బొంతపల్లిలో వరి పంటను పరిశీలిస్తున్న ఏఈఓ చైతన్య
జిన్నారం: మండలంలోని బొంతపల్లి, అండూర్ గ్రామాల్లో వ్యవసాయ అధికారులు వర్షం కారణంగా నష్టపోయిన పంటలను బుధవారం పరిశీలించారు. అండూర్‌లో మండల వ్యవసాయశాఖ అధికారి సాల్మన్‌నాయక్ నష్టపోయిన మొక్కజొన్న, వరి, జొన్న పంటలను ఆయన పరిశీలించారు. సుమారు వంద ఎకరాల్లో వివిధ రకాల పంటలు వర్షం కారణంగా నష్టపోయాయని ఆయన తెలిపారు.
బొంతపల్లిలోని వీరన్న చెరువు అలుగు పారటంతో వరి పంట నాశనమైందని రైతులు అధికారులకు తెలిపారు. ఏఈఓ చైతన్య వరి పంటలను పరిశీలించారు. బొంతపల్లిలో సుమారు 50 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నాశనమైందని చైతన్య తెలిపారు. పంట నష్టంపూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు చెప్పారు.