి చెందిన రైతు కొండపురం సిద్ధిరాములు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇలా సిద్ధిరాములు దుస్థితేకాదు జిల్లాలోని వేలాది మంది అన్నదాతల పరిస్థితి ఇలాగే ఉంది. వారం రోజులుగా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురవటంతో చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లి లక్షలాది ఎకరాల పంటలు కొట్టుకుపోయాయి. జిల్లాలో మంజీర నది 120 కిలో మీటర్ల మేర ప్రవహిస్తుండగా, ఇందులో కౌడిపల్లి, పాపన్నపేట, మెదక్, కొల్చారం, మనూర్తోపాటు తదితర మండలాల పరిధిలోని వందల గ్రామాలను తాకుతూ ప్రవహిస్తుంది. దీని ఆధారంగా రైతులు వేలాది ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. మంజీర నదిని ఆనుకుని ఉన్న అనేక వరిపంటలు నీటి పాలయ్యాయి. ఈయేడు అధికారిక లెక్కల ప్రకారం.. జిల్లాలో వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి తదితర పంటలు 9 లక్షల 69వేల ఎకరాల్లో సాగు చేయగా వరద ఉధృతికి లక్షా 16 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో కొన్ని పంటలు కొట్టుకు పోగా మరికొన్ని పంటలపై ఇసుకమేటలు కప్పాయి. కొన్ని పంటలు ఇంకానీటి ముంపులోనే చిక్కుకున్నాయి. గడిచిన రెండు సంవత్సరాల్లో తీవ్ర అనావృష్టితో వ్యవసాయం పూర్తిగా మరుగున పడగా పల్లెలు వదిలి రైతాంగం పొట్ట చేతపట్టుకుని పట్టణాలకు వలస వెళ్లారు. ఖరీఫ్సీజన్లో పట్టణాలను వదిలి పల్లెలకు చేరుకుని బోరుబావుల ఆధారంగా కొందరు, వర్షాధారంగా మరికొందరు పంటలను సాగు చేశారు. అనేక కష్టనష్టాలకోర్చి పంటలను సాగు చేసే తీరా పంటలు చేతికందే సమయంలో వరదపాలయ్యాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మాకు బతుకు దెరవు ఏమిటని కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య తప్ప మరోమార్గంలేదని ఆవేదన చెందుతున్నారు. 3 ఎకరాలు కొట్టుకుపోయింది ఎర్రకుంట వెనకాల ఉన్న 3 ఎకరాల పొలంలో రూ.60 వేల అప్పులు చేసి వరిపంట సాగు చేశాను. కుంటపొంగి వరిపంట పూర్తిగా కొట్టుక పోయింది. మరో నెలరోజుల్లో చేతికందుతుందనగా భారీవర్షాలతో పంటంతా నీటిపాలైంది. బతుకు దెరవు లేకుండా పోయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి . - రైతు చెవిటి పోచయ్య, మక్తభూపతిపూర్ ప్రభుత్వం ఆదుకోవాలి రెండు ఎకరాల వరి పంటను బోరుబావి ఆధారంగా సాగు చేశాను. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండి చేతికందిన వరిపంట పూర్తిగా నీటిలో మునిగి పోయింది. ప్రభుత్వం ఆదుకోంకుంటే ఆత్మహత్య తప్ప మరో మార్గంలేదు. - చిక్కుల గట్టయ్య, తిమ్మానగర్ -
ముంపు.. ముప్పు...
ముంపునకు గురవుతున్న మంజీరా పరీవాహక గ్రామాలు భారీగా పంటనష్టం.. ప్రజల ఆందోళన జిల్లాతో సంబంధాలు తెగిన గౌడ్‌గాంజన్‌వాడ గ్రామం నది తీవ్రత పెరిగితే గ్రామాల్లోకి రానున్న మంజీర బ్యాక్‌వాటర్ మనూరు: దశాబ్దకాలంలో ఎన్నడు లేనివిధంగా మంజీరా నది మనూరు మండలంలో తీవ్ర ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఎన్నడు లేనివిధంగా నది పరీవాహక గ్రామాల్లో పంటలు భారీగా మునిగిపోయాయి. నది వెంట ఉన్న ముంపు భూములే కాకుండా కొత్తగా వందలాది ఎకరాల భూముల్లోకి వదర నీరు వచ్చి చేరుతోంది. దీంతో లక్షలు వెచ్చించి సాగుచేసుకున్న పంటలు నీటమునిగాయి. ప్రభుత్వం రైతులను ఆదుకుంటేనే బతుకుదెరువు ఉంటుందని రైతులు అంటున్నారు. అప్పులు తెచ్చి సాగుచేసుకున్న పంటలు పూర్తిగా కళ్లముందే మునిగిపోవడం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం తక్షణ సాయం అందిస్తేనే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. కారముంగి శివారులోనే దాదాపుగా 800ఎకరాలు, గౌడ్గాంజన్వాడలో 600ఎకరాలు, తోర్నాల్, పుల్‌కూర్తి, గుడూర్ బోరంచ, రాయిపల్లి శివారులో 6వేల ఎకరాలకు పైగా పంట మునిగిందని ఆయా గ్రామాల రైతులు అంటున్నారు. ముంపునకు గురైన గ్రామాలు ఇవే మంజీరా నీటి మట్టం రోజురోజుకు పెరుగుతుండటంతో మండలంలోని రాయిపల్లి, ధన్వార్, బోరంచ, బెల్లాపూర్, బాదల్గాం, పుల్‌కూర్తి, అతిమ్యాల్, తోర్నాల్, గుడూర్, మెర్గి, షాపూర్, కారముంగి, ఔదత్పూర్, గోందేగాం, గౌడ్‌గాంజన్‌వాడ తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో సాగులో ఉన్న చెరుకు, మినుము, కంది పంటలు పూర్తిగా మునిగిపోయాయి. నీటి మట్టం పెరిగితే ప్రమాదమే.. మంజీరలో నీటిమట్టం పెరిగితే పరీవాహక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే గౌడ్గాం జన్వాడ గ్రామానికి జిల్లాతో సంబంధాలు తెగిపోయాయి, కాగా బెల్లాపూర్, ముగ్దుంపూర్, బాదల్గాం, పుల్‌కూర్తి, తోర్నాల్, ఔదత్పూర్ గ్రామాల్లోకి మంజీరానీరు వచ్చే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. సహాయక చర్యలకు గాను అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. -
నేలల్లో తగ్గుతున్న సారం
రసాయనిక ఎరువులు వాడకమే కారణం పడిపోతున్న పంటల దిగుబడి సేంద్రియంతో ఈ దుస్థితికి అడ్డుకట్ట గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహాలు, సూచనలు గజ్వేల్: రసాయనిక ఎరువులు విచక్షణ రహితంగా వాడటం వల్ల భూముల్లో సారం తగ్గిపోయి పంటల దిగుబడి కూడా పడిపోతున్నది. రసాయనిక ఎరువుల వాడటంతో వాతావరణ కాలుష్యం తలెత్తి రసాయనిక ప్రమేయమున్న పంటల ఉత్పత్తి జరుగుతున్నది. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేయడానికి రైతులు సేంద్రియ ఎరువుల వాడకంపై దష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ అంశంపై గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ (సెల్: 7288894469) అందించిన సలహాలు, సూచనలు ఇవి... 1. పంటకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలను సేంద్రియ ఎరువుల ద్వారా అందించవచ్చు. 2. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నపుడు సేంద్రియ ఎరువులు... భూమి పొరల్లో ఉండే నీటిని మొక్కలకు అందేవిధంగా చేస్తాయి. 3. సేంద్రియ ఎరువులు భౌతిక లక్షణాలను ప్రభావితం చేస్తాయి. ఇసుక నేలల్లో మెత్తని మట్టి శాతాన్ని పెంచడానికి, నీటిని పట్టి ఉంచే శక్తిని పెంపొందించడానికి దోహదపడతాయి. ఫలితంగా మొక్కలు పరిస్థితులకు తట్టుకొని పెరగడానికి వీలవుతుంది. 4. వివిధ రకాల ఎరువుల వల్ల కలిగే సమస్యలను సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పరిష్కరించుకోవచ్చు. 5. నేలల్లో మొక్కలకు మేలు చేసే అనేక రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల వద్ధికి సేంద్రియ ఎరువులు ఆహారంగా ఉపయోగపడతాయి. సేంద్రియ ఎరువుల లభ్యత 1. పశువుల పెంటను, పేడను కంపోస్ట్ అనే పద్ధతి ద్వారా నిల్వ చేయడం ద్వారా పోషకపదార్థాలు నష్టంకాకుండా కాపాడుకోవచ్చును. 2. కోళ్ల ఎరువును, బాతుల ఎరువును, పందుల పేడను, గొర్రెల పెంటను పోగుచేసి కుళ్లిపోయేలా చేసి ఉపయోగించవచ్చు. 3. గృహ సంబంధమైన వ్యర్థ పదార్థాలలో, కొయ్యబొమ్మల తయారీలో లభించే వ్యర్థ పదార్థాలు, తినడానికి ఉపయోగించిన ఆకులు, ఆయిల్కేక్ మొదలగునవి. సేంద్రియ ఎరువుల రకాలు కంపోస్ట్ ఎరువులు సాధారణంగా గ్రామాల్లో వివిధ పంటల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలతో కంపోస్ట్‌ను తయారు చేస్తారు. కలుపు మొక్కలు, తాలు, చెరకు ఆకులు, వేరుశనగ పొట్టు, పేడ మొదలైనవి కంపోస్ట్ తయారీకి ఉపయోగపడతాయి. కంపోస్ట్ తయారీకి ముందుగా ఆరు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతుగల గుంతలను తవ్వాలి. ఈ గుంతలలో పంటల అవశేషాలను 30సెం.మీ మందం పొరలుపొరలుగా నింపాలి. నేల మట్టం నుంచి 4.5ఎత్తు వరకు నింపి ఆపై మట్టిపొర గుంతను పూడ్చాలి. మూడు నెలల్లో గుంతలోని ఎరువు పంటలకు ఉపయోగపడేవిధంగా మారుతుంది. పచ్చిరొట్ట ఎరువులు పచ్చి రొట్ట ఎరువులు సస్యజాతికి చెందిన జనుము, పిల్లిపిసరా, జీలుగా లాంటి పంటలను పొలంలో వేసి పూత సమయంలో కోసి కలియదున్నడం, పచ్చి ఆకు లభించని చోట రైతులు పచ్చి రొట్టలు పెంచి కలియదున్నుతారు. పచ్చిరొట్ట ఎరువు వరుసగా 5సంవత్సరాలు చౌడుభూముల్లో వాడితే చౌడు ప్రభావం తగ్గి పంటల దిగుబడి పెరుగుతుంది. బయో ఫర్టిలైజర్స్ పప్పుజాతికి చెందిన మొక్కలలో వేరు బుడిపెలు ఉంటాయి. వీటిలో రైజోబియం అనే బాక్టీరియా గాలిలోని నత్రజని తీసుకొని మొక్కలకు అందించడానికి ఉపయోగపడుతుంది. -
50 వేల హెక్టార్లలో పంటనష్టం
ఎర్రవల్లిలో పంటల పరిశీలించిన జేడీ మాధవీశ్రీలత జగదేవ్‌పూర్: రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలో నేటి వరకు 50 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయ సంచాలకులు మాధవీ శ్రీలత అన్నారు. శనివారం సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో సోయాబీన్ పంటలను ఆమె పరిశీలించారు. అనంతరం ఇటిక్యాలలో పత్తి, వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కురిసిన అధిక వర్షాల వల్ల పంటల చాలా దెబ్బతిన్నాయన్నారు. రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తూ పంటనష్టం అంచనా వేస్తున్నామన్నారు. జిల్లాలో అధికంగా సోయాబీన్ పంటకు నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఇలాగే వర్షాలు కురిస్తే పత్తి, కంది పంటలు చాలా వరకు దెబ్బతింటాయన్నారు. ఎర్రవల్లిలో సోయాబీన్ చాలా వరకు దెబ్బత్నిదన్నారు. గింజ గట్టిపడే సమయంలో వర్షం పడడంతో పంట నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. పది రోజలయితే సోయాబీన్ పంట రైతుల చేతికందేందని తెలిపారు. జిల్లాలో పంట నష్టం వివరాలు జిల్లాలో ఇప్పటి వరకు పంట నష్టం వివరాలు ఇలా ఉన్నాయని జేడీ చెప్పారు. వరి- 3,100 వేల ఎకరాలు, మొక్కజొన్న 25 వేలు, పత్తి 11,700, సోయాబీన్ 6,800 వేలు, కంది 1,350, మినుము 140, జొన్న 64 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఇంకా పంట నష్టంపై సర్వే కొనసాగుతోందన్నారు. వర్షాలు ఇలాగే పడితే మరింత నష్టం పెరుగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామన్నారు. రబీకి ప్రణాళిక తయారు చేశామని, శనగ విత్తనాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డాటా సెంటర్ శాస్త్రవేత్త శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, ప్రవీణ్ ఎఈఓ దామోదర్ తదితరులు ఉన్నారు. -
నీటమునిగిన పంటలు
చెరువులకు జలకళ పొంగిపొర్లుతున్న వాగులు వంకలు రాయికోడ్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పంట పొలాలు నీట మునిగాయి. మండలంలోని రాయిపల్లి, కర్చల్, మోరట్గా, మామిడిపల్లి, ఇందూర్ సిరూర్, దౌల్తాబాద్ తదితర గ్రామాల శివార్లలో సాగు చేసిన కంది, పత్తి, జొన్న, సోయాబీన్ తదితర పంటలు నీట మునిగాయి. వారం రోజుల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నీటి వనరుల పరిసరాల్లోని పంట పొలాల్లోకి నీరు చేరింది. నీటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నా పంటలు చేతికందే పరిస్థితులు లేవని సాగు రైతులు చెబుతున్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు మండలంలోని ఆయా గ్రామాల్లో నిట మునిగిన పంటల వివరాలను సేకరించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద నీరు పెద్ద ఎత్తున మంజీర నదిలోకి చేరింది. మండలంలోని 18 గ్రామాల శివార్ల నుంచి మంజీర నది ప్రవహిస్తోంది. నదిలోకి భారీగా వరద నీరు చేరడంతో ఆయా గ్రామాల శివార్లలోని పంట భూముల్లో సాగు చేస్తున్న పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. మంజీర నదికి సమీపంలోని పంట పొలాల్లోని పంటలు అసలే చేతికందేలా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా మండలంలోని ఇందూర్, హస్నాబాద్, సింగితం, జంమ్గి, కుసునూర్, ఔరంగానగర్ తదితర గ్రామాల్లోని చెరువులుకు జలకళ వచ్చింది. చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అతిగా పిరికారీ చేస్తే అనర్థం
పురుగుమందుల కొనుగోలు, వాడకంపై జాగ్రత్తలు పాటించాలి జహీరాబాద్ ఏడీఏ వినోద్‌కుమార్ జహీరాబాద్ టౌన్: తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకోవడానికి పురుగు మందులు పిచికారీ చేస్తాం. అయితే, వాటి కొనుగులుతో పాటు వాడకంలోనూ రైతులు జాగ్రత్తలు పాటించాలని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్‌కుమార్(ఫోన్: 72888 94426) పేర్కొన్నారు. పంటలకు విచక్షణ రహితంగా పురుగు మందులు పిచకారి చేసినా ప్రమాదకరమని హెచ్చరించారు. మందులు కొనుగోలు చేసే ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మందుల కొనుగోలులో మెలకువలు లైసెన్సు కలిగిన అధీకత డీలర్ వద్దే పురుగుమందులు కొనుగోలు చేయాలి. మందుల ప్యాకింగ్, డబ్బాలపై తయారీ తేది, గడువు పరిశీలించాలి. గడువు దాటిన ముందులను ఎట్టి పరిస్థితిల్లో తీసుకోవద్దు. నిర్ణీత ప్యాకింగ్, సీల్ ఉన్న ముందులనే కొనుగోలు చేయాలి. లీకేజీతో ఉన్న డబ్బాలను తీసుకోవద్దు. కొనుగోలు చేసే ముందు రశీదు, బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్లులో మందు పేరు, కంపెనీ వివరాలు, బ్యాచ్ నంబర్, రైతు సంతకం మొదలైనవి ఉండాలి. రైతు నష్టపోయినప్పుడు నష్టపరిహారం పొందడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన మందులను కొనేముందు వ్యవసాయ అధికారులను సంప్రదించడం ఉత్తమం. పిచికారీలో జాగ్రత్తలు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి, సిఫార్సు చేసిన మందులను మాత్రమే పంటలకు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టే మందులను మందులు వాడాలి. తక్కువ కాలంలో విష ప్రభావం కోల్పోయే సస్యరక్షణ మందులు, బయోఫెస్టిసైడ్ మందులను మాత్రమే వాడాలి. వ్యవసాయ అధికారులు సూచించిన మోతాదులో, సరైన సమయంలో, సరైన స్ర్పేయర్ ఉపయోగించాలి. పంటలను కోసే ముందు సాధ్యమైనంత వరకు సస్యరక్షణ మందులను పిచికారీ చేయరాదు. పురుగు మందులను చల్లిన చోట పశువులను మేతకు తీసుకెళ్లరాదు. పురుగుమందు ఉపయోగించిన స్ప్రేయర్లను తాగు నీటి చెరువులు, కుంటల్లో శుభ్రం చేయరాదు. -
కన్నీటి సాగు!
ఈసారీ తప్పని తిప్పలు కరుణించని వరుణుడు ఎండుతున్న పంటలు మొక్క మొక్కకు నీరు పోస్తూ.. రైతన్న పడరాని పాట్లు శివ్వంపేటు/చేగుంట/చిన్నశంకరంపేట: మెతుకుసీమ రైతు కంట కన్నీరే.. రెండేళ్లుగా కరువుతో విలవిల్లాడిన రైతు ఎన్నో ఆశలతో ఖరీఫ్ సాగు చేయగా.. ముందు మురిపించిన వరుణుడు.. పంటలు ఎదిగే కీలక సమయంలో ముఖం చాటేశాడు. దీంతో పంటలన్నీ ఎండుముఖం పట్టాయి. చెల్క నేలల్లో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. పరిస్థితి ఇలాగే ఉంటే.. మరి కొద్ది రోజుల్లో నల్ల రేగడి భూముల్లో పంటలు కూడా నాశనమయ్యే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేయగా కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొంది. పలువురు రైతులు ఇతర ప్రాంతాల నుంచి బిందెల ద్వారా నీటిని తీసుకువచ్చి మొక్కమొక్కకు నీరు పోస్తూ పాట్లుపడుతున్నారు. శివ్వంపేట, చేగుంట, చిన్నశంకరంపేట మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాగు బాగేనా?
సాధారణం కన్నా తక్కువ వర్షాలు విస్తీర్ణంలో సగం ఎండుముఖం అయోమయంలో రైతాంగం నర్సాపూర్: సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురవడంతో సాధారణ సాగు విస్తీర్ణం కన్నా తక్కువ సాగు చేసినప్పటికీ సాగు చేసిన పంటలు ఎండు ముఖం పట్టాయి. వర్షాకాలం సీజన్లో మూడు నెలలు గడుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నందున రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జూన్, జూలైలో అంతో ఇంతో వర్షాలు కురవడంతో ఆయా పంటలు సాగు చేయగా ప్రస్తుతం వర్షాలు కురవ నందున అన్ని రకాల పంటలు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు వృధా అయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక వరి నాట్లు వేయకపోవడంతో నారుమళ్లు చాలా చోట్ల ఎండుతున్నాయి. కాగా మొక్కజొన్న ,జొన్న తదితర వర్షాధార పంటలు సైతం ఎండుతున్నాయి. నియజకవర్గంలో వర్షాలతో పాటు బోరు బావులపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వర్షాలు లేక చెరవులు కుంటలు నిండక పోవడంతో ఆయకట్టు భూములు ఇప్పటికే బీడు భూములుగా మారాయి. కాగా బోరు బావుల కింద సాగు చేసినప్పటికీ బోర్ల నుంచి నీరు తక్కువగా రావడంతో ఆ పంటలు సైతం ఎండుముఖం పడుతున్నాయి. నర్సాపూర్ మండలంలో తక్కువ వర్షాలు తక్కువ సాగు మండలంలో జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురిశాయి. మొదట్లో వర్షాలు కురవడంతో చాలా చోట్ల వరి, మొక్కజొన్న, జొన్న కంది తదితర పంటలు సాగు చేశారు. కాగా వరి 2681హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం కాగా 1112 హెక్టార్లు నాటు వేయగా మొక్కజొన్న సాధారణం కన్నా సుమారు మూడు వందల హెక్టార్లు ఎక్కువ విస్తీర్ణంలో విత్తనం వేశారు. కౌడిపల్లి మండలంలో అధ్వానం మండలంలో మూడు నెలల్లో 700మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం ఉండగా 295 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవడంతో సాగు సైతం తక్కువగా నమోదైంది. మండలంలో వరి 4500 ఎకరాలలో సాగు చేయాల్సి ఉండగా 1200 ఎకరాల్లో మాత్రమే వేశారు. మొక్కజొన్న ఐదు ఎకరాలకు గాను 3125 ఎకరాల్లో వేయగా, కంది రెండు వేల ఎకరాలకుగాను 1550 ఎకరాల్లో, జొన్న మూడు వందల ఎకరాలకు గాను 150 ఎకరాల్లో సాగు చేశారు. కాగా సాధారణ సాగు విస్తీర్ణంలో సగానికి తక్కువ పంటలే సాగు చేయగా వర్షాలు లేక సాగు చేసిన పంట పొలాల్లో చాలా మటుకు ఎండు ముఖం పట్టడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెల్దుర్తి మండలంలో సగానికి సగం పంటలు ఎండిపోతున్నాయి. మండలంలో ఇప్పటి వరకు మూడు నెలల కాలంలో 635 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా 248 మిల్లీ మీటర్ల వర్షపాతమే కురిసింది. కాగా పంటలు సైతం సగానికి పైగా ఎండుముఖం పట్టాయి.మ ండలంలో వరి పంటను 2026 హెక్టార్లకు గాను 1280 హెక్టార్లలో మాత్రమేసాగు చేయగా అందులో 40 శాతం ఎండిందని తెలిసింది. కాగా మొక్కజొన్న 730 హెక్టార్లలో సాగు చేయగా అందులో సగం ఎండుముఖం పట్టిందని తెలిసింది. కొల్చారం మండలంలో సైతం సాగు అధ్వానంగా ఉంది. మండలంలో మూడు నెలల కాలంలో 620 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 329 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలో వరి, మొక్కజొన్న తదితర పంటలను 5700హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 4748 హెక్టార్లలో సాగు చేసినప్పటికీ, సగం పంటలు ఎండిపోయాయి. హత్నూర మండలంలో సాధారణంలో సగమే.. మండలంలో సాధారణ వర్షపాతంలో సగం వర్షాలు కురిశాయి. జూన్ నెలలో 190 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 129 మిల్లీమీటర్లు. జూలై నెలలో 237కు గాను 171మి.మీ, ఆగస్టులో 221 మిల్లీమీటర్లకు గాను ఇప్పటి వరకు 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరి సుమారు 3480 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా మండలంలో 1756 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేయగా, మొక్కజొన్న పంటను 633 హెక్టార్లలో విత్తనం వేయాల్సి ఉండగా వర్షాలు తక్కువగా ఉన్నందున ఎక్కువ మంది రైతులు విత్తనం వేయడంతో 1086 హెక్టార్లలో విత్తనం వేసినట్లు నమోదైంది. శివ్వంపేట మండలంలో సైతం పరిస్థితులు అధ్వానంగానే ఉంది. -
‘మాడు’తోంది
వేసవిని తలపిస్తున్న ఎండలు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కానరాని వర్షాలు.. ఎండుతున్న పంటలు ఆందోళనలో అన్నదాతలు.. పంటల రక్షణకు పడరాని పాట్లు మెదక్: ఎండలు మండుతున్నాయి. ఇరవై రోజులుగా వేసవిని తలపిస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్లో వర్షాలు జోరుగా కురిసి చెరువులు, కుంటలు నిండాలి. కాని వేసవిని తలపిస్తూ ఎండలు మండుతుండటంతో ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయి. వాటిని రక్షించుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న పంట కంకిదశలో ఉంది. వర్షాలు లేకపోవడంతో పంట పెరుగుదల ఆగిపోయింది. దీంతో ఆ పంట రక్షణకు ఇంటిల్లిపాది నీళ్లుపోసి రక్షించే పనిలో పడ్డారు. రెండేళ్లుగా కరువు, కాటకాలతో విలవిల్లాడిన రైతులు పట్టణాలకు వలసవెళ్లిపోయారు. ఈసారైనా సాగు చేసుకుని జీవనం సాగిద్దామని పల్లెలకు వస్తే.. వారికి ఈసారీ నిరాశే మిగులుతోంది. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుములు, కంది, పెసర్లను అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు సాగుచేశారు. 1.22లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, 27 వేల హెక్టార్లలో పెసర, 16 వేల హెక్టార్లలో మినుములు, 40 వేల హెక్టార్లలో కంది పంటలను సాగుచేశారు. అలాగే 82 వేల హెక్టార్లలో వరి సాగుచేయాల్సి ఉండగా, సరైన వర్షాలు లేక 35 వేల హెక్టార్లలోనే సాగుచేశారు. ఈ నెలలో వర్షాలు పూర్తిగా ముఖం చాటేయడంతో ఎండలు మాత్రం వేసవిని తలపించేలా దంచి కొడుతున్నాయి. ప్రస్తుత వర్షాకాల సీజన్లో 28 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావొద్దని, అయితే మూడు రోజులుగా 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం వేళలో ఎండతీవ్రతకు ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ఫ్యాన్లు, కూలర్స్ లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఎట్లా బతకాలో.. కరువు రక్కసితో రెండేళ్లుగా బతకడం చాలా కష్టమైంది. కనీసం గ్రామాల్లో పనిచెప్పేవారే లేకపోవడంతో ఉప్పిడి ఉపవాసం ఉన్నాం. ఈసారైనా వర్షాలు కురుస్తాయనుకుంటే మళ్లీ కరువే ముంచుకొస్తుంది. ఎట్లా బతకాలో తెలియడం లేదు. ఎకరం పొలంలో రూ.15వేల అప్పుచేసి మొక్కజొన్న వేశాను. వర్షాలు లేక ఎండిపోతోంది. - మార్గం వెంకయ్య, రైతు, రాజ్‌పల్లి అప్పు చేసి మొక్కజొన్న వేసిన ఈయేడు వర్షాలు సరిగా కురవక పోవడంతో 3 ఎకరాలలో రూ.30వేలు అప్పులుచేసి మొక్కజొన్న వేశాను. ప్రస్తుతం పంట కంకిదశలో ఉంది. వర్షాలు కురవక పోవడంతో గింజలు గట్టి పడటం లేదు. పెట్టుబడి కూడా చేతికొచ్చేటట్లు లేదు. బతుకును తలుచుకుంటేనే భయంగా ఉంది. - గురజాల నర్సింలు, రైతు, రాజ్‌పల్లి -
‘పొట్ట’కొడుతోంది
ముఖం చాటేసిన వర్షాలు ఎండుతున్న పంటలు గింజవేసే దశలో వాడుతున్న కంకులు ఆందోళనలో రైతన్నలు మెదక్: రెండేళ్లుగా కరువుతో విలవిల్లాడిన రైతులు.. ఈసారైనా సాగు చేసుకుని కష్టాల నుంచి గట్టెక్కుదామనుకున్నా.. నిరాశే మిగులుతోంది.. ముందు మురిపించిన వర్షాలు ఆ తరువాత కనుమరుగు కావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంటలు సరిగ్గా పొట్ట పోసుకునే దశలో వర్షాలు లేకపోవడంతో ఎండు ముఖం పడుతున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. వరుణుడు కరుణించకపోతే మా బతుకులు ఆగమేనని వారు వాపోతున్నారు. సగానికిపైగా బీడు భూములే కార్తెలన్నీ కరిగిపోతున్నాయి.. కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. జిల్లాలో గడిచిన రెండున్నర నెలల వర్షాకాలంలో ఇప్పటి వరకు సగమే వర్షపాతం నమోదు కావడంతో చెరువు, కుంటల్లోకి చుక్కనీరు రాలేదు. ఇప్పటి వరకు రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, ప్రస్తుతం మఖ కార్తె కూడా కరిగిపోతోంది. జూన్‌లో 170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 190 నమోదైంది. జూలైలో 370 మి.మీ. గానూ 340 మి.మీ. నమోదైంది. ఆగస్టు మాసంలో 370కి గానూ ఇప్పటి వరకు కేవలం 27మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. రెండున్నర నెలలుగా.. 910 మిల్లీమీటర్ల వర్షపాతానికిగానూ కేవలం 557 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ లెక్కన 353 మిల్లి మీటర్ల వర్షపాతం తక్కువగా నమోదైంది. తక్కువ వర్షపాతం నమోదు కావడంతో నీటి వనరులైన చెరువు, కుంటల్లోకి ఏమాత్రం నీరు చేరలేదు. దీంతో ఆయకట్టు భూములన్నీ బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. అలాగే నియోజకవర్గంలోని ఘణపురం ప్రాజెక్ట్‌లోకి నీరురాకపోవడంతో 21వేల ఆయకట్టు భూమి బీడుగానే ఉంది. బోరుబావుల ఆధారంగా సాగుచేసిన వరిపంటలు సైతం ఎండుముఖం పడుతున్నాయి. ఆరుతడి పంటలైన కందులు, పెసర్లు, జొన్నలు వంటి పంటలు సైతం ఎండుముఖం పడుతున్నాయి. మూడు ఎకరాల్లో వరి ఎండింది మూడెకరాల పొలంలో రెండు బోర్లు వేశాను. ముందుగా వర్షాకాల సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవడంతో రూ.40వేల అప్పు చేసి సాగుచేశాను.వర్షాలు లేక బోరుబావుల్లో నీటి మట్టం పెరగలేదు. దీంతో వేసిన పంట ఎండిపోతోంది. - పాపన్నగారి కిష్టారెడ్డి, బ్యాతోల్ దిక్కుతోచడంలేదు నాలుగు ఎకరాలలో రెండు బోర్లు ఉన్నాయి. వాటి ఆధారంగా సుమారు రూ.80వేల అప్పు చేసి వరిపంట సాగుచేశాను. వర్షాలు లేక బోరుబావుల్లో నీటి మట్టం తగ్గిపోయింది. వేసిన పంట ఎండిపోతోంది. దీనికితోడు పురుగు తగిలింది. ఏం చేయాలో తోచడంలేదు. - కెతావత్రవి, బ్యాతోల్ తండా. -
మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్ లో ఉద్రిక్తత
మెదక్: మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీటీసీ ప్రతాప్ రెడ్డి పంట భూములను ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఎంపీటీసీ ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకర్తిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంలో భాగంగా ఆయన పంట పొలాలపై దాడులు చేశారు. గ్రామస్తులు విధ్వంసానికి దిగారని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోనికి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
అకాల వర్షాలకు పంట నష్టం
-
ఉసురు తీసిన వర్షం
వారం రోజులుగా వాన దెబ్బతిన్న మొక్కజొన్న.. నేలవాలిన వరి పైరు.. మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య నిర్మల్(మామడ), న్యూస్‌లైన్ : రైతన్నకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు జిల్లాలో వేల హెక్టర్లలో పంటలు నేలవాలాయి. పంటలను చూసిన రైతులు మనస్తాపం చెందుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం మామడ మండలం కమల్‌కోట్ గ్రామానికి చెందిన రైతు రేని పెద్దోల్ల మల్లేష్(28) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్లేష్ తనకున్న రెండెకరాల్లో ఒక ఎకరం మొక్కజొన్న, ఒక ఎకరంలో వరి పంటను సాగు చేస్తున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న పంట దెబ్బతినడంతోపాటు వరి పైరుకు తెగులు ఆశించింది. ఉదయం చేను వద్దకు వెళ్లాడు. దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపం చెందాడు. సాగు కోసం బ్యాంకులో రూ.60 వేల అప్పు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలని సాయంత్రం ఇంట్లో పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు నిర్మల్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందాడు. మల్లేష్‌కు భార్య లత, ఇద్దరు కూతుళ్లు వైష్ణవి, వర్షిత ఉన్నారు.ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మల్లేష్ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
జిల్లాలో 3.38 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
సాక్షి, కొత్తగూడెం : అకాల వర్షం అన్నదాతలకు గుండె కోత మిగిల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం జిల్లాలోని పంటలపై తీవ్రంగా పడింది. వారం రోజుల పాటు కురిసిన వర్షంతో జిల్లా వ్యాప్తంగా 3.38 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా 2.54 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. ‘న్యూస్‌లైన్’ క్షేత్ర స్థాయిలో చేసిన పరిశీలన ప్రకారం జిల్లా వ్యాప్తంగా రూ. 310.72 కోట్ల మేర రైతులు నష్టపోయినట్లు అంచనా. దెబ్బతిన్న పంటలు చూసి మనోవేదనకు గురైన రైతుల గుండెలు ఆగిపోతున్నాయి. జిల్లాలో ఈనెల 21 నుంచి కురిసిన వర్షాలతో పత్తి 2.54 లక్షల ఎకరాలు, వరి 28 వేలు, మిర్చి 15 వేలు, మొక్కజొన్న 21,775 ఎకరాలు, పొగాకు, వేరుశనగ, ఇతర కూరగాయల పంటలు 18 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఇందులో పత్తిదే సింహభాగం కావడం గమనార్హం. ప్రధానంగా వైరా నియోజకవర్గంలో 70 వేల ఎకరాల్లో, మధిరలో 59 వేలు, పాలేరులో 30 వేల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతినడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో వరి నేలవాలడంతో పాటు పనలు పూర్తిగా నీట మునిగాయి. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని బయ్యారంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోయారు. అశ్వారావుపేటలో వేరుశనగ, పొగాకు పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ఈ ఆకాల వర్షం రైతులను నిండా ముంచినా జిల్లా యంత్రాంగం మాత్రం ఇంకా నిద్రావస్థలోనే ఉంది. కాగా, గతంలో మాదిరిగానే 50 శాతం లోపే నష్టాన్ని చూపించి రైతులకు పరిహారం ఇవ్వకుండా చూసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుండడం బాధితులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఆగిపోతున్న రైతుల గుండెలు.. రూ. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు కళ్ల ముందే వర్షార్పాణం అవుతుంటే మనోవేదనకు గురైన రైతులు గుండెపోటుతో మరణిస్తున్నారు. సింగరేణి (కారేపల్లి) మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన గద్దికొప్పుల రామయ్య (40) పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. అలాగే కొత్తగూడెం మండలం బేతంపూడిలో శనివారం పత్తి చేలో నీరు తొలగించేందుకు వెళ్లి నష్టపోయిన పంటను చూసి తేజావాత్ రాజు అనే రైతు సొమ్మసిల్లి పడిపోయాడు. పెనుబల్లి మండలం బయన్నగూడెం గ్రామానికి చెందిన బొప్పిశెట్టి చెన్నారావు నాలుగు ఎకరాలలో పత్తి సాగు చేశారు. వర్షాలకు పంట దెబ్బతినడంతో మనోవేదనకు గురై గుండెపోటుతో శనివారం మృతి చెందారు. గతంలో జల్, లైలా, నీలం తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయినా జిల్లా యంత్రాంగం కాకి లెక్కలు వేసిందని, 50 శాతం లోపు నష్టపోయిన పంటలను కూడా పరిగణలోకి తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


